SonyKongara Posted September 17, 2018 Report Posted September 17, 2018 చైనా పర్యటనలో బిజీబిజీగా మంత్రి నారా లోకేష్ 17-09-2018 09:51:43 అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేష్ చైనా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. సీఈటీసీ ఎలక్ర్టానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్ బిన్‌తో లోకేష్ భేటీ అయ్యారు. సీఈటీసీ ఎలక్ర్టానిక్స్ అనే సంస్థ సోలార్ ఎనర్జీ సంబంధిత పరికరాలను తయారుచేస్తుంది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సిఈటిసి ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్ బిన్ స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య సుమారు అరగంటకు పైగా పలు విషయాలు చర్చకు వచ్చాయి. లోకేశ్ మాట్లాడుతూ.. " ఏపీలో పునరుత్పాదక శక్తికి ప్రాముఖ్యత ఇస్తున్నాం. పవన, సౌర విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. నాలుగేళ్లలో 6.8 గిగావాట్ల పునరుత్పాదక శక్తి సామర్థ్యాన్ని అందుకున్నాం. మరో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. శ్రీసిటీలో ఏర్పాటు చేస్తున్న కంపెనీ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయడానికి తగిన సహకారం అందిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. సీఈటీసీ సబ్సిడరీ కంపెనీలు, సప్లయర్ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు పూర్తి సహకారం కావాలని కోరాం. కంపెనీల ఏర్పాటులో ఇబ్బందులు లేకుండా సమస్యలు పరిష్కరిస్తామని ఆయా కంపెనీల సీఈవోలకు వివరించాం. ఏపీలో సీఈటీసీ కార్యకలాపాలు విస్తరించేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి" అని లోకేష్ వివరించారు. సీఈటీసీ ఎలక్ర్టానిక్స్ కంపెనీ సీఈఓ వాన్గ్‌బిన్ మాట్లాడుతూ.. " ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. కంపెనీ విస్తరణ పై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సప్లైయర్ కంపెనీలు,సబ్సిడరి కంపెనీలను ఆంధ్రప్రదేశ్‌కి తీసుకొచ్చేందుకు పూర్తి సహకారం అందిస్తాం. ఏపీలో కంపెనీ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. కంపెనీ విస్తరణపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. సీఈటీసీ సబ్సిడరీ కంపెనీలు, సప్లయర్ కంపెనీలు ఏపీకి తీసుకొచ్చేందుకు పూర్తి సహకారం అందిస్తాం" అని ఆయన తెలిపారు. Quote
thillana_thillana Posted September 17, 2018 Report Posted September 17, 2018 @aakathaai annai how are you? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.