Jump to content

Tallest statue in the world


Recommended Posts

Posted

సర్దార్‌కి సాటిలేరు!

బ్రిటిష్‌ పరిపాలన ముగిసిన తర్వాత అయిదువందలకు పైగా ఉన్న సంస్థానాలను కలిపి అఖండ భారతావనిగా తీర్చిదిద్దిన ఘనత సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌దే. ఆ ఉక్కుమనిషిని స్మరిస్తూ తరతరాలకూ స్ఫూర్తినిచ్చేలా నిర్మించిందే గుజరాత్‌లోని ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’. ప్రపంచంలోనే ఎత్తైన ఈ విగ్రహాన్ని ఈనెల 31న ఆవిష్కరించబోతున్న సందర్భంగా...క్కుమనిషిగా భారతీయుల మదిలో ఆయన స్థానం ఆకాశమంత. కంటికి కనిపించని ఆ అభిమానం నింగినంటుతుందా... అనిపించేలా రూపొందించిందే నర్మదానదిలోని సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌ దగ్గర నిర్మించిన  182 మీటర్ల ఎత్తైన సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహం. స్వతంత్ర భారతదేశానికి మొదటి ఉపప్రధానీ, హోంమంత్రీ అయిన వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహాన్ని ఈ స్థాయిలో నిర్మించాలన్నది ఒకప్పటి గుజరాత్‌ ముఖ్యమంత్రీ, ప్రస్తుత ప్రధానీ అయిన నరేంద్ర మోదీ ఆలోచనే. రూ.మూడువేల కోట్ల ఈ భారీ ప్రాజెక్టుకి 2013 అక్టోబరు 31న శంకుస్థాపన చేశారు. అంతేకాదు, స్వాతంత్య్రం వచ్చాక రాజుల పాలనలో ఉన్న 562 చిన్నా పెద్దా సంస్థానాలను భారతదేశంలో ఐక్యం చేసిన పటేల్‌ను గౌరవిస్తూ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’గా పేరుపెట్టారు. అలా ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య ప్రాతిపదికన ‘ఎల్‌అండ్‌టీ కంపెనీ, సర్దార్‌ సరోవర్‌ నర్మదా నిగమ్‌ లిమిటెడ్‌’ సంస్థలు దీని నిర్మాణాన్ని చేపట్టాయి. ఇందుకోసం నాలుగువేలమంది కార్మికులు పనిచేయగా అందులో రెండొందలమంది చైనీయులున్నారు. చైనాకు చెందిన ‘టీక్యూ ఆర్ట్‌ ఫౌండ్రీ’ కంపెనీకి భారీ విగ్రహాలకు పనిచేసిన అనుభవం ఉండడంతో ఎల్‌ అండ్‌ టీ కంపెనీ అక్కణ్నుంచి కార్మికుల్ని రప్పించిందట.రైతుల విరాళాలు... 
స్టాచ్యూఆఫ్‌ యూనిటీ ప్రాజెక్టు మొత్తం నిర్మాణానికి  25వేల టన్నులకు పైగా ఇనుముని ఉపయోగించారు. దీన్లో అయిదువేల మెట్రిక్‌ టన్నుల ఇనుము రైతులు విరాళాలుగా అందించిన పాత వ్యవసాయ పనిముట్ల నుంచి వచ్చిందే. విగ్రహం తయారీకి  90వేల టన్నుల సిమెంటు పట్టిందట. ఇక, గుజరాత్‌లోని నూటఎనభైరెండు నియోజకవర్గాలకు గుర్తుగా 182 మీటర్ల ఎత్తులో నిర్మించిన దీనికి ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా ఇప్పటికే బోలెడంత గుర్తింపు వచ్చేసింది. ఇప్పటివరకూ భూమ్మీద ఎత్తైన విగ్రహంగా పేరొందిన చైనాలోని స్ప్రింగ్‌ టెంపుల్‌ బుద్ధుడు (153మీ.) ఇప్పుడు రెండో స్థానంలోకి వెళ్లిపోయాడు. జపాన్‌లోని ఉషికు డయ్‌బుట్సు (120మీ.), స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ(93మీ.), రష్యాలోని ద మదర్‌ల్యాండ్‌ కాల్స్‌(85మీ.) తర్వాతి స్థానాల్లోకి చేరాయి. నిజానికి పటేల్‌ విగ్రహం మినహా ఇక్కడి మిగిలిన విగ్రహాలన్నిటి ఎత్తులూ వాటి వేదికలతో కలిపి ఉన్నాయి. ఆ లెక్కన కిందున్న వేదిక ఎత్తు 58 మీటర్లు కూడా కలిపితే స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ మొత్తం ఎత్తు 240 మీటర్లు.చూడచక్కగా... 
పన్నెండు చ.కి.మీ విస్తీర్ణంలో కృత్రిమంగా ఏర్పాటు చేసిన సరస్సు మధ్యలో భుజాన కండువా, పంచెకట్టుతో, చెప్పులు ధరించి, అంతెత్తున ఉన్న పటేల్‌ విగ్రహాన్ని చూడాలంటే రెండు కళ్లూ సరిపోవనడంలో ఆశ్చర్యంలేదు. ఇక, ఈ విగ్రహం వేదికనెక్కితే దగ్గర్లో ఉన్న సర్దార్‌ సరోవర్‌ డ్యామ్‌నూ చుట్టూ ఉన్న పచ్చటి కొండల్నీ చూడొచ్చు. అక్కడి సరస్సులో పడవ విహారం చేయొచ్చు. అన్నట్లూ స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ వేదికలోపల పటేల్‌ జీవిత విశేషాలతో కూడిన లేజర్‌ లైట్‌ అండ్‌ సౌండ్‌ షో ఉంటుంది. స్థానిక గిరిజనుల సంస్కృతీ సంప్రదాయాలను తెలిపే మ్యూజియం దీనికి అదనపు ఆకర్షణ.

 

 

  • Like 1
Posted

Ee record inkentha mahaa ante inko one year.. next year kalla “STATUE OF SELF RESPECT” will be tallest statue avvudhhi

Posted

Emi upayogam??

 

Kakulu Gaddalu rettalu vesukodaniki panikostademo!!! 

 

3000 kotlu ... Bhakt galla orgasm peaks inka @3$%

Posted
5 minutes ago, Mitron said:

Emi upayogam??

 

Kakulu Gaddalu rettalu vesukodaniki panikostademo!!! 

 

3000 kotlu ... Bhakt galla orgasm peaks inka @3$%

Yeah paisal 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...