Jump to content

inka government money tho chesthunna dharma porata deeksha lu aagaleda


Recommended Posts

Posted
ప్రధాని మోదీది ముమ్మాటికీ నమ్మకద్రోహమే
ప్రొద్దుటూరు ధర్మపోరాట దీక్షలో సీఎం చంద్రబాబు
0500503010TDP_CM-BABU.JPG

కడప: ఆంధ్రప్రదేశ్‌కు కొత్తగా ఏమీ కోరలేదని.. విభజన చట్టంలో ఇచ్చిన హమీలనే అమలు చేయాలని కోరామని తెదేపా అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. కొత్త రాష్ట్రానికి అండగా ఉంటారని, మోదీ హామీలు నమ్మి భాజపాతో పొత్తు పెట్టుకున్నామన్నారు. అయినా రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తామని తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ హామీ ఇచ్చారని చంద్రబాబు గుర్తు చేశారు. ప్రధాని మోదీ చేసింది ముమ్మాటికీ నమ్మక ద్రోహమేనని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో పోరాడిన ఏకైక పార్టీ తెదేపాయే అని, దేశానికి ఆంధ్రప్రదేశ్‌ ఆవేదనను తమ ఎంపీలే వినిపించారన్నారు. విభజన సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న అరుణ్‌జైట్లీ సైతం ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఉండాలని చెప్పిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకహోదాకు మద్దతిచ్చాయని.. అయినా ఎందుకివ్వరని చంద్రబాబు కేంద్రాన్ని నిలదీశారు. 2014 ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ఇచ్చిన హమీల వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు.

పోలవరం నా జీవితాశయం
ఎన్ని అడ్డంకులు ఎదురైనా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చడమే తమ లక్ష్యమని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 60 శాతం పనులు పూర్తయ్యాయని చెప్పారు. పోలవరం నిర్మాణానికి ఎన్నో అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపించారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయని, పోలవరం పూర్తి చేయడాన్ని తన జీవితాశయంగా పెట్టుకున్నట్లు వివరించారు. పట్టిసీమ పూర్తిచేసి గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేశామని చెప్పారు. కృష్ణా డెల్టాలో వాడే నీళ్లు శ్రీశైలానికి తీసుకొచ్చి తద్వారా రాయలసీమకు ఉపయోగపడేలా చేశామని, ఆ నీళ్లు రాకపోతే రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 62 ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని 16 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశామని వివరించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకొస్తామని సీఎం చెప్పారు.

0720413010BABUAPCMMB.JPG

వెనుకబడిన జిల్లాల నిధులు తీసుకున్నారు
రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ఇచ్చిన నిధులను కేంద్రం మళ్లీ వెనక్కి తీసుకుందని చంద్రబాబు ఆరోపించారు. తొలి మూడు సంవత్సరాల పాటు ఇచ్చిన కేంద్రం.. ప్రత్యేక హోదాపై తాము విభేదించిన తర్వాత వాళ్ల వైఖరిలో మార్పు వచ్చి నిధులను వెనక్కి తీసుకున్నారన్నారు. తెలంగాణలోని 10 జిల్లాలకు వెనుకబడిన నిధులను ఇచ్చి ఏపీపై వివక్ష చూపుతున్నారన్నారు. విశాఖ రైల్వేజోన్‌పైనా మోసం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. 11 విద్యాసంస్థలకు భూమి కేటాయించినా వాటి నిర్మాణానికి అరకొర నిధులిస్తున్నారని చెప్పారు. కేంద్రం నిధులిచ్చే తీరుని చూస్తే 30 ఏళ్లయినా నిర్మాణాలు పూర్తి కావని ఆయన ఎద్దేవా చేశారు.

నెలరోజుల్లో ‘రాయలసీమ ఉక్కు’కు శంకుస్థాపన
కేంద్ర ప్రభుత్వం కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు ముందుకు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కేంద్రం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే రాష్ట్రం తరఫున అన్ని రకాల రాయితీలు ఇస్తామని ప్రకటించామని గుర్తు చేశారు. త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని సీఎం వెల్లడించారు. నెలరోజుల్లోనే రాయలసీమ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.

0721193010BABUAPCMMA.JPG

భయపెట్టేందుకే ఐటీ దాడులు
రాష్ట్రం కోసం తాను పోరాడుతుంటే ప్రధాని మోదీ వైకాపాను లొంగదీసుకుని రాజకీయాలు చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తెదేపాను మోదీ బెదిరించారని ఆరోపించారు. అన్నట్లుగానే ఐటీ, సీబీఐ అధికారులను అడ్డం పెట్టుకుని తెదేపా ఎంపీలపై దాడులు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని చంద్రబాబు కేంద్రాన్ని హెచ్చరించారు. విశాఖలో ఫిన్‌టెక్‌ సదస్సు జరుగుతుంటే ఐటీ దాడులతో భయపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేతలపై ఐటీ దాడులు జరుగుతున్నాయని సీఎం వివరించారు.

మోదీని వాళ్లిద్దరూ ఒక్కమాటైనా అన్నారా?
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై తాను పోరాడుతుంటే జగన్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాని మోదీని ఒక్కమాటైనా అన్నారా? అని చంద్రబాబు నిలదీశారు. వీరంతా లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్డీయే నుంచి బయటకు వచ్చి పోరాడాలని మమ్మల్ని అడిగిన వైకాపా.. ఇవాళ ఎక్కడికి పోయిందని నిలదీశారు.

తిత్లీ బాధితులను జగన్‌ పట్టించుకోలేదు
తిత్లీ బాధితులను ఆదుకునేందుకు వారం పాటు శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నానని, వైకాపా అధ్యక్షుడు జగన్‌ కనీసం వారిని పట్టించుకోలేదని చంద్రబాబు విమర్శించారు. పక్క జిల్లాలోనే పాదయాత్ర జరుగుతున్నా బాధితులను పరామర్శించేందుకు రాలేదన్నారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు గుంటూరు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సైతం తిత్లీ బాధితులను పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు.

అప్పుడు నేను ప్రతిపక్షాన్ని తప్పుపట్టానా?
తిత్లీ తుపాను బాధితులను పట్టించుకోని కొందరు నేతలు.. ఇటీవల జరిగిన ఓ ఘటనపై తీవ్రంగా స్పందించారని చంద్రబాబు విమర్శించారు. తనపై అలిపిరిలో దాడి జరిగినపుడు ఆనాడు ప్రతిపక్షాన్ని తప్పుపట్టానా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేయడానికి కుట్ర పన్నారని సీఎం దుయ్యబట్టారు.

  • Haha 1
Posted
Quote

మోదీని వాళ్లిద్దరూ ఒక్కమాటైనా అన్నారా?
రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంపై తాను పోరాడుతుంటే జగన్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాని మోదీని ఒక్కమాటైనా అన్నారా?

modi ni em ina antey Jail lo pedatha ani CBN ee kada annadi 

special status vaddu , package ee muddu. worlds biggest greatest package theesukocham ani kooda told kada. sCo_^Y

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...