Jump to content

Recommended Posts

Posted
5 hours ago, futureofandhra said:

Tdp leaders more than enough to bring nakka down

Bro mee antha knowledge kakapoyina AP division taruvatha naku gnanodayam ayindi 

Ee avineethi neethi nijayithi 

Siksha padina okkadi Peru cheppu bro correct ga 

Edho politics kosam case vestaru taruvatha as usual release

Am no way supporting corruption

Infact safety is utmost important for me 

 

Lallo thatha maaloom there ko, Jaya aunty maaloom there ko

still nuvvu edo oka sodi type chestav ani telusu, edo telusukuntav ani chinna thaapatrayam anthe!!!!

  • Replies 64
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • futureofandhra

    18

  • snoww

    13

  • RaaoSaab

    6

  • TOM_BHAYYA

    5

Posted
పోలవరంలో శరవేగంగా ప్రత్యామ్నాయ రహదారులు 

 

నేడు విద్యుత్తు సరఫరా పునరుద్ధరణ 
  నెర్రెలను పరిశీలించిన శాస్త్రవేత్తలు 
పోలవరం - న్యూస్‌టుడే

4ap-main3a_3.jpg

పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం నుంచి 19 ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి నెర్రెలిచ్చి దెబ్బతినడంతో ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రాజెక్టు వాహనాలు వెళ్లేందుకు డంపింగ్‌యార్డు మీదుగా ఒక రహదారిని నిర్మిస్తున్నారు. పోలీస్‌ చెక్‌పోస్టు నుంచి పైలట్‌ ఛానల్‌ మీదుగా ప్రాజెక్టు రహదారిని కలుపుతూ రెండో మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రాజెక్టు ఇంజినీర్ల వాహనాలతో పాటు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలకు వీలుగా ఈ రహదారిని నిర్మిస్తున్నారు. ప్రాజెక్టుతో పాటు ఏజెన్సీ గ్రామాలకు నిలిచిన విద్యుత్తు సరఫరా పునరుద్ధరణకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. పైలట్‌ ఛానల్‌ మీదుగా వేస్తున్న రహదారి వెంబడి కొత్త స్తంభాలను ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం ఉదయానికి సరఫరా పునరుద్ధరిస్తామని విద్యుత్తు శాఖ ఏడీ రామకృష్ణ తెలిపారు. 
 

4ap-main3b.jpg

మరింత పెరిగిన నెర్రెలు

పోలవరంలో రహదారిపై ఏర్పడిన నెర్రెలు ఆదివారం ఉదయానికి మరింత పెరిగి ప్రమాదకరంగా మారాయి. కొన్ని చోట్ల రహదారి ముక్కలు ముక్కలుగా విడిపోయింది. ఈ నెర్రెలను చూడటానికి ప్రజలు, పాపికొండ యాత్రకు వెళుతున్న వారు పెద్దఎత్తున వస్తున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నా.. స్థానికులు, సందర్శకులు రహదారి పైకి ఎక్కుతుండటంతో నెర్రల్లోకి జారిపడతారేమోనని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. 

పోలవరం ప్రాజెక్టు విధులపై మూడు రోజుల క్రితం దిల్లీ నుంచి వచ్చిన మట్టి, రాయి నమూనాల పరిశోధన సంస్థ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌) శాస్త్రవేత్తలు ముగ్గురు నెర్రెలు ఇచ్చిన రహదారిని పరిశీలించారు. మట్టిలో ఇటువంటి మార్పులు సహజమని వారు పేర్కొన్నట్లు పోలవరం ప్రాజెక్టు సలహాదారు వీఎస్‌ రమేష్‌బాబు ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. 

స్పిల్‌ ఛానల్‌ గట్ల ఆకృతుల తయారీకి చెన్నై ఐఐటీ ప్రొఫెసర్‌ అయోధ్య రామన్న సోమవారం పోలవరం వస్తున్నట్లు రమేష్‌బాబు తెలిపారు. 

ఒండ్రు మట్టి స్వభావమే కారణం! 
శ్రీశైలం విద్యుత్తు కేంద్రం వద్ద గతంలో ఇలాగే..  
జీఎస్‌ఐ డైరెక్టర్‌ వెల్లడి 
పోలవరాన్ని పరిశీలించిన  ఇంజినీరింగ్‌ అధికారులు 

ఈనాడు, అమరావతి: పోలవరం ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి ఎగదన్ని పెద్ద పెద్ద బీటలు వారడానికి నదీ ప్రాంతాల్లో ఉండే మట్టి స్వభావమే కారణమని నిపుణులు, ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 2008-09 సంవత్సరాల మధ్య సరిగ్గా ఇలాంటి ఘటనే చోటు చేసుకుందని భారత భూగర్భ పరిశోధన సంస్థ (జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా.. జీఎస్‌ఐ) డైరెక్టర్‌ అజయ్‌కుమార్‌ ‘ఈనాడు’కు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఇంజినీరింగ్‌ అధికారులు కూడా శని, ఆదివారాల్లో ఆయన్ను సంప్రదించారు. అప్పట్లో శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో మట్టి స్వభావంలో ఇలాంటి మార్పులే వచ్చి విద్యుత్తు కేంద్రంపై ప్రభావం చూపించిందని, అది కుంగిపోతుందంటూ భయపడ్డారని కూడా ఆయన వారికి గుర్తు చేశారు. విశాఖ షిప్‌యార్డ్‌లోనూ ఇలాంటి ఘటనే జరిగిందని పోలవరం అధికారులు ఈ సందర్భంగా ఆయన వద్ద ప్రస్తావించారు. అయితే ఇది చాలా సాధారణమేనని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని అజయ్‌కుమార్‌ వారికి వివరించారు. ‘నదీ ప్రాంతాల్లో ఒండ్రుమట్టి ఎక్కువగా చేరుకుంటుంది. ప్రస్తుతం పైకి ఎగదన్నిన రోడ్డు చుట్టుపక్కల కూడా ఒండ్రుమట్టి చేరిన ప్రాంతమే. పోలవరం ప్రాజెక్టులో తవ్విన మట్టిని సైతం అక్కడే పోస్తున్నారు. అదీ ఒండ్రుమట్టే. ఇది త్వరగా ద్రవరూపంలోకి మారిపోతుంది. గట్టితనం తక్కువ. ఆ మట్టికుండే జారిపోయే స్వభావం వల్ల అది కిందికి చేరి, ఒత్తిడి పెరిగి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది’ అని పోలవరం ఇంజినీర్లు స్పష్టం చేస్తున్నారు. 

డంప్‌యార్డు వద్ద ముందస్తు జాగ్రత్తలు ఉంటే.. 
పోలవరం డంప్‌యార్డు వద్ద మట్టి గుట్టలుగా పోస్తున్నారు. ఆ మట్టిని పోసే ముందు కింద సున్నంతో లేదా ఇసుక, రాళ్లతో ఒక పొరను ఏర్పాటుచేసి కొంత మేర రక్షణ చర్యలు తీసుకుంటే ఇలాంటి ఇబ్బందులు వచ్చేవి కావని నిపుణులు చెబుతున్నారు. డ్రైనేజీ ఏర్పాట్లు సరిగ్గా చేయాలని సూచిస్తున్నారు. ఈ మేరకు డంపింగ్‌యార్డు వద్ద చర్యలు చేపట్టేందుకు పోలవరం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

మట్టి నమూనాల సేకరణ 
పోలవరం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ నిపుణులు మట్టి నమూనాలు సేకరించారు. స్పిల్‌ఛానల్‌ వద్ద, రోడ్డు ఉబికిన పరిసర ప్రాంతాల్లో ఈ నమూనాలను సేకరించారు. కేంద్ర ఆకృతుల సంస్థ చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీనివాస్‌ సైతం సందర్శించారు. ఈ ఘటన వల్ల ప్రాజెక్టు పనులకు ఎలాంటి అంతరాయం కలగలేదని ప్రాజెక్టు చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీధర్‌ చెప్పారు.

Posted
On 11/4/2018 at 11:22 AM, SonaParv_522 said:

Lallo thatha maaloom there ko, Jaya aunty maaloom there ko

still nuvvu edo oka sodi type chestav ani telusu, edo telusukuntav ani chinna thaapatrayam anthe!!!!

pilla congress maaloom there ko ani @psycopk asking

Posted
 
 
Netizens Setyres On Chandrababu Tweet - Sakshi

సీఎం చంద్రబాబు ట్వీట్‌

మట్టిలో తేమ శాతం తగ్గడం వల్లే పోలవరం రహదారిపై పగుళ్లు అన్న సీఎం ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్‌

ఈసారి తప్పిదాన్ని ప్రకృతిపై నెట్టేశారంటూ విమర్శలు

ఆపరేషన్‌ గరుడలో భాగంగా కేంద్రమే పగుళ్లు సృష్టించిందంటూ ధర్మపోరాట దీక్షలు చేయరుగా అంటూ చురకలు

సీఎం ట్వీట్‌కు ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో స్పందన రావడం ఇదే ప్రథమం  

మట్టిలో తేమ శాతం తగ్గడం, వాతావరణంలోని మార్పులవల్లే పోలవరం ప్రాజెక్టుకు వెళ్లే మట్టి రహదారిలో పగుళ్లు ఏర్పడ్డాయని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటూ సీఎం చంద్రబాబు చేసిన ట్వీట్‌పై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. తుపాన్లు, సముద్రాలు, ఎండలనే జయించిన సీఎం ప్రకృతిని జయించలేకపోయారా అంటూ నెటిజన్లు విరుచుకుపడ్డారు. కీలక ప్రాజెక్టు దగ్గరకి వెళ్లే సిమెంట్‌తో నిర్మించిన రహదారి భారీ ఎత్తున బీటలు వారితే సంబంధిత అధికారులు, కాంట్రాక్టులపై చర్యలు తీసుకోకుండా, తప్పంతా ప్రకృతిదేనని వ్యాఖ్యానించడమేమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే దానిని వెంటనే ప్రతిపక్షాలపైకి నెట్టేసే సీఎం ఈసారి తప్పును ప్రకృతి మీదకి నెట్టేశారని వ్యాఖ్యానించారు. ఆపరేషన్‌ గరుడలో భాగంగా కేంద్రం పగుళ్లు సృష్టించిందంటూ ధర్మపోరాట దీక్షలకు దిగరు కదా అంటూ చురకలేశారు. 

అది మట్టి రహదారా మహాశయా..
శీతాకాలంలో పగుళ్లకు వేజలైన్‌ వాడాలంటూ ఒక నెటిజన్‌ సెటైర్‌ 
cccccccccccccccct.jpgఫొటోలు, వీడియోల్లో కిలోమీటరుకుపైగా ఉన్న ఆ రహదారి సిమెంట్‌తో నిర్మించినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా అది మట్టితో నిర్మించిన రహదారి అని సీఎం చంద్రబాబు చెప్పడాన్ని నెటిజన్లు తప్పుపట్టారు. ఏదైనా ఒక పని మొదలు పెట్టేటప్పుడు ఆ భూమిలో తేమ శాతం ఎంత, నిర్మాణంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది సివిల్‌ ఇంజనీర్ల కనీస ధర్మమని, అలాంటిది తేమ శాతం తగ్గడం వల్ల రహదారి పగిలిపోయిందని సీఎం బాధ్యతారాహిత్యంగా ఎలా ప్రకటిస్తారని మండిపడుతున్నారు. రేపటిరోజున ఏదైనా జరగరానిది జరిగితే ఎండ వేడి పెరగడం వల్ల పోలవరం ప్రాజెక్టుకు పగుళ్లు ఏర్పడ్డాయంటూ ప్రకటిస్తారా? అని దుయ్యబట్టారు. సీఎం చెప్పినట్లు వాతావరణ మార్పులవల్ల పోలవరం ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే గోదావరి రెండు జిల్లాలు మునిగిపోయే ప్రమాదముందన్న భయాందోళనలను వారు వ్యక్తం చేస్తున్నారు. గతంలో చిన్నపాటి వర్షానికే తాత్కాలిక సచివాలయంలో పెచ్చులూడిపోయి నీరు లోపలికి రావడంతోపాటు గోడలు కూడా కూలిపోయాయని, ఇప్పుడు కీలక ప్రాజెక్టు వద్ద రోడ్డే ఇలా పగిలిపోయిందంటే కాంట్రాక్టర్ల అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. గోదావరి నది పక్కన తేమ తగ్గితేనే రహదారి ఇలా పగిలిపోయిందని, ఇప్పుడు కృష్ణా నది పక్కన రాజధాని ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారని, మెత్తటి నేలల్లో ఇంతటి ఎత్తైన భవనాలు ఎలా తట్టుకుంటాయంటూ మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. మట్టిలో తేమ శాతం తగ్గడం వల్ల కాదు.. పనుల్లో అవినీతి శాతం పెరగడం వల్ల పగుళ్లు ఏర్పడ్డాయన్నారు.

సెటైర్లే సెటైర్లు...
సీఎం వ్యాఖ్యలపై నెటిజన్లు భారీ ఎత్తున సెటైర్లు విసురుతున్నారు. ఈ రోడ్లను సింగపూర్‌ టెక్నాలజీతో నిర్మించారా? లేక జపాన్‌ టెక్నాలజీనా? అని కొందరు ప్రశ్నిస్తే.. వాతావరణ పరిస్థితులు పరిగణనలోకి తీసుకోకుండా ఈ రోడ్డును నిర్మించారంటే ఆ ఇంజనీర్లు తప్పక నారాయణ కాలేజీ నుంచి వచ్చినవాళ్లే అయి ఉంటారంటూ జోకులేస్తున్నారు. వేజలైన్‌ రాస్తే శీతాకాలంలో పగుళ్లు రావని, ఇకనుంచీ మట్టిలో వేజలైన్‌ కలిపి రోడ్లు వేయాలంటూ.. దానికి రూ.100 కోట్లు కేటాయించడంటూ ట్వీట్‌ చేశారు. రెయిన్‌గన్స్‌ టెక్నాలజీని వినియోగించాలని చురకలేశారు. ప్రకృతినే కంట్రోల్‌ చేసినవాళ్లకు ఈ పగుళ్లు ఎంతంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌తో కలవడం ప్రకృతికి కూడా ఇష్టం లేదనుకుంటా అని మరికొంతమంది చమత్కరించారు. సాధారణంగా సీఎం చేసే ట్వీట్‌కు 500లోపు లైకులు, 150 నుంచి 200లోపు ప్రతిస్పందనలు ఉంటాయి. అయితే సీఎం తాజా ట్వీట్‌కు సోమవారం సాయంత్రానికే దాదాపు 3,500 లైకులు, 950కిపైగా రీట్వీట్‌లు వచ్చాయి.

Posted
Quality deficiencies in Copper Dam jet grouting works are exposed - Sakshi

కొట్టుకుపోయిన జెట్‌ గ్రౌటింగ్‌

కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ పనుల్లో నాణ్యతా లోపాలు బహిర్గతం 

గోదావరిలో సాధారణ వరద ప్రవాహానికే కొట్టుకుపోయిన జెట్‌ గ్రౌటింగ్‌ 

డెన్సిఫికేషన్‌ చేయకుండానే ఈసీఆర్‌ఎఫ్, కాఫర్‌ డ్యామ్‌ పనులు చేస్తున్న వైనం 

పనులు సక్రమంగా చేయకపోయినా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న ప్రభుత్వం 

లోపాలు సరిదిద్దకపోతే జలాశయం భద్రతకు ముప్పు తప్పదంటున్న నిపుణులు 

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌(జలాశయం) పనుల్లో నాణ్యతా లోపాలు మరోసారి బహిర్గతమయ్యాయి. గోదావరి నదిలో సాధారణ వరద ప్రవాహానికే కాఫర్‌ డ్యామ్‌ పునాది(జెట్‌ గ్రౌటింగ్‌) కొట్టుకుపోవడం గమనార్హం. ప్రభుత్వ పెద్దలు తమకు బాగా కావాల్సిన కాంట్రాక్టర్లకే ‘నామినేషన్‌ విధానం’లో పోలవరం ప్రాజెక్టు పనులు అప్పగించిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్లు పనులు ఎలా చేసినా అభ్యంతరం చెప్పకుండా బిల్లులు చెల్లించేలా.. వాటి పర్యవేక్షణకు, నాణ్యత పరిశీలనకు వేర్వేరుగా చీఫ్‌ ఇంజనీర్లను నియమించకుండా ఒకే చీఫ్‌ ఇంజనీర్‌ను నియమించారు. దాంతో పనులు నాసిరకంగా చేసినా నాణ్యంగా ఉన్నట్లుగా ధ్రువీకరించి, బిల్లులు మంజూరు చేస్తున్నారు. పోలవరం జలాశయం స్పిల్‌ వే(కాంక్రీట్‌ ఆనకట్ట)లో చీలికలు ఏర్పడ్డాయి. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) సభ్యులు వైకే శర్మ నేతృత్వంలోని నిపుణుల కమిటీ నాణ్యతా లోపాలను బహిర్గతం చేసింది. ఇటీవల లోక్‌సభ, శాసనసభలకు సమర్పించిన నివేదికల్లోనూ పోలవరం ప్రాజెక్టు పనుల్లో నాణ్యతా లోపాలపై కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) కడిగి పారేసింది. 

తూతూమంత్రంగా జెట్‌ గ్రౌటింగ్‌ పనులు 
గోదావరి నదిలో 50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు నీటిని విడుదల చేసేలా పోలవరం జలాశయం డిజైన్‌ రూపొందించారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌(ఈసీఆర్‌ఎఫ్‌) పనులు పూర్తయ్యేలోగా 41.5 మీటర్ల ఎత్తున నిర్మించే కాఫర్‌ డ్యామ్‌లోనే నీటిని నిల్వ చేసి, వచ్చే ఏడాది మే నాటికి గ్రావిటీపై కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు పదేపదే ప్రకటిస్తున్నారు.  కాంట్రాక్టు ఒప్పందం ప్రకారం.. కాఫర్‌ డ్యామ్‌ నిర్మాణానికి పునాదిని షీట్‌ ఫైల్స్‌ విధానంలో వేయాలి. కానీ, ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే కాఫర్‌ డ్యామ్‌ పునాది పనులను కెల్లర్‌ అనే సంస్థకు నామినేషన్‌పై కట్టబెట్టారు. జెట్‌ గ్రౌటింగ్‌ విధానంలో కాఫర్‌ డ్యామ్‌ పనులు చేస్తామని ఈ సంస్థ ప్రకటించింది.

గోదావరి నదీ గర్భంలో ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన, దిగువన కాఫర్‌ డ్యామ్‌ నిర్మించే ప్రాంతంలో ప్రతి 1.5 మీటర్లకూ రాతి పొర వచ్చే వరకూ బోరు బావి తవ్వి, అధిక ఒత్తిడితో సిమెంట్, ఇసుక, బెంటనైట్‌ మిశ్రమాన్ని పంపితే భూగర్భంలో ఏవైనా చీలికలు ఉంటే మూసుకుపోయి అత్యంత పటిష్టవంతమైన ఒక గోడ తరహాలో పొర తయారవుతుంది. దీనివల్ల చుక్క నీరు కూడా లీకవ్వదు. దీన్నే జెట్‌ గ్రౌటింగ్‌ అంటారు. ఈ పునాదిపైనే కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి.  ఎగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ పనులను 2308 కాలమ్స్, దిగువ కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్‌ పనులు 945 కాలమ్స్‌ ద్వారా పూర్తి చేశామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. కానీ, ఈ పనుల్లో నాణ్యతకు తిలోదకాలు ఇచ్చారు. అందువల్లే సాధారణ వరద ప్రవాహానికే జెట్‌ గ్రౌటింగ్‌ పునాది కొట్టుకుపోయిందని జలవనరుల శాఖ సీనియర్‌ ఇంజనీర్లు చెబుతున్నారు. 

 

డెన్సిఫికేషన్‌ చేయకుండానే.. 
ఇసుక తిన్నెల్లో నిర్మించే ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన 500 మీటర్లు.. దిగువన 500 మీటర్ల పొడవున నదీ గర్భంలో డెన్సిఫికేషన్‌(సాంద్రీకరణ) విధానంలో ఇసుక పొరలను పటిష్టం చేయాలి. యంత్రాలతో అధిక ఒత్తిడితో ఇసుక పొరలను కూరాలి. దీనివల్ల ఈసీఆర్‌ఎఫ్‌కు ఎగువన.. దిగువన నదీ గర్భంలో గట్టి పొర ఏర్పడుతుంది. నీరు లీకేజీ కాదు. కాఫర్‌ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్‌ల భద్రతకు డోకా ఉండదు. అయితే, కాంట్రాక్టర్‌ డెన్సిఫికేషన్‌ సక్రమంగా చేయలేదని ఆ పనులను పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు చెప్పారు. డెన్సిఫికేషన్‌ చేయకుండానే కాఫర్‌ డ్యామ్‌ జెట్‌ గ్రౌటింగ్, ఈసీఆర్‌ఎఫ్‌ డయాఫ్రమ్‌ వాల్‌ పనులు చేశారు. ఇసుక పొరల్లో చీలికలు యథాతథంగా ఉండిపోయాయి. దాంతో భూగర్భంలో నీటి లీకేజీలు కావడం వల్లే సాధారణ వరద ప్రవాహానికే జెట్‌ గ్రౌటింగ్‌ కొట్టుకుపోయిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. డయాఫ్రమ్‌ వాల్‌ పనులు సైతం అక్కడక్కడ కొట్టుకుపోయినట్లు చెబుతున్నారు. నాణ్యతా లోపాలను సరిదిద్దకుండా కాఫర్‌ డ్యామ్, ఈసీఆర్‌ఎఫ్‌లను నిర్మిస్తే జలాశయం భద్రత ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...