rapchik Posted August 22, 2018 Report Posted August 22, 2018 రామ్ చరణ్ ఆడియన్స్ కు సారీ చెప్పాడు. ఈరోజు గ్రాండ్ గా విడుదల చేసిన సైరా టీజర్ ను థియేటర్లలో ప్రదర్శించలేకపోతున్నామని ప్రకటించాడు. ప్లానింగ్ లోపం కారణంగానే సైరా టీజర్ ను సిల్వర్ స్క్రీన్ పై మిస్ అయ్యామని చెర్రీ స్వయంగా ఒప్పుకున్నాడు. ఇంతకీ సైరా టీజర్ థియేటర్లలోకి ఎందుకు రాలేదు..? దీనికి రామ్ చరణ్ చెప్పిన రీజన్ ఇది. "టీజర్ ను ఇవాళ్టి నుంచి థియేటర్లలో రిలీజ్ చేద్దామని అనుకున్నాం. కానీ టీజర్ లో కొన్ని జంతువులు కూడా ఉన్నాయి. యానిమల్ బోర్డ్ అనుమతి తీసుకోవడంలో ఆలస్యమైంది. కనీసం 20రోజుల ముందే అప్లయ్ చేసుకోవాలి. ఆ విషయం మాకు తెలియదు. సో.. ఆ జాప్యం వల్లే థియేటర్లలో సైరా టీజర్ ను వేయలేకపోతున్నాం." ఇలా సైరా టీజర్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ మిస్ అవ్వడంపై క్లారిటీ ఇచ్చాడు చెర్రీ. అయితే ప్రేక్షకులు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని, 2 వారాల్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసి బిగ్ స్క్రీన్ పైకి సైరా టీజర్ ను తీసుకొస్తామని ప్రకటించాడు. రీసెంట్ గా సాక్ష్యం సినిమా కూడా ఇలానే ఇబ్బందుల్లో పడింది. ఆ బోర్డు నుంచి అనుమతి తీసుకురావడం చాలా కష్టమైంది. ఒక దశలో సినిమా కూడా వాయిదా పడుతుందేమో అనుకున్నారు. కిందామీద పడి ఆఖరి నిమిషంలో అనుమతులు తెచ్చుకున్నారు. ఇప్పుడు సైరా టీజర్ కూడా ఇదే తరహాలో అనుమతుల్లేక థియేటర్లలోకి రాలేకపోయింది. Mari intha open ga na 😂😂😂 Quote
Pumpuhaar Posted August 22, 2018 Report Posted August 22, 2018 Hey cherry kooda unnada teaser lo...nen miss aina Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.