Jump to content

Dugra gudi flyover


Recommended Posts

Posted

elections ki enka 6 months time vundi kada, why hurrying... march lo ala open chestaremo, they say its a different type of construction and needs tym .....bhavishattu ki gatti punadi ki a matram tym needed 

Posted
4 minutes ago, barney said:

elections ki enka 6 months time vundi kada, why hurrying... march lo ala open chestaremo, they say its a different type of construction and needs tym .....bhavishattu ki gatti punadi ki a matram tym needed 

Friends meeru oka illu kattalantene enni years paduthundho telusu kadha.. atlantidhi oka flyover ki 4 years ante cbn doing great

Posted
  • ఆర్థిక సంక్షోభంలో ‘సోమా’!
  • 450 మంది కార్మికులకు నాలుగు నెలలుగా జీతాలు నిల్‌
  • సమ్మెలోకి దిగిన కార్మికులు.. పనులు నిలుపుదల
  • కేంద్ర స్థాయిలో రూ.6 కోట్ల బిల్లు తిరస్కరణ
  • రీ వాల్యుయేషన్‌కు ఆదేశం.. ఇప్పట్లో కష్టమే
  • శనీశ్వరాలయం దగ్గర వయాడక్ట్‌కు రూ.6.50 కోట్లు బిల్లు పెండింగ్‌
  • ఇచ్చేది ఏపీ ప్రభుత్వమా? కేంద్రమా? మీమాంసతో నిలిచిన బిల్లు
  • కార్మికులతో సోమా ప్రతినిధుల చర్చలు
  • సంక్రాంతికి రెండు నెలల జీతం ఇవ్వటానికి సుముఖత
  • కొంతమందికే అంగీకారం..
కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులకు మళ్లీ బ్రేక్‌ పడింది. అసలే సాగదీత అనుకుంటుంటే ఇక ఇప్పుడు పూర్తిగా ఆగిపోయే పరిస్థితి వస్తోంది. కాంట్రాక్టు సంస్థ ‘సోమా ’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో బుధవారం కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఫ్లై ఓవర్‌ పనులు నిలిచిపోయాయి. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 6 కోట్ల బిల్లు ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. శనీశ్వరాలయం దగ్గర రూ. 6.50 కోట్లతో చేపట్టిన వయాడక్ట్‌ పనులకు బిల్లు చెల్లించేది రాష్ట్ర ప్రభుత్వమో, కేంద్రమో తెలియని స్థితి. వస్తాయనుకున్న ఎస్కలేషన్‌ చార్జీలు రూ. 4 కోట్లు కూడా కేంద్రం దగ్గర నిలిచిపోయాయి. దీంతో ‘సోమా’కు అన్ని దారులూ మూసుకుపోయాయి.
 
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కనకదుర్గా ఫ్లై ఓవర్‌ పనులకు బ్రేక్‌పడింది. అసలే సాగదీత అనుకుంటున్న పనులు ఇప్పుడు అసలే ఆగిపోయే పరిస్థితి నెలకొంది. నాలుగు నెలలుగా జీతాలు అందుకోలేని కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో దుర్గా ఫ్లై ఓవర్‌ పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. జీతాలు చెల్లించలేని అసహాయతలో ఉంది. కేంద్రం నుంచి రావాల్సిన రూ. 6కోట్ల బిల్లును పే అండ్‌ అక్కౌంట్స్‌ కమిటీ తిరస్కరించింది. చేసిన పనికి రీ వాల్యుయేషన్‌ చేయాలని ఆదేశించటంతో ఇప్పట్లో ఈ బిల్లు వచ్చే పరిస్థితి లేదు. శనీశ్వరాలయం దగ్గర రూ. 6.50 కోట్లతో చేపట్టిన వయాడక్ట్‌ పనులకు సంబంధించి బిల్లు కూడా అనిశ్చితిలో పడింది. ఈ బిల్లును రాష్ట్రప్రభుత్వం చెల్లింపు చేస్తుందా? కేంద్రప్రభుత్వం చెల్లిస్తుందా? అన్న మీమాంస తలెత్తింది.
 
మరోవైపు వస్తాయనుకున్న ఎస్కలేషన్‌ ఛార్జీలు రూ.4కోట్లు కూడా కేంద్రం దగ్గర నిలిచిపోయాయి. దీంతో నిధుల వెసులుబాటుకు కాంట్రాక్టు సంస్థ ‘సోమా’కు అన్ని దారులూ మూసుకుపోయాయి. జీతాలు చెల్లించలేని పరిస్థితికి వచ్చేసింది. నాలుగునెలలుగా జీతాలు చెల్లించకపోవటంతో కార్మికులు రగిలిపోతున్నారు. కనకదుర్గా ఫ్లైఓవర్‌కు సంబంధించి ఇటు ఫ్లైఓవర్‌ నిర్మాణం, అటు క్యాస్టింగ్‌ డిపోలో కలిపి మొత్తం 450 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా బీహార్‌, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి వచ్చి కుటుంబాలకు దూరంగా ఇక్కడ పనిచేస్తున్నారు. రోజుకు రెండు షిప్టులలో వీరు పనిచేస్తున్నారు. వీరికి సెప్టెంబరు మాసం నుంచి కాంట్రాక్టు సంస్థ ‘సోమా’ వేతనాలను చెల్లించటం లేదు. ఒక్కో కార్మికుడికి సగటున రూ. 10వేల నుంచి రూ.15 వేల వంతున చెల్లించాల్సి ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సోమా సంస్థ ప్రతినిథుల ఎదుట పలు దఫాలు కార్మికులు తాము సమ్మెలోకి వెళ్ళాల్సి ఉంటుందని ఆందోళన చేశారు. ఒకానొక దశలో అల్టిమేటం కూడా ఇచ్చినట్టు తెలిసింది.
 
చేతిలో పైసా లేకపోవటంతో సోమా సంస్థ కార్మికుల జీతాలను చెల్లించలేకపోయింది. దీంతో బుధవారం కార్మికులు మూకుమ్మడిగా సమ్మెలోకి దిగారు. సాయంత్రం కార్మికులను పిలిపించిన సోమా ప్రతినిధులు వారితో చర్చలు జరిపారు. సోమా సంస్థ తరపున చౌదరి వేతనాలను చెల్లించలేకపోవటానికి ఉన్న ఇబ్బందులను కార్మికులకు వివరించారు. నిధుల సర్దుబాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఓపికపట్టాలని చెప్పారు. అయినప్పటికీ కార్మికులు వినలేదు. జీతాలు చెల్లిస్తే కానీ, పనిలోకి దిగబోమని భీష్మించారు. రెండు నెలల వేతనాలను పండుగ లోపు అందిస్తామని సోమా ప్రతినిధులు కార్మికులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రతిపాదనకు కొంతమంది కార్మికులు సుముఖత వ్యక్తంచేయగా.. మరికొంత మంది మాత్రం అంగీకరించలేదు. కొంతమంది విధులకు వస్తామని సోమా ప్రతినిధులకు చెప్పినా మిగిలినవారు మాత్రం తేల్చి చెప్పలేదు. దీంతో గురువారం ఎంతమంది పనిలోకి వస్తారు? అసలు వస్తారా? రారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.
 
పే అండ్‌ అక్కౌంట్స్‌లో రూ.6కోట్ల బిల్లు తిరస్కరణ
కాంట్రాక్టు సంస్థ చేసిన పనికి రూ. 6 కోట్ల మేర కేంద్ర ప్రభుత్వం నుంచి బిల్లు రావాల్సి ఉంది. ఈ బిల్లు పే అండ్‌ అక్కౌంట్స్‌ కమిటీ దృష్టికి వెళ్ళగా తిరస్కరించింది. సంవత్సరాంతం కావటంతో పనులకు సంబంధించి రీ వాల్యుయేషన్‌చేసి పంపించాల్సిందిగా కాంట్రాక్టు సంస్థను ఆదేశించింది. రీవాల్యుయేషన్‌ చేసి పే అండ్‌ అక్కౌంట్స్‌కు పంపించటానికి చాలా సమయం పడుతుంది. ఆర్థిక శాఖ క్లియరెన్స్‌ అయితే కానీ ఆ డబ్బులు రావు. అప్పటి వరకు పని చేయించటానికి ‘సోమా’ దగ్గర డబ్బులు లేవని తెలుస్తోంది.
 
శనీశ్వరాలయ వయాడక్ట్‌ నిర్మాణ పనుల రూ.6.50 కోట్ల బిల్లు సంగతేమిటి ?
కృష్ణా తూర్పు ప్రధాన కాలువు ఒడ్డు నుంచి శనీశ్వరాలయం వరకు సోమా సంస్థ వయాడక్ట్‌ నిర్మాణ పనుల కోసం రూ.6.50కోట్లు వెచ్చించింది. దీనికి సంబంధించిన బిల్లు పెండింగ్‌లో పడింది. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో వాల్‌తో కూడిన వయాడక్ట్‌ను నిర్మించాల్సిందిగా సూచించింది. వాల్‌ కట్టడం వల్ల ఘాట్లు కనిపించవని, ఈ ప్రాంతం అంతా మూసుకుపోయినట్టు ఉంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం పిల్లర్ల మీద వయాడక్ట్‌ చేపట్టాలని నిర్దేశించింది. పిల్లర్ల మీద వయాడక్ట్‌ నిర్మించటానికి కేంద్రం అంగీకరించలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వ నిధులతో నిర్మించాలని నిర్ణయించారు. ఈక్రమంలో భాగంగా కాంట్రాక్టు సంస్థ పనులు ప్రారంభించింది. బిల్లుకు సంబంధించి ఇప్పుడు రాష్ట్రమా? కేంద్రమా? అన్న మీమాంస నెలకొంది. కేంద్రాన్ని ఒప్పించి బిల్లు మంజూరు చేయించాలన్న ఆలోచనలో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ బిల్లు చెల్లింపునకు సంబంధించి గందరగోళం నెలకొనటంతో కాంట్రాక్టు సంస్థకు నిధుల వెసులుబాటు లేకుండాపోయింది.
Posted

A flyover avadhu appudey. Central is not releasing funds. State govt already mundukochi release chesindhi konchem. Ippudu finally contractor chetulu etesi kurchunadhu. Because workers are not coming to work due to their 4 months wages pending. Contractor ki 10 crore Bill's stuck ayyayi central daggara. Veedhu adhi release aitey kaani mundhu kellanu antunadhu. Malli state govt a funds release cheyaali with out waiting for central. Elagola complete chestey bagundhi thondaraga. Almost 80 %work aipoindhi. 

Posted

Yep hope it gets completed soon ! It will ease congestion ! Love da lo central govt muthi pallu rala mingali bodi gadivi ! Howle gadu okka fly over mundhukuponiyatla ! E gajan gadu bezawada vaste cheppu tho mingali ! E flyover kosam e chesinavu ra ani ! Because these dirty politics people of that area are getting screwed a flyover leka chuttu tirigi velataniki additional petrol and time bokka

Posted
1 hour ago, jua_java said:

Yep hope it gets completed soon ! It will ease congestion ! Love da lo central govt muthi pallu rala mingali bodi gadivi ! Howle gadu okka fly over mundhukuponiyatla ! E gajan gadu bezawada vaste cheppu tho mingali ! E flyover kosam e chesinavu ra ani ! Because these dirty politics people of that area are getting screwed a flyover leka chuttu tirigi velataniki additional petrol and time bokka

Bodi ki kullu man , Amaravati lo jaruguthunna world class fastest development choosi. 

Posted
3 hours ago, snoww said:

Bodi ki kullu man , Amaravati lo jaruguthunna world class fastest development choosi. 

yo adhi amaravathi kadu bezawada lo ....tht city deserves a lot more but was never given sufficient attention 

Posted
6 hours ago, Ironfist said:

A flyover avadhu appudey. Central is not releasing funds. State govt already mundukochi release chesindhi konchem. Ippudu finally contractor chetulu etesi kurchunadhu. Because workers are not coming to work due to their 4 months wages pending. Contractor ki 10 crore Bill's stuck ayyayi central daggara. Veedhu adhi release aitey kaani mundhu kellanu antunadhu. Malli state govt a funds release cheyaali with out waiting for central. Elagola complete chestey bagundhi thondaraga. Almost 80 %work aipoindhi. 

niyavva ila prathidhi state nunchi icchukuntu pothey repu budget lo gundu sunna istharemo...elagoo anni state govt ee isthundhi kadha inka central endhuku ani 

Posted
8 hours ago, Ironfist said:

A flyover avadhu appudey. Central is not releasing funds. State govt already mundukochi release chesindhi konchem. Ippudu finally contractor chetulu etesi kurchunadhu. Because workers are not coming to work due to their 4 months wages pending. Contractor ki 10 crore Bill's stuck ayyayi central daggara. Veedhu adhi release aitey kaani mundhu kellanu antunadhu. Malli state govt a funds release cheyaali with out waiting for central. Elagola complete chestey bagundhi thondaraga. Almost 80 %work aipoindhi. 

government contracts antene bills delay normal. adi edo kothaga ippude emi start avvale. anduke money capacity vunna valle aa delay ni kooda estimates lo add chesukoni bid chestharu projects ki. 

capacity leni contractors ki projects isthe ilane vuntadi. 

applies to state government projects too. contractor bill submit cheyyagaane immediate gaa pay cheyyadu evadu kooda. 

  • 1 month later...
Posted
On 11/22/2018 at 5:48 PM, snoww said:

March ki postponed

మార్చి నాటికి కనకదుర్గ ఫ్లై ఓవర్‌ పూర్తిచేసి తీరాలని అధికారుల్ని ఆదేశించారు.

April now

కేంద్రం కొర్రీలు! 
 

కనకదుర్గ పైవంతెన బిల్లుల చెల్లింపులో జాప్యం 
పనులు ఆగుతూ... సాగుతూ..! 
తిరిగి వెళ్లిన కార్మికులు.. నెమ్మదించిన పనులు 
మరో నెల పెరిగిన గడువు 
ఈనాడు అమరావతి

amr-gen13a_42.jpg

గడువులోగా పూర్తి చేస్తారని భావిస్తున్న కనకదుర్గ పైవంతెన పనులకు మళ్లీ ఆటంకాలు ఎదురయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ పైవంతెనకు కేంద్రం అడుగడుగునా అడ్డుపుల్లలు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ వాటాతో నెట్టుకు రావాలనే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. గత రెండు నెలలుగా గుత్తేదారుకు బిల్లులు చెల్లించకపోవడంతో కొంతకాలంగా పనులు నిలిచిపోయాయి. తిరిగి ఇటీవల మళ్లీ పనులు ప్రారంభించారు. దీనికి తోడు తాజాగా దర్గా వివాదం ఆటంకం కలిగిస్తోంది. దీంతో నత్తతో పోటీ పడుతున్న పనులు వచ్చే మార్చి నాటికి పూర్తికావడం దుర్లభంగా కనిపిస్తోంది. ఏప్రిల్‌ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నా బిల్లులు రాకపోతే తామేమీ 
చేయలేమని గుత్త సంస్థ చేతులు ఎత్తేసింది. మరోవైపు విజయవాడ నగరంపై ట్రాఫిక్‌ భారం తగ్గించేందుకు త్వరితగతిన కనకదుర్గ పైవంతెన నిర్మాణం పూర్తి చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఈ పైవంతెన ఎప్పటికి పూర్తవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి ‘ఈనాడు’ పరిశీలనలో పలు అంశాలు వెలుగుచూశాయి. 
ఇదీ నేపథ్యం..! కనకదుర్గ పైవంతెన నిర్మాణం పూర్తయితే విజయవాడ నగరానికి మణిహారంలా తయారు కానుంది. దీన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా దీని నిర్మాణం చేపట్టాయి. పర్యవేక్షణ మాత్రం ర.భ. జాతీయరహదారుల విభాగం చేపట్టింది. కనకదుర్గ కొండ సమీపంలో ఒక పారాబ్రిడ్జి నిర్మాణం చేసి నాలుగు వరసల రహదారి వచ్చే విధంగా మార్పు చేశారు. 249 మీటర్లు దాదాపు నదిలోకి విస్తరించి ఈ వంతెన నిర్మాణం చేశారు. కనకదుర్గ పైవంతెన ఇంద్రకీలాద్రి వద్ద నదిలో నిర్మాణం చేయాల్సి వచ్చింది. నదిలోనే పిల్లర్లను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ స్పాన్లు ఒకవైపు నిర్మాణం చేసేవిధంగా ఆకృతులను మార్చారు. నదిలో ఆక్రమణలు లేకుండా డిజైన్లు మార్చారు. ఈ పైవంతెన నిర్మాణంలో ప్రి ఫ్యాబ్రికేషన్‌ పద్ధతిలో యార్డులో గడ్డర్లు, స్పాన్లు, వింగ్స్‌ నిర్మాణాలు చేసి అమర్చుతున్నారు. దీనికి భారీ యంత్రాలు అవసరం ఉంది. వీటి కదలిక సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. నిర్మానుష్యంగా ఉండాలి. భారీ యంత్రాలు, భారీ క్రేన్లు తిరిగేందుకు అవసరమైన స్థలం ఉండాలి. ఫినిషింగ్‌ పనులు పూర్తి చేయకముందే ఎఫ్‌1 హెచ్‌2ఓ పేరుతో రూ.కోట్లు వెచ్చించి పార్కు నిర్మాణం చేశారు. పిల్లర్లకు అందాలు మెరుగులు దిద్దారు. కనకదుర్గ గుడి వద్ద నిర్మాణం చేస్తున్న 24, 25 పిల్లర్ల వద్ద సమస్య ఎదురవుతోంది. ఇక్కడ దాదాపు పరిహారంగా రూ.80లక్షల వరకు చెల్లించారు. కానీ పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. కాలువల్లో పిల్లర్ల నిర్మాణానికి జాప్యం జరిగింది. ప్రస్తుతం స్లాబ్‌లు వేస్తున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి నగరపాలక సంస్థ వరకు నిర్మాణం సవాల్‌గా మారిందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలుగు వరసల రహదారి దాదాపు 5280 మీటర్ల దూరం నిర్మాణం చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 1675 మీటర్ల నిర్మాణం చేశారు. ఇంకా 3605 మీటర్లు నిర్మాణం చేయాల్సి ఉంది. అంటే పైవంతెన, కింద మరో రెండు వరసల బీసీ పొర వేయాల్సి ఉంది. పైవంతెన నిర్మాణం పూర్తయితే ఈ రహదారిని పూర్తి చేస్తారు. అప్పటివరకు పెండింగ్‌లో ఉంది. 2219 మీటర్ల డ్రైను నిర్మాణం చేయాల్సి ఉంది. 
బిల్లులకు కేంద్రం కొర్రీ..! ఈ ప్రాజెక్టును కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా చేపట్టింది. రాష్ట్ర వాటా రూ.110 కోట్లు. కాగా ఇప్పటివరకు రూ.170 కోట్లు ఖర్చు చేసింది. సాధారణంగా పనులు జరిగిన వారం లేదా నెలకు బిల్లులు పెడతారు. కేంద్రం జాతీయ రహదారుల సంస్థ పీఏఓ నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీని ప్రాంతీయ కార్యాలయం బెంగళూరులో ఉంది. అక్కడి నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉంది. గత రెండు నెలలు బిల్లులను గుత్తేదారుకు బిల్లులు చెల్లించలేదు. నవంబరులో రూ.5.8 కోట్లు, డిసెంబరులో రూ.5.8 కోట్లు బిల్లులు పెట్టారు. కానీ ఫిబ్రవరి వచ్చినా బిల్లులు ఇవ్వలేదు. ఇటీవల దాదాపు 15 రోజులు పనులు నిలిపివేసినట్లు తెలిసింది. దీంతో ఒక నెల బిల్లు రావడంతో తిరిగి మళ్లీ పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 100 మంది కార్మికులకు పైగా తిరిగి వెళ్లినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం రూ.4.75కోట్లకు బిల్లులు పెట్టారు. అయితే నిర్మాణ సంస్థ ప్రతినిధులు ఈ బిల్లులు రాలేదని చెబుతున్నారు. గత వారం మంజూరు చేశామని ర.భ. అధికారులు చెబుతున్నారు. ఆర్థిక సమస్యలతో ఉండటంతో పనులు నిలిపివేశారు. ఈ వంతెన నిర్మాణంలో భాగస్వాములైన కార్మికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే. ఎక్కువగా బిహార్‌ నుంచి వచ్చారు. వారికి వారం వారం వేతనాలు చెల్లించాల్సి ఉంది. భోజనాలకు నిధులు సమకూర్చాల్సి ఉంది. భారీ మొత్తంలో ఖర్చు ఉంటుంది. బిల్లులు రాకపోవడంతో పలువురు కార్మికులు వెళ్లిపోయారు. పైవంతెనపై ఇప్పటివరకు రూ.219.51 కోట్లు ఖర్చు చేశారు. మొత్తం 310.25 కోట్లు అంచనా. 78 శాతం నుంచి 80 శాతం పనులు పూర్తయినట్లు చెబుతున్నారు. బిల్లులు మాత్రం ఆ మేరకు రాలేదు. ప్రధానంగా కేంద్రం నుంచి ప్రతి నెలా కొర్రీలు వేస్తున్నారు. ఇప్పటికే మారిన ఆకృతులపై రాజీ పడాల్సి వచ్చింది. డీవియేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. నగరపాలక సంస్థ కార్యాలయం వైపు అప్రోచ్‌ రహదారి వయాడక్టు తరహాలో నిర్మాణం చేయాల్సి ఉంది. దీని వ్యయం రాష్ట్ర ప్రభుత్వంపైనే పడింది. బిల్లులకు ప్రతిసారి వివరణలు పంపాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. 
మరో వివాదం..! తాజాగా మరో వివాదం గుత్త సంస్థ ముందుకు వచ్చింది. 24, 25 పిల్లర్ల వద్ద ఒక ప్రార్థనా మందిరం ఉన్న విషయం తెలిసిందే. గతంలో దీని విషయంలో వివాదం రాగా పరిష్కరించారు. ఆ ప్రార్థనా మందిరం ప్రహరీ నిర్మాణానికి దాదాపు రూ.60 లక్షలు చెల్లించేందుకు ర.భ. అంగీకరించింది. దీనికి రూ.1.3కోట్లు కావాలని వారు డిమాండ్‌ చేశారు. మధ్యే మార్గంగా ఇంజినీర్లతో అంచనా వేయించి రూ.60లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. పనులు ప్రారంభించారు. తాజాగా ప్రార్థన మందిరం మీదుగా వంతెన వెళ్తుందని, దీన్ని తాము సమ్మతించమని ఒక వర్గం లేఖ రాసినట్లు తెలిసింది. ఈ అభ్యంతరంతో పనులు కొన్ని రోజులపాటు నిలిచిపోయాయి. స్పాన్లు ఏర్పాటు చేస్తే ప్రార్థనా మందిరం మీదకు వస్తుందని వారు భావిస్తున్నారు. ఇప్పుడు పైవంతెన ఆకృతి మార్చడం సాధ్యం కాదు. కానీ పనులకు మాత్రం ఆటంకం ఏర్పడింది. సున్నితమైన ఈ అంశాన్ని వెలుగులోకి రాకుండా సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పనులు ఆగిపోవడంతో మార్చి 31 నాటికి పైవంతెన నిర్మాణం పూర్తి కావడం అసాధ్యం. కేంద్రం కొర్రీలు, ఆర్థిక సమస్యలు, కార్మికుల కొరత లాంటి సమస్యలతో నిర్మాణం వేగవంతానికి అవరోధంగా మారాయి. 
ఏప్రిల్‌ నాటికి పూర్తి: ఈ విషయమై రహదారులు భవనాల శాఖ డిప్యూటీ ఇంజినీర్‌ ఇన్‌ ఛీఫ్‌ జాన్‌మోషేను ‘ఈనాడు’ సంప్రదించగా పనులు ఆగిపోలేదని, కొనసాగుతున్నాయని చెప్పారు. రెండు నెలల బిల్లులు ప్రతిష్టంభనలో పడిన విషయం వాస్తవమేనని ఇటీవల మంజూరు చేశారని వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా వారం కిందట రూ.4.5కోట్లు బిల్లులు మంజూరు చేసిందని చెప్పారు. ఒప్పందం ప్రకారం బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. 24 పిల్లర్‌ దగ్గర పనులు జరుగుతున్నాయని చెప్పారు. 34, 35, 41 పిల్లర్ల వద్ద పైవంతెన పైన క్రాష్‌ బారియర్‌ పనులు చేస్తున్నారని చెప్పారు. దర్గా ప్రాంతంలో కొన్ని అభ్యంతరాలు వచ్చినా పనులు నిలిచిపోలేదన్నారు. అయితే సోమా ప్రతినిధి ఒకరు ‘ఈనాడు’తో మాట్లాడుతూ బిల్లులు సకాలంలో మంజూరు చేయడం లేదని ధ్రువీకరించారు. పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...