Jump to content

Pradeep pelli choopulu


Recommended Posts

Posted

ప్రదీప్ పెళ్లిచూపులు.. ఎక్కడికి పోతున్నామో మనం అర్ధం కావడంలేదు..ఏంటీ అర్ధం పర్థం లేని టీవీ షోస్..? జనాల్ని వెర్రివాళ్లను చెయ్యడం కాకపోతే.. డేటింగ్ మన సంస్కృతి కాదు కదా..ఒకడేవడో స్వయంవరం ప్రకటిస్తే ..పోలోమంటూ ఆడపిల్లలు క్యూ కట్టడమా..? ఎంత సెలిబ్రిటీ, పేరున్న యాంకర్ అయినా.. అమ్మాయిలు వచ్చి మీద పడిపోవడమా..? ఈ లవ్ యూ..ఎంత ముద్దు వస్తున్నావో..నీ సొట్టబుగ్గల ఎంత బావున్నాయో..నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది.. 

ఛీ.. అసలు తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారో? అతను అందర్నీ పెళ్లి చేసుకోడుగా..ఎవరినో ఒక్కరినే వరిస్తాడు.. మిగిలినవాళ్ళు ఇక్కడ వేసే వెకిలి వేషాలకు పెళ్లిళ్లు అవుతాయా..? ఎంత గారాబంగా పెంచినా ,అమ్మాయిలు ఏదంటే అదేనా..? వద్దు అని వారించరా? గిఫ్ట్లు ఇవ్వడం, హగ్స్..తెలుగు ఛానళ్లు దరిద్రాన్ని తెచ్చి మన డ్రాయింగ్ రూముల్లో డంప్ చేస్తున్నాయి. ఒక మగవాడి కోసం అంత వేలంవెర్రి వేషాలు వేస్తారా..? టీవీల్లో కనపడాలనే కోరికతోనా..నిజంగా ప్రదీప్ కి అంత సీన్ ఉందా అసలు ? వేరే దేశాల నుండి, తెలుగు రాకపోయినా అతని కోసం నేర్చుకుని మరీ వచ్చామని చెప్పడం..ఇదంతా డ్రామానా..అమ్మాయిలకి ప్రదీప్ అంటే అంత క్రేజ్ ఉందా..? నాకు నమ్మబుద్ధి కావడంలేదు. ఈ చెత్త డ్రామాకి తల్లిదండ్రుల సపోర్ట్..తమ కూతుళ్ళ వల్ల తాముకూడా సెలిబ్రిటీలు అవుతాము అనుకుంటున్నారేమో..?
ఈ మధ్య ఆడపిల్లల తల్లిదండ్రుల ప్రవర్తన చాలా వియర్డ్ గా ఉంటోంది..ఎంత బాగా చదువుకొని, మంచి కంపెనీల్లో ఉద్యోగం చేస్తున్న అబ్బాయి సంబంధం అయినా..ఎదో వంక పెట్టడమే.. పాకేజీ ఎంత ? ఓన్ హౌస్ ఉందా..హైట్ 6 ఫీట్ ఉన్నాడా, అత్త,ఆడపడుచులు ఉన్నారా.. అంటూ ఎంత ఆరా తీస్తున్నారో..తమకూతురు బీటెక్ మాత్రమే చదివినా, అబ్బాయి మంచి కాలేజీల్లో పీజీ చేసి..పెద్ద పాకేజీ ఉన్న, మల్టీ నేషనల్ కంపెనీలో జాబ్ చెయ్యాలి. అదికూడా తమ కూతురు యెస్ అంటేనే.. మొన్న నేను తెలిసిన వాళ్ళ అమ్మాయికి ఒక మంచి మ్యాచ్ చెప్పా..ఒక్కడే అబ్బాయి, MS చేసి,పెద్ద కంపెనీలో మంచి పాకేజీ, 4 ఇళ్లు..ఒక కొత్త ఫ్లాట్, అబ్బాయి చాలా బావున్నాడు.. అమ్మాయి అనుకున్న దానికన్నా 1' హైట్ తక్కువ..తనకి 6 అడుగులు కావాలట, అబ్బాయి 5'11ఉన్నాడు..నచ్చలేదు అని చెప్పారు. 

మరి ప్రదీప్ మాచిరాజు కు ఏమి ఉన్నాయి ? డ్రంక్ న్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు..అంటే తాగుతాడు..పొట్టి..వెకిలి యాంకరింగ్..ఏమి చూసి అమ్మాయిలు ఎగబడుతున్నారు ? తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు ? 
నాకు పరమ చిరాకు,అసహ్యం వేస్తోంది ..పైగా వీళ్ళందరికీ IQ టెస్టులు..ఇంతోటి రాజకుమారుడు దొరకడని..ఈ ఆడంగులు పోటీ పడటం..మంచి కుటుంబంలో పుట్టి,చదువుకుని ,ఉద్యోగం చేసే అబ్బాయిలు వద్దు..ఇలా ఉదయం నుండి మళ్లీ తెల్లారే వరకు స్టూడియోల్లో ఉండే 'యాంఖరు' కావాలి.. అల్ ద బెస్ట్ అమ్మాయిలూ..మీ అమ్మా నాన్నలకి కూడా..

అన్నట్టు కొసమెరుపు ఏమిటంటే హిందీలో వచ్చిన షోలలో ఇలాంటి పెళ్లిచూపులు ద్వారా పెళ్లి చేసుకున్న వాళ్లంతా విడాకులు కూడా తీసుకున్నారు..

💐శుభం భూయత్!!💐

Posted

timepass show ki enduku antha serious tisukuntav..... vadu pelli chesukodu anta already mentioned anta just ch0000pula varake

Posted

మరి ప్రదీప్ మాచిరాజు కు ఏమి ఉన్నాయి ? డ్రంక్ న్ డ్రైవ్ లో పట్టుబడ్డాడు..అంటే తాగుతాడు..పొట్టి..వెకిలి యాంకరింగ్..ఏమి చూసి అమ్మాయిలు ఎగబడుతున్నారు ? తల్లిదండ్రులు ఎలా ఒప్పుకున్నారు ? 
నాకు పరమ చిరాకు,అసహ్యం వేస్తోంది ..పైగా వీళ్ళందరికీ IQ టెస్టులు..ఇంతోటి రాజకుమారుడు దొరకడని..ఈ ఆడంగులు పోటీ పడటం..మంచి కుటుంబంలో పుట్టి,చదువుకుని ,ఉద్యోగం చేసే అబ్బాయిలు వద్దు..ఇలా ఉదయం నుండి మళ్లీ తెల్లారే వరకు స్టూడియోల్లో ఉండే 'యాంఖరు' కావాలి.. అల్ ద బెస్ట్ అమ్మాయిలూ..మీ అమ్మా నాన్నలకి కూడా..

 

whatsapp fwd ayithe lite teesuko....kani ee paragrph chalu mee vision ki dandam saamisFun_duh2sFun_duh2

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...