kakatiya Posted October 8, 2018 Report Posted October 8, 2018 ఈనాడు, హైదరాబాద్, కుషాయిగూడ, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగార్థులు టీఎస్పీఎస్సీ తప్పిదాలతో తిప్పలు పడుతూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన గ్రూప్-4 పరీక్ష గందరగోళం మధ్య ముగిసింది. ప్రశ్నపత్రం ముద్రణలో పొరపాట్లతో అభ్యర్థులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురయ్యారు. ‘ఎ’ సిరీస్ ప్రశ్నపత్రంలో ఈ తరహా సమస్యలు అధికంగా ఉత్పన్నమయ్యాయి. ఒకే నంబరుతో రెండు, మూడు ప్రశ్నలు.. పలు సందర్భాల్లో ఎదురయ్యాయి. దీంతో సిరీస్ పూర్తిగా దెబ్బతింది. భారీ సంఖ్యలో ప్రశ్నల నంబర్లు, ప్రశ్నలు పునరావృతమయ్యాయి. ఓఎంఆర్ షీట్లో వీటికి సమాధానాలను ఎలా గుర్తించాలో తెలియక అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. సంబంధిత పరీక్ష కేంద్రాల సూపరింటెండెంట్లు ప్రశ్నపత్రం ముద్రణలో జరిగిన పొరపాట్లను టీఎస్పీఎస్సీకి వెల్లడించడంతో.. కమిషన్ ఆయా ప్రశ్నపత్రాల స్థానంలో కొత్త వాటిని వెంటనే పంపిణీ చేసింది. దీంతో పలువురు అభ్యర్థులకు సమయం సరిపోలేదు. కొన్నిచోట్ల మాత్రమే అదనపు సమయం కేటాయించారు. ప్రశ్నపత్రాలను పొరపాట్లు లేకుండా ఎందుకు ముద్రించలేకపోయారంటూ ఉద్యోగార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్పీఎస్సీకి తరచూ తప్పులు చేయడం అలవాటైందని, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ విభాగాల్లోని గ్రూప్-4 ఉద్యోగాలు, జీహెచ్ఎంసీ బిల్కలెక్టర్లు, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్, ఆర్టీసీల్లో వివిధ పోస్టులకు ఉమ్మడిగా ఈ పరీక్షను టీఎస్పీఎస్సీ నిర్వహించింది. న్యాయం చేయండి.. కమిషన్ చేసిన తప్పులకు నష్టపోయిన తమకు న్యాయం చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ ఈసీఐఎల్ కమలానగర్‌లోని శ్రీచైతన్య కళాశాలలోని పరీక్ష కేంద్రానికి హాజరైన బాధిత అభ్యర్థులు గోపాల్, స్వప్న, కె.రమేష్, అలేఖ్య, స్వాతి ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ గంటన్నర సమయం గడిచాక తమకు వేరే ప్రశ్నపత్రం ఇస్తామన్నారని, చేసేది లేక తప్పులతడక ప్రశ్నపత్రంతోనే పరీక్ష రాశామని తెలిపారు. ఈ విషయమై ఏఎల్ఓ వెంకట్‌రెడ్డి, చీఫ్ సూపరింటెండెంట్ రవికుమార్‌ను వివరణ కోరగా.. వేరే ప్రశ్నపత్రం, ఓఎంఆర్ షీటు ఇచ్చి అరగంట సమయం ఇవ్వాలని టీఎస్పీఎస్సీ నుంచి 11.13 గంటలకు తమకు సంక్షిప్త సందేశం వచ్చిందని తాము అలాగే చేశామని తెలిపారు. హాజరు అంతంతమాత్రమే.. అభ్యర్థుల సంఖ్యకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం, చాలామంది అభ్యర్థులకు సుదూరంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో హాజరు శాతం గణనీయంగా తగ్గిపోయింది. కుమురం భీం జిల్లాలోని ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో 25 కేంద్రాల్లో 7,317 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 886 మంది (12.11%)మాత్రమే రాశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అభ్యర్థులతో పాటు ఇతర రాష్ట్రాల అభ్యర్థులనూ అక్కడ కేటాయించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్, బిహార్ తదితర రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులనూ కుమురం భీం జిల్లాకు కేటాయించినట్లు తెలిసింది. దిద్దుబాటు చర్యలు చేపట్టాం: టీఎస్పీఎస్సీ కొన్ని పరీక్ష కేంద్రాల్లో ‘ఎ’ సిరీస్ ప్రశ్నపత్రంలో ప్రశ్నల నంబర్లు, ప్రశ్నలు పునరావృతమైనట్లు ఫిర్యాదులు వచ్చిన వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టామని టీఎస్పీఎస్సీ ఒక ప్రకటనలో తెలిపింది. వెంటనే ఆయా ప్రశ్నపత్రాల స్థానంలో కొత్తవి పంపిణీ చేశామని వివరించింది. అభ్యర్థులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడంతో గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించింది. ఆదివారం కరీంనగర్ ప్రభుత్వ మహిళా కళాశాలలో గ్రూప్-4 పరీక్షకు హాజరైన జమ్మికుంట మండలం కేశవాపూర్‌కు చెందిన బాలింత. ఆమె పరీక్ష రాస్తుండగా.. కేంద్రం వెలుపల అమ్మమ్మ ఒడిలో ఉన్న రోజుల శిశువు ఏడుపు ప్రారంభించాడు. దీంతో పరీక్ష కేంద్రం సిబ్బంది అనుమతితో.. తనయుడికి ఆమె కొంతసేపు ఇలా స్తన్యమిచ్చింది. - ఈనాడు, కరీంనగర్ మొత్తం పోస్టులు 1,867 వచ్చిన దరఖాస్తులు 6,06,579 పరీక్షకు అర్హత పొందినవారు 4,80,481 పేపర్-1 రాసినవారు - 3,12,397 పేపర్-2 రాసినవారు - 3,09,482 Quote
MiryalgudaMaruthiRao Posted October 8, 2018 Report Posted October 8, 2018 Bokka le Bangaru Telangana ivani common Quote
kakatiya Posted October 8, 2018 Author Report Posted October 8, 2018 28 minutes ago, MiryalgudaMaruthiRao said: Bokka le Bangaru Telangana ivani common 6 lakhs 21 thousand folks future is in this exam. Quote
evadra_rowdy Posted October 8, 2018 Report Posted October 8, 2018 14 minutes ago, kakatiya said: 6 lakhs 21 thousand folks future is in this exam. All votes to mukku? Quote
MiryalgudaMaruthiRao Posted October 8, 2018 Report Posted October 8, 2018 15 minutes ago, kakatiya said: 6 lakhs 21 thousand folks future is in this exam. So what? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.