SonyKongara Posted August 13, 2018 Author Report Posted August 13, 2018 నేడు 10 కంపెనీల ప్రారంభం.. విస్తరణలో మరో 4 కంపెనీలు 10,300 మందికి కొత్త కొలువు మధురవాడ ఐటీ హిల్స్ కిటకిట కొత్త జోన్ అన్వేషణలో ఐటీ శాఖ కాపులుప్పాడ అభివృద్ధిపై దృష్టి ఫలిస్తున్న మంత్రి లోకేశ్ చొరవ అమరావతి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి ఐటీ కంపెనీల రాక కొనసాగుతోంది. విశాఖపట్నానికి శుక్రవారం కొత్తగా 10 ఐటీ కంపెనీలు రానున్నాయి. ఇదివరలో ప్రారంభమైన నాలుగు కంపెనీలు విస్తరణ బాట పట్టాయి. ఐటీ, బీపీవో, సాఫ్ట్‌వేర్ డిజైన్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ, మొబైల్ యాప్స్, హెచ్‌ఆర్...తదితర రంగాల్లో ఉన్న కంపెనీలు కొత్తగా విశాఖలో అడుగుపెడుతున్నాయి. ఈ కంపెనీల వల్ల సుమారు 9,300మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ శుక్రవారం ఈ కంపెనీలను ప్రారంభించనున్నారు. సుమారు మూడు గంటల పాటు ఈ కంపెనీల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో లోకేశ్ పాల్గొననున్నారు. ఉదయంనుంచి మధ్యాహ్నం వరకు ప్రతి కంపెనీని సందర్శించనున్నారు. లోకేశ్, ఐటీ విభాగం చొరవతో ఈ కంపెనీలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇవన్నీ విశాఖపట్నం నగరంలో సముద్ర తీరానికి చేరువలో ఉన్న మధురవాడ ఐటీ హిల్స్‌పై రానున్నాయి. కాగా, మధురవాడ ఐటీ హిల్స్ దాదాపు నిండిపోవడంతో...కాపులుప్పాడలో మరో ఐటీ జోన్‌ను అభివృద్ది చేస్తున్నారు. ఇక్కడున్న ప్రభుత్వ భూమిలో తొలి దశలో 100ఎకరాలను అభివృద్ది చేస్తున్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి వాటిని ఐటీ కంపెనీలకు కేటాయించాలని భావిస్తున్నారు. విస్తరణతో వేలాది ఉద్యోగాలు బీపీవో సేవలు అందిస్తున్న కాన్డ్యూయెంట్ కంపెనీ విస్తరణ ద్వారా ఐదువేలమందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ కంపెనీ ద్వారా తొలి దశలో కూడా పెద్ద సంఖ్యలోనే ఉద్యోగాలు వచ్చాయి. ఆఫ్ షోర్ డెవల్‌పమెంట్ సేవలు అందిస్తున్న సింబయోసిస్ విస్తరణ ద్వారా 100మందికి, ఇన్స్ ఫైర్ ఎడ్జ్ ఐటీ సొల్యూషన్స్ విస్తరణతో 200మందికి, పాత్రా ఇండియా బీపీవో సర్వీసెస్ ద్వారా 1600ల మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. పాత్రా ఇండియా కూడా బీపీవో సేవలు అందిస్తోంది. ఇవికాక విశాఖపట్నంలోని హెచ్‌ఎస్ బీసీ కంపెనీ విస్తరణకోసం లోకేశ్ చొరవ చూపి మాట్లాడారు. అదనంగా వెయ్యిమందికి ఉద్యోగాలు ఇచ్చేలా ఆ కంపెనీ విస్తరణ చేపట్టింది. ఇక.. కొత్తగా కొలువుతీరుతున్న సెరియం సిస్టమ్స్ కంపెనీ వెయ్యి మందికి, సహస్రమయ టెక్నాలజీస్ 500 మందికి, హిప్పో క్యాంపస్ కంపెనీ 250మందికి, సీఈఎస్ లిమిటెడ్ 110 మందికి, వివిలెక్స్ టెక్నాలజీస్ 100మందికి, ఇన్ఫోటీం కన్సల్టింగ్ సర్వీసెస్ 75మందికి, ిఎన్వోయ్ మోర్టగేజ్‌లో 60మందికి, స్వేయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ 50మందికి, వెలాంటా కేపీవో అకౌంటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 44మందికి, ఇన్‌డేటా అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 32మందికి, న్యూవి సొల్యూషన్స్ 32మందికి, బెల్ ఫ్రిక్స్ క్రిప్టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ 22మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నాయి. సంస్థలు.. సేవలు.. సీఈఎస్ లిమిటెడ్...బిజినెస్ ప్రోసెస్ మేనేజ్‌మెంట్ సేవలు సెరియం సిస్టమ్స్ కంపెనీ.. వీఎల్‌ఎ్‌సఐ అండ్ ఎంబెడెడ్ సాఫ్ట్‌వేర్ సెక్టార్‌కి గ్లోబల్ డిజైన్ సేవలు సహస్రమయ టెక్నాలజీ్‌స...ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్, మెషీన్ లెర్నింగ్, బ్లాక్‌చైన్ టెక్నాలజీ సేవలు హిప్పో క్యాంపస్ కంపెనీ.. ఇ-గవర్నెన్స్ సేవలు ఎన్వోయ్ మోర్టగేజ్.. బ్యాంకింగ్ సేవలు వివిలెక్స్ టెక్నాలజీ్‌స..సా్‌ఫ్టవేర్ డెవల్‌పమెంట్ సేవలు న్యూవి సొల్యూషన్స్.. చిరు ఫారాలకు వెబ్ అప్లికేషన్స్ సేవలు ఇన్ఫోటీం కన్సల్టింగ్ సర్వీసెస్.. బీపీవో, సాఫ్ట్‌వేర్ డెవల్‌పమెంట్ సేవలు Quote
BaabuBangaram Posted August 13, 2018 Report Posted August 13, 2018 front office lo computer use chesinantha mathrana IT company lu ayipovu ani lokesh ki cheppandi vayya Quote
SilentStriker Posted August 13, 2018 Report Posted August 13, 2018 8 hours ago, BaabuBangaram said: front office lo computer use chesinantha mathrana IT company lu ayipovu ani lokesh ki cheppandi vayya Kikiki Quote
Bahu Posted August 13, 2018 Report Posted August 13, 2018 3 minutes ago, SilentStriker said: Kikiki bongu pallipat Quote
AlaElaAlaEla Posted August 15, 2018 Report Posted August 15, 2018 On 8/13/2018 at 3:04 AM, SonyKongara said: Quote
Prince_Fan Posted August 15, 2018 Report Posted August 15, 2018 BPO jobs aa konga...vizag ki ye mogga raadhu...aavesapadaku Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.