snoww Posted October 22, 2018 Report Posted October 22, 2018 3 ఏళ్లలో మైలురాళ్లివీ అమరావతి కలల సాకారం దిశగా అడుగులు వేగం పుంజుకున్న మౌలిక వసతులు, గృహ నిర్మాణాలు తరగతులు ప్రారంభించిన రెండు యూనివర్సిటీలు అమరావతి... ఆంధ్రుల కలల రాజధాని. ఆధునిక భారతావనిలో నిర్మిస్తున్న అంతర్జాతీయ నగరం అమరావతి నిర్మాణానికి అంకురార్పణ జరిగి సోమవారానికి సరిగ్గా మూడేళ్లు. ఆకృతిదాల్చుతున్న రాచనగరి కార్యాచరణను అవలోకిస్తే ఎన్నెన్నో ఆటుపోట్లు... ఆటంకాలు. ఈ ప్రజా రాజధానిని విశ్వవిఖ్యాతం చేయాలన్న తపనకు.. కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తోన్న ఆర్థిక సహకారానికి పొంతనలేదు. ఈ పరిస్థితుల్లో మార్గాంతరాలను అన్వేషిస్తూ అవాంతరాలను అధిగమిస్తూ సాగుతున్న ఈ పయనంలో మైలురాళ్లను చూద్దాం.. ఇప్పటిదాకా * 27,956 మంది రైతుల నుంచి 33,920 ఎకరాల భూసమీకరణ * సింగపూర్ సహకారంతో సీఆర్‌డీఏ ప్రాంతానికి, రాజధాని నగరానికి, సీడ్ కేపిటల్‌కి ప్రణాళిక * రాజధానికి భూములిచ్చిన రైతులకు 63,771 ఫ్లాట్లు తిరిగి అప్పగింత. * ఏడు నెలల వ్యవధిలోనే 6 లక్షల చ.అడుగుల తాత్కాలిక సచివాలయం, శాసనసభ నిర్మాణం. * కొండవీటివాగు వరద ముంపు నుంచి రాజధానిని కాపాడేందుకు రూ.222 కోట్లతో ఎత్తిపోతల. * ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసుల అధికారులు, వివిధ కేటగిరీల ప్రభుత్వ ఉద్యోగుల కోసం 60 టవర్లలో 3840 ఫ్లాట్ల నిర్మాణం జరుగుతోంది. డిసెంబరుకి పూర్తి చేయాలన్నది లక్ష్యం. మార్చి వరకు సమయం పట్టే అవకాశముంది. * 1375 ఎకరాల్లో నిర్మించే పరిపాలన, న్యాయ నగరాల ప్రణాళిక, హైకోర్టు, శాసనసభ, సచివాలయం ఆకృతుల రూపకల్పన. అమరావతి అడుగులు ఉన్నంతలో వడివడిగా.. ప్రజా రాజధానిగా అమరావతిని ప్రపంచ ప్రమాణాలతో తీర్చిదిద్దాలన్న ప్రయత్నాలు ఊపందుకున్నాయి. మూడేళ్ల క్రితం సరిగ్గా 2015 అక్టోబరు 22న రాజధాని నిర్మాణానికి ప్రధాని మోది శంకుస్థాపన చేశారు. రాజధాని నగర ప్రణాళిక, మౌలిక వసతుల ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఏడు నెలల వ్యవధిలోనే తాత్కాలిక సచివాలయ నిర్మాణం పూర్తి చేసి, అమరావతి నుంచే పరిపాలన ప్రారంభించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక ఘట్టానికి తెర తీసింది. బ్రిటన్‌కి చెందిన ప్రముఖ భవన నిర్మాణ సంస్థ నార్మన్ ఫోస్టర్ ఆధ్వర్యంలో రాజధానిలో పరిపాలన నగర ప్రణాళిక, ఐకానిక్ భవనాలుగా నిర్మించే శాసనసభ, హైకోర్టుతో పాటు, సచివాలయ భవనాల ఆకృతులు దాదాపు సిద్ధమయ్యాయి. ఉన్నంతలో వడివడిగా పనులు జరుగున్నాయి. రాజధానికి శంకుస్థాపన జరిగి మూడేళ్లవుతున్న సందర్భంగా ఇంత వరకు సాధించిన పురోగతి, అధిగమించిన మైలు రాళ్లు ఎదురవుతున్న ఆటంకాలపై అవలోకనం. 320 కి.మీ.ల రహదారుల నిర్మాణం * మొత్తం ప్రధాన రహదారులు: 34 పొడవు: 320 కి.మీ.లు. * పనులు ప్రారంభమైనవి: 24 పొడవు: 238 కి.మీ.లు * ఇంత వరకు జరిగిన పనులు: 4050 శాతం. * లక్ష్యం: డిసెంబరు, కానీ మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉంది. * ఇబ్రహీంపట్నం వద్ద ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు ఖరారు. * బ్రిడ్జి పొడవు: 3.2 కి.మీ.లు. నిర్మాణ వ్యయం: రూ.1387 కోట్లు. నిర్మాణ గడువు రెండేళ్లు. * ఐకానిక్ బ్రిడ్జి, రహదారుల పనుల విలువ: రూ.13,229 కోట్లు. హరిత-నీలి ప్రణాళిక * రాజధానిలో 30 శాతం హరిత వనాలు, జలాశయాలు, కాలువలు ఉండాలన్నది లక్ష్యం. 80 కి.మీ. మేర అంతర్గత జల వనరులు, 100కిపైగా పార్కులు (కాలనీల్లో) అభివృద్ధికి ప్రణాళికలు. * కొండవీటి వాగు, పాలవాగుల్ని వెడల్పు చేసి, సుందరంగా తీర్చిదిద్దేందుకు రూ.800 కోట్లతో టెండర్లు. * 300 ఎకరాల్లో పీపీపీ విధానంలో శాకమూరు పార్కు, మల్కాపురం వద్ద 15 ఎకరాల్లో, అనంతవరంలో 35 ఎకరాల్లో పార్కుల అభివృద్ధి పనులు ప్రారంభం. భూముల కేటాయింపు * రాజధానిలో వివిధ యూనివర్సిటీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, ఆస్పత్రులు, ఇతర సంస్థల నిర్మాణానికి సుమారు 1500 ఎకరాల్ని సీఆర్‌డీఏ కేటాయించింది. * ఎస్‌ఆర్‌ఎం, వీఐటీ యూనివర్సిటీలు తొలి దశ భవనాలు నిర్మించి, తరగతులూ ప్రారంభించాయి. సుమారు 4 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. * అమృత యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థల నిర్మాణాలు జరుగుతున్నాయి. * పది పాఠశాలలు, ఎనిమిది స్టార్ హోటళ్లు, బీఆర్‌షెట్టి, ఇండోయూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ వంటి సంస్థల ఆస్పత్రులకు సీఆర్‌డీఏ స్థలాలు కేటాయించింది. లోటుపాట్లు * ఐకానిక్ భవనాల ఆకృతులు, పరిపాలన నగర ప్రణాళిక రూపకల్పనలో జాప్యం జరుగుతోంది. మొదట జపాన్‌కి చెందిన మాకీ అసోసియేట్స్‌ని ఎంపిక చేశారు. మాకీని పక్కన పెట్టి, నార్మన్ ఫోస్టర్ సంస్థకు బాధ్యతలు అప్పగించారు. ఆ ప్రక్రియకే ఏడాది పట్టింది. నార్మన్ ఫోస్టర్‌ని ఎంపిక చేసిన తర్వాత కూడా ఆకృతుల రూపకల్పనలో జాప్యం జరిగింది. 2018 డిసెంబరు నాటికే ఐకానిక్ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభుత్వం చెప్పేది. కానీ ఇప్పుడిప్పుడే పనులు మొదలవుతున్నాయి. పూర్తిస్థాయిలో ఆకృతులు సిద్ధమవడానికి మరికొంత సమయం పట్టే అవకాశమూ ఉంది. * రాజధానిని విజయవాడ-హైదరాబాద్ రహదారితో అనుసంధానించే ఐకానిక్ బ్రిడ్జిని ఇబ్రహీంపట్నం వద్ద నిర్మించాలన్నది ప్రతిపాదన. ఇటీవలే టెండరు ఖరారు చేశారు.పనులు మొదలు పెట్టడానికి ఇంకా సమయం పట్టే అవకాశముంది. * 1691 ఎకరాల్లో స్టార్టప్ ప్రాంత అభివృద్ధికి సింగపూర్ సంస్థల కన్సార్టియం మాస్టర్ డెవలపర్‌గా ఎంపికైంది. శంకుస్థాపన జరిగి ఏడాదిన్నరైనా పనులు మొదలవలేదు. బీఆర్‌షెట్టి, ఇండో యూకే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వంటి సంస్థలు స్థలాలు తీసుకుని ఏడాదిన్నర దాటినా ప్రాజెక్టులు ప్రారంభించలేదు. * ప్రణాళికలు, ఆకృతుల విషయంలో జాప్యం కారణంగా నిర్మాణాలు ఆలస్యమయ్యే అవకాశముంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.