snoww Posted November 3, 2018 Report Posted November 3, 2018 హెచ్-1బి కఠినతరం విదేశీ నిపుణుల వివరాల వెల్లడి తప్పనిసరి కార్మిక శాఖ ఆమోదం ఉంటేనే కొత్తవారి నియామకాలు నూతన నిబంధనలు ప్రవేశపెట్టిన ట్రంప్ ప్రభుత్వం భారత ఐటీ నిపుణులపై ప్రభావం వాషింగ్టన్: హెచ్-1బి వీసా ప్రక్రియ మరింత కఠినతరమవుతోంది. ఈ వీసాలపై ఆధారపడే ఉద్యోగ సంస్థలే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. హెచ్-1బి కిందవచ్చే కొత్త విదేశీ నిపుణులను ఉద్యోగాల్లోకి తీసుకోవడం కష్టతరమయ్యేలా వీటిని సిద్ధం చేశారు. భారత ఐటీ నిపుణులపై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. వీటి ప్రకారం ప్రస్తుతం తమ దగ్గర పనిచేస్తున్న విదేశీ ఉద్యోగుల లెక్కలు తప్పనిసరిగా ఉద్యోగ సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. కార్మిక శాఖ కోరుతున్న తాజా సమాచారం అత్యంత కీలకంగా మారనుంది. దీని ఆధారంగానే కొత్తగా హెచ్-1బి వీసాదారులను తీసుకొనేందుకు ఉద్యోగ సంస్థలకు అనుమతి ఇస్తారు. దేశీయంగా ఆ ఉద్యోగానికి ఎవరూ అందుబాటులో లేరని శాఖ ధ్రువీకరించిన తర్వాతే విదేశీ నిపుణుల నియామకాలకు సంస్థలకు అవకాశం కల్పిస్తారు. దీనికి అనుగుణంగా కార్మిక నిబంధనల దరఖాస్తులో మార్పులు చేశారు. సమగ్రంగా సేకరణ హెచ్-1బి నిపుణుల ఉద్యోగ స్థితిగతులు, వారు ఎక్కడెక్కడ పనిచేస్తున్నారు? ఎంత కాలం నుంచి కొనసాగుతున్నారు? ఒక్కో కార్యాలయంలో ఎంత మంది ఉన్నారు? లాంటి వివరాలన్నీ సమగ్రంగా సేకరించేలా దరఖాస్తులో మార్పులు చేశారు. హెచ్-1బి లపై ఆధారపడుతున్న సంస్థలు, అవి అందిస్తున్న సేవలను వినియోగించుకుంటున్న ద్వితీయ పక్ష సంస్థలను స్పష్టంగా గుర్తించేలా కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. మరోవైపు వీసా నిబంధనల్లో ఏవైనా ఉల్లంఘనలు చోటుచేసుకుంటే వాటిని స్వచ్ఛందంగా వివరించేందుకు మరింత మెరుగైన వెసులుబాటునూ దరఖాస్తులో కల్పించారు. రాళ్లు రువ్వితే కాల్చేస్తాం సరిహద్దుల గుండా దేశంలోకి ప్రవేశించే అక్రమ వలసదారులు రాళ్లు రువ్వితే కాల్పులు జరుపుతామని ట్రంప్ హెచ్చరించారు. దీనిపై ఇప్పటికే సరిహద్దుల్లోని సైనికులకు ఆదేశాలిచ్చినట్లు ఆయన విలేకరులతో చెప్పారు. అక్రమ వలసదారులను పట్టుకుంటే ఇక వదిలిపెట్టబోమని స్పష్టంచేశారు. లాటిన్ అమెరికా దేశాలకు చెందిన దాదాపు 7000 మంది అమెరికాలోకి ప్రవేశించేందుకు సరిహద్దుల్లో సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఆయన స్పందించారు. మరోవైపు గ్రీన్‌కార్డు కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది విదేశీ నిపుణులను కరుణించేలా ట్రంప్ మాట్లాడారు. ‘‘అక్రమ వలసదారులకు కళ్లెంవేసే విధానాలను న్యాయబద్ధంగా ఇక్కడఉండే వలసదారులపై ప్రయోగించడం సరికాదు. ఇక్కడి విదేశీ నిపుణులు నిబంధనలను అనుసరిస్తున్నారు. గ్రీన్‌కార్డుల కోసం కొన్నేళ్లుగా వారు ఎదురుచూస్తున్నారు. ఏదో ఒకరోజు వీరు అమెరికా ప్రజల్లో పూర్తిగా కలిసిపోతారు’’ అని వలసల విధానాన్ని ప్రస్తావిస్తూ ట్రంప్ చెప్పారు. ఆరు లక్షల మందికిపైగా భారతీయులు గ్రీన్‌కార్డుల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.