Jump to content

a Counsellor(Slate Amarnath) question regarding this generation Girls


Recommended Posts

Posted

నా ఆంథ్రోపాలజీ పాఠాలకు అంతకు మించి కౌన్సిలింగ్ సామర్త్యానికి పెద్ద సవాల్ :

ఒక తల్లి కలిసింది . " మా అమ్మాయికి ముప్పై కావస్తోంది . పెళ్ళికి ఒప్పించలేక పోతున్నాను సార్ ! పెళ్ళెందుకు అంటుంది .." అని చెప్పింది .

"పెళ్లి , కుటుంబం సమాజానికి మూల స్థంబాలు .. అవి ప్రధానంగా నాలుగు ప్రయోజనాలను నెరవేరుస్త్తాయి . ముందుగా 1 . వ్యక్తి సెక్సువల్ నీడ్ { లైంగిక అవసరం అంటే మీకు చాల మందికి అర్థం కాక పోవచ్చు . అందుకే సెక్సువల్ నీడ్ అంటూ తెలుగు వాడుతున్నా.. } ను సమాజానికి ఆమోదయోగ్యం అయిన తీరులో తీరుస్తాయి .. " .. నా మాట పూర్తి కాక ముందే ఆమె అందుకుంది .. " ఈ కాలం పిల్లలకు లైంగిక అవసరం తీరడం కోసం పెళ్లి అవసరం ఏముంది సార్ ? మా అమ్మాయి కి { అప్పటి దాక నాకేసి చూస్తూ మాట్లాడిన ఆమె తల దించుకొని చెప్పడం కొన సాగించింది } .. అన్ని అలవాట్లు వున్నాయి . పార్టీ ల లో డ్రింకింగ్ , స్మోకింగ్ .. విదేశాలకు వెళ్ళినప్పుడు వీడ్ లాంటివి .. పార్టీ ముగిసాక తనకు నచ్చిన అబ్బాయి తో సెక్స్ .. "

"పెళ్లి అలాగే కుటుంబం రెండవ ప్రయోజనం ప్రత్యుత్పత్తి .. సంతానోత్పత్తికి దారి తీస్తుంది .. పిల్లల్ని కలిగి ఉండడం వల్ల ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ , సమాజానికి సభ్యులను అందించడం ... " నా మాట పూర్తి కాక ముందే .. ఆమె అందుకుంది .." నీకు మనవడో మానవరాలో కావాలంటే చెప్పు .. ఏదో ఒక పద్దతి లో ఇస్తాను .. దానికి పెళ్లి అక్కర లేదు .. అనాధ ను అడాప్ట్ చేసుకొంటాను .. లేదా కృత్రిమంగా గర్భాన్ని ధరిస్తాను అంటోంది . నాకున్న అలవాట్లకు ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టే అవకాశం తక్కువ అంటోంది సార్ " అంది .

మూడవ ప్రయోజనం ఆర్థికమైనది . కుటుంబం ఒక ఎకనామిక్ యూనిట్ .. కుటుంబ సభ్యుల మధ్య శ్రమ విభజన .. పరస్పర ఆర్థిక సహకారం .. " ఈ సారి కూడా నా మాట పూర్తి కాకుండానే ఆమె చెప్పడం మొదలు పెట్టింది .." మా అమ్మాయి టాప్ కంపెనీ లో ఉద్యోగం చేస్తోంది . ఏడూ రౌండ్ ల ఇంటర్వ్యూ పేస్ చేసింది . ఇప్పుడు అల్ ఇండియా హెడ్ గా ప్రమోట్ అయ్యింది . దాదాపు ఆరు లక్షల జీతం . పెళ్లి చేసుకొంటే ఇంత చురుగ్గా పని చెయ్యలేదు . భార్య భర్త లు పని చేసే స్థలం .. గర్భం .. మెటర్నిటీ .. ఇవన్నీ తన కెరీర్ ని దెబ్బ తీస్తాయి అంటోంది . పైగా తనకు త్వరలో పది లక్షల కు పైగా జీతం రాబోతోంది "

"అన్నింటికీ మించి వ్యక్తికీ సామజిక భద్రత .. ఇప్పుడు చూడండి.. ఆమె వయసులో వుంది .. బాయ్ ఫ్రెండ్ దొరకడం .. సెక్స్ అవసరం తీరడం .. ఎమోషనల్ కంఫర్ట్ కోసం ఒక మగాడు దొరకడం కష్టం కాదు . కానీ నలభై .. నలభై అయిదు దాటితే ఇక కన్నెత్తి చూసే మగాడు దొరకడు కదా .. అదే భార్య భర్తల అనుబంధం జీవితాంతం సాగుతుంది . ముఖ్యంగా మగాడికి పెళ్ళాం, స్త్రీకి భర్త అవసరం 40 దాటాకే ఎక్కువ " చెప్పాను. ఈ సారి నా మాట ముగిసింది . ఆమె కాసేపు టైం తీసుకుంది . తల ఎత్తి నా కేసి చూసింది . కళ్ళు ఎర్రగా వున్నాయి .. ఏడుపును అదుపు చేసుకొంటూ చెప్పింది " ఈ పాయింట్ నా విషయం లోనే జరగ లేదు .... ఇక నా కూతురికి ఏమని చెప్పను? " అంది . 50 వయసు దాటాక ఆమె తన భర్త తో విడాకులు తీసుకొందని నాకు అర్థము అయ్యింది . " చూసారా ఆండీ.. మీరొక బాడ్ example అయ్యారు ఆమెకు .. ఈ వయసులో ఎందుకు సెపరేట్ అయ్యారు అని అడిగా . " జీవితాంతం భరించా .. ఇక నా వల్ల కాలేదు సర్ అంది ఏడుస్తూ .. మా అమ్మాయికి ఇప్పుడు కాదు చిన్నపటి నుంచే కుటుంబం అంటే నమ్మకం పోయింది . ఆమె తానూ చుసిన నెగటివ్ విషయాలను మాత్రమే గుర్తు పెట్టుకొంటోంది . పెళ్లి కుటుంబం happiness ని చంపేస్తాయి అంటోంది . నాకు ఈ వయసులో భర్త దూరం జరిగారు . కనీసం వున్నా ఒక్క కూతురికి పెళ్లి చేసి మనవడు లేదా మనవరాలు ను ఎత్తుకొందామంటే ఆశ తీరడం లేదు" .. దాదాపు వెక్కిలతో చెప్పింది .

తల్లి బాగా చదువుకొంది. కూతురు టాప్ కాలేజీ లో డిగ్రీ .. టాప్ MNC లో పెద్ద జాబ్ .. దీనికి తోడు ఇంత కంప్లికేట్ సమస్య .. ఇప్పడు వారికీ ముఖ్యంగా అమ్మాయికి నేను ఏమని కౌన్సిలింగ్ ఇవ్వాలి ? { నాకు క్లారిటీ వుంది .. కానీ మీరు ఆలోచించండి } సమస్యకు పరిష్కారం ఏంటి ?

Posted

anna, ninnu kalavalani vundi anna. please okka saari kaluvu anna., 

 

please anna

Posted
19 minutes ago, TensionNahiLeneka said:

anna, ninnu kalavalani vundi anna. please okka saari kaluvu anna., 

 

please anna

👹 na question enti ne answer yenti

Posted
1 minute ago, whatsapp said:

👹 na question enti ne answer yenti

edi ayina, naa asnwer ide anna, nuvvu manchodivi, ninnu okkasari chudalani vundi anna. nee opika aa boomaata ki kooda leemo 

Posted
1 hour ago, TensionNahiLeneka said:

edi ayina, naa asnwer ide anna, nuvvu manchodivi, ninnu okkasari chudalani vundi anna. nee opika aa boomaata ki kooda leemo 

Danyavadalu brother me premakai sada danynuni!! Answer chepagalaru :giggle:

Posted

emundi. pillalaki talli tandri role models ..vallu ela untaro..pillalu kooda alane avutaru..they improvise and lead even better independant life.. manam mind tagi pillalaki tagoddu ante vintara?? 

Posted
44 minutes ago, sillynivas said:

emundi. pillalaki talli tandri role models ..vallu ela untaro..pillalu kooda alane avutaru..they improvise and lead even better independant life.. manam mind tagi pillalaki tagoddu ante vintara?? 

Thats true, our generation Men and women(good lokking and average) are spoiled 90%, what would they expect from their kids, example oka swathi sudhakar story bla bla!! 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...