Jump to content

Recommended Posts

Posted
నాలుగున్నరేళ్ల పాలనలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు
సీఎం కేసీఆర్‌ విమర్శలు చంద్రబాబుపైనే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలపై కాదు
అమరావతి నిర్మాణానికి రూ.100కోట్లు ఇద్దామనుకున్నాం
ప్రధాని ఏమీ ఇవ్వకపోవటంతో కేసీఆర్‌ వెనక్కు తగ్గారు
తెలుగు రాష్ట్రాలపై దిల్లీ పెత్తనం వద్దు
ప్రాంతీయ పార్టీలనే గెలిపించుకోవాలి
జాతీయ పార్టీలతో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం
‘మన హైదరాబాద్‌’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి
28hyd-main5a.jpg

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో నివసించే కోస్తా, రాయలసీమ ప్రజలకు తాను అండగా ఉంటానని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలపై దిల్లీ పెత్తనం వద్దని, ప్రాంతీయ పార్టీలనే ఎన్నికల్లో గెలిపించుకోవాలని కోరారు. హైదరాబాద్‌ నిజాంపేటలో ఆదివారం ‘మన హైదరాబాద్‌- మనందరి హైదరాబాద్‌’ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వారినుద్దేశించి మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పనేమీ చేయలేదు.. మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనిచేయవద్ద’’ని కోరారు. రెండు రాష్ట్రాల నాయకులు, పార్టీల మధ్య వైరుధ్యాలుంటాయి. కానీ వాటిని ప్రజలు, వ్యక్తులు, వ్యవస్థల మధ్య వైరుధ్యంగా చూడకూడదన్నారు. ఇటీవల ఎన్నికల సభల్లో ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని తెలిపారు. దానిలో వాస్తవం లేదని చెప్పారు. కేసీఆర్‌ మాట్లాడింది చంద్రబాబును ఉద్దేశించేనని, ప్రజల గురించి కాదని స్పష్టం చేశారు.

అమరావతికి వంద కోట్లు ఇద్దామనుకున్నాం..
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి నిర్మాణానికి తెలంగాణ తరఫున రూ.100 కోట్లు ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకు రాష్ట్ర మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది. బహిరంగ సభలో ప్రకటించాలని భావించారు. అయితే..అసలు ముందు కేంద్రం ఏమిస్తుందంటూ ఆయన ప్రధాన మంత్రి కార్యదర్శిని ఆరా తీయగా ‘కేవలం మట్టి, నీళ్లు మాత్రమే ఇస్తున్నామ’ంటూ సమాధానం వచ్చింది. కేంద్రం ఇవ్వకుండా తెలంగాణ ఇస్తే వివాదం రాజుకునే ప్రమాదముందని గుర్తించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అమరావతి శంకుస్థాపనకు వెళ్లొచ్చిన తర్వాత సీఎం కేసీఆర్‌ మాతో రెండు విషయాలు పంచుకున్నారు. ఏపీ ప్రజలు సాదరంగా ఆహ్వానించి బ్రహ్మరథం పట్టారని ఆనందం వ్యక్తం చేశారు. కొత్త రాజధానికి ప్రధాని ఎలాంటి సాయం చేయకపోవడంపై విస్మయం వ్యక్తం చేశారు.

ఎన్టీఆర్‌ వల్లే తెలుగు ప్రజలకు గుర్తింపు
చరిత్ర మలుపు తిరిగినప్పుడు కొన్ని అనివార్య మార్పులు జరుగుతాయి. ఎన్టీఆర్‌ తెదేపా స్థాపించాకా అదే జరిగింది. నందమూరి తారక రామారావు వల్లే తెలుగు వాళ్లకు గుర్తింపు వచ్చింది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అంతకుముందు మదరాసీలు అనేవారు. 70 ఏళ్ల పాటు కాంగ్రెస్‌, భాజపా దేశాన్ని సర్వనాశనం చేశాయి. ఆంధ్రాకు, తెలంగాణకు జాతీయ పార్టీలు తీరని అన్యాయం చేశాయి. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలను గెలిపించుకోవాల్సిన అవసరముంది. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలే గెలవాలి. ప్రాంతీయ పార్టీలు వృద్ధి చెందినప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి. దీనికి తెలంగాణ ప్రత్యక్ష ఉదాహరణ. కొత్తగా రాష్ట్రం ఏర్పడినప్పుడు అనేక సమస్యలు ఉత్పన్నమైనా.. తమ ప్రభుత్వం వీటన్నింటినీ అధిగమించి దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దింది. తెలంగాణ ఏర్పడినప్పుడు తెదేపాలోని ఎమ్మెల్యేల చేరికతో ఆ పార్టీ తెరాసలో విలీనమైనయినట్లయింది.

తెరాసపై అనుమానాలు పటాపంచలు
2014 ఎన్నికల నాటికి తెరాసపై అనేక అనుమానాలుండేవి. మా ప్రభుత్వంపై అనేక అపోహలను కొంతమంది సృష్టించారు. తెలంగాణ ఏర్పడితే ఆంధ్రా వాళ్లను వెనక్కి పంపిస్తారనే ప్రచారం చేశారు. అవన్నీ పటాపంచలయ్యే విధంగా గత నాలుగేళ్ల పాలన సాగింది. ప్రజల్లో మా ప్రభుత్వం ఒక నమ్మకాన్ని ఏర్పర్చింది. ఆ విశ్వాసంతోనే 18 నెలల తర్వాత జరిగిన గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో తెరాసను నమ్మి ఓట్లేసి బ్రహ్మరథం పట్టారు. నగరంలో శాంతిభద్రతల సమస్య తలెత్తలేదు. ఒక్క రోజు కూడా కర్ఫ్యూ విధించే పరిస్థితి రాలేదు. ఇది సురక్షిత నగరమనే భావన కల్పించడంలో ప్రభుత్వం విజయం సాధించింది. సెటిలర్స్‌ అనే పదాన్ని రాజకీయ నాయకులు మాత్రమే వాడుతున్నారు. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు. ప్రజల్లో మాత్రం ఆ భావన లేదు.

28hyd-main5b.jpg

కాంగ్రెస్‌ మిడిసిపాటుకు చంద్రబాబే కారణం
శాసనసభ ఎన్నికల్లో తెరాస విజయాన్ని నిలువరించలేమనే నిర్ణయానికి ప్రతిపక్ష నేతలు వచ్చారు. అందుకే తెరాస చెబుతున్నట్లు వంద సీట్లు సాధించకుండా ఆపాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పుడు చంద్రబాబు.. కాంగ్రెస్‌కు ప్రాణవాయువు(ఆక్సిజన్‌) అందిస్తున్నారు. చచ్చిన పాములాంటి కాంగ్రెస్‌ ఎగిరి పడుతోందంటే దానికి కారణం చంద్రబాబే. ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాజకీయాల్ని నడిపించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో లోకేశ్‌ తానిక్కడే పుట్టానని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఏపీకి వెళ్లి మంత్రి పదవి అనుభవిస్తున్నారు. ఆయన ఎక్కడ లోకల్‌ అన్నది ఇప్పుడు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని చంద్రబాబు చెబుతున్నారు. పక్కపక్క రాష్ట్రాలయినప్పుడు నీరు, ప్రాజెక్టుల నిర్మాణం తదితర విషయాల్లో ఇబ్బంది ఉంటుంది.

ప్రాంతీయ శక్తులు బలపడాలి
మనకు దిల్లీ పెత్తనం అవసరమా? ప్రాంతీయ శక్తులు బలపడాలి. అమిత్‌షా నోరెత్తితే సరి.. రూ.లక్షల కోట్లు ఇచ్చామని చెబుతున్నారు. ఆ డబ్బును ఆయన తన పొలం అమ్మి ఇచ్చారా? రాష్ట్రాల నుంచి పన్నులు కట్టకుంటే కేంద్రానికి నిధులెలా వెళ్తాయి? ఇలాంటి అహంకార పూరిత ధోరణితో ఉన్న భాజపా, కాంగ్రెస్‌ను తెలుగు ప్రజలు తిప్పికొట్టి ప్రాంతీయ పార్టీలను ఎన్నుకోవాలి’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు. సమావేశంలో ఎంపీలు మల్లారెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, మాజీ ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద పాల్గొన్నారు.

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • Kontekurradu

    6

  • mettastar

    4

  • JANASENA

    4

  • TheBrahmabull

    4

Popular Days

Top Posters In This Topic

Posted
1 hour ago, nallaberrry said:

Kukka biscuits for settler votes

#andhrolla kutra ledantava baa aythe

Posted

Lokesam kante veedu million times better .. atleast politics ela adalo telsu

Posted

Veediki nakka ki oeda teda ledhu brother , at least veedu ista antunadu

Nakka la escpaist kadhu veelu 

Posted

eedu vedi babu elections vachesariki, Karnataka lo Andhra debbaga BJP ki udi nattu ellaki udidi ani ivala vachi Andhra ki madatatu

amaravathi ki 100cr anta sollu kaburulu

 

Posted
4 hours ago, dasara_bullodu said:

Lokesam kante veedu million times better .. atleast politics ela adalo telsu

Lokesh is a visionary leader...others are no match to Lokesh in terms of class and charm!

Posted
1 hour ago, ARYA said:

Lokesh is a visionary leader...others are no match to Lokesh in terms of class and charm!

JAI LOKESAM 

Posted
6 hours ago, nallaberrry said:

Kukka biscuits for settler votes

Keep calm and say JAI KCR 
 

Posted
6 hours ago, tom bhayya said:

@realityni hurt chesina ktr 

nee arthanadhalu endho...don’t try to judge people without knowing them. Nenu start chesthe prathi pulka thread lo ninnu tag cheyochu.....discussion point lekapothe muskoni kooso...nenu evadni hate cheyaledhu...neela hate chese vallaku counter mathram isthanu. 

Posted

evadi drama vadidhi. udhyamam time lo veella ayya "andhra jaago..telangana bhago" annadu. state divide ayyaka peddhaga bokka pettevi cheyyaledhu anukune time lo fee reimbursement lo andhra valla anyayam jarige rule edho pettadu.. tg lo vallu chadhavakunda.. court mottikaya vesaka sakkaga ayyadu.. TRS eppudu kuda settlers ki support ga unde party kadhu.. namminodu ninda munugude

Posted

ginthe, empekkirro cheppandi ra ante sollu cheppudu.. enni sarlu settlers ante antha hate peruguddi raa lafoot pitta dora jr.

telangana emanna vere country lo vunda... Laanja natakalu ..

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...