snoww Posted November 4, 2018 Report Posted November 4, 2018 బ్రేకుల్లేని అవినీతి ఏఎంవీఐ అక్రమార్జన రూ. 30 కోట్లు తనిఖీల్లో గుర్తించిన అనిశా కేంద్ర దర్యాప్తు బృందం 2003లో తొలిసారి సోదాల్లోనూ పట్టుబడ్డ అధికారి ఈనాడు - విశాఖపట్నం, న్యూస్‌టుడే - మాధవధార: విశాఖపట్నంలో ఆయనో సహాయ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టరు(ఏఎంవీఐ). పేరు శరగడం వెంకటరావు. 2003లో అవినీతి నిరోధక శాఖ(అనిశా) సోదాల్లో పట్టుబడ్డారు.. అక్రమార్జనకు సంబంధించి ఆ కేసు ఇప్పటికీ నడుస్తోంది.. ఫలితంగా ఉద్యోగోన్నతీ దక్కలేదు.. అప్పటి కేసు అలా ఉండగా మరోసారి తన ఆస్తులపై సోదాలు జరిగే అవకాశం లేదనే ధీమాతోనే కావచ్చు.. తన అవినీతిని మరింతగా విస్తరింపజేశారు. 15 ఏళ్ల తర్వాత తాజాగా శనివారం అనిశా కేంద్ర దర్యాప్తు బృందం జరిపిన సోదాల్లో రూ.2కోట్లకుపైగానే అక్రమాస్తులు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ సుమారు రూ.30 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సోదాలు కొనసాగుతున్నాయి. శరగడం వెంకటరావు, ఆయన బంధువుల ఇళ్లపై శనివారం ఉదయమే 10 అనిశా బృందాలు సోదాలు ప్రారంభించాయి. విలాసవంతమైన ఇళ్లు, వాహనాలను గుర్తించాయి. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు ఆధారాలు లభించడంతో విశాఖపట్నం మురళీనగర్‌లోని వెంకటరావు నివాసంతోపాటు 9 ఇతర ప్రాంతాల్లో తనిఖీలు జరిపామని అనిశా అదనపు ఎస్పీ రమాదేవి తెలిపారు. హైదరాబాద్‌లోనూ ఒక బృందం సోదాలు చేసిందన్నారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన వెంకటరావు స్వగ్రామం విశాఖ జిల్లా సబ్బవరం మండలం పెదయాతపాలెం. 1994లో ఏఎంవీఐగా విధుల్లో చేరారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖల్లో పనిచేశారు. గత 15 ఏళ్లలో కూడగట్టిన ఆస్తులు.. * వెంకటరావు తన పేరు మీద విశాఖపట్నంలోని గోపాలపురంలో 311.11 చదరపు గజాల స్థలాన్ని 2015లో కొన్నారు. * ఆయన భార్య వెంకటపద్మ పేరున సబ్బవరం మండలం బంగారమ్మపాలెంలో ఒకచోట 29సెంట్లు, మరోచోట 39సెంట్లు, ఆరిపాక గ్రామంలో 2.05 ఎకరాల భూమిని 2013లో కొన్నారు. * కుమారుడు ప్రవీణ్‌కుమార్ పేరిట బంగారమ్మపాలెం, ఆరిపాకల్లో 93 సెంట్లు, మరో కుమారుడు ప్రసన్నకుమార్ పేరిట 20సెంట్ల భూమి 2008లో కొన్నారు. * కూతురు రితికా పేరున ఆరిపాకలో 95సెంట్ల స్థలంలో జీ+2 భవనం * తల్లి వెంకాయమ్మ పేరుమీద ఆరిపాకలో 81 సెంట్ల భూమి. స్వగ్రామం పెదయాతపాలెంలో 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇల్లు * వెంకటరావు అత్త సిలిపరశెట్టి పార్వతి పేరుమీద విశాఖపట్నం గోపాలపురంలో 220చ.గ. విస్తీర్ణంలో జీ+2 భవనం * వెంకటరావు సోదరి కళ్ల రమణమ్మ పేరున సబ్బవరం మండలం గొట్టివాడలో 555.55 చ.గ., గోపాలపురంలో 220 చ.గ. స్థలాలు * బ్యాంకులో నగదు నిల్వ రూ.25లక్షలు * 500 గ్రా. బంగారం, 3 కేజీల వెండి * మూడు కార్లు (హుందాయ్ 120, మహీంద్రా ఎక్స్‌యూవీ, స్కోడా) తెరవాల్సిన 5 లాకర్లలో ఏముందో..? వెంకటరావు పేరిట విశాఖలోని పలు బ్యాంకుల్లో 5 లాకర్లు ఉన్నాయని, వాటిని తెరవాల్సి ఉందని అనిశా అధికారులు చెప్పారు. 2003నాటి సోదాల సమయంలో వెంకటరావు పేరిట మురళీనగర్‌లో ఖాళీ స్థలాన్ని గుర్తించారు. ఇప్పుడక్కడ రెండంతస్తుల భవనాన్ని అతి విలాసవంతంగా నిర్మించారు. నాటి అనిశా దాడుల సమయంలో మురళీనగర్‌లో ఒక భవనం ఉన్నట్లు గుర్తించగా.. ఇప్పుడు దానిపై మరో రెండు అంతస్తులు నిర్మించడం గమనార్హం. Quote
snoww Posted November 4, 2018 Author Report Posted November 4, 2018 Quote 2003లో తొలిసారి సోదాల్లోనూ పట్టుబడ్డ అధికారి Quote
kittaya Posted November 4, 2018 Report Posted November 4, 2018 Aedaina sadyame sendral sir govt lo Quote
snoww Posted November 4, 2018 Author Report Posted November 4, 2018 bodi kutra. AP lo development avvakunda fear create cheyyataaniki bodi chepisthunnadu raids. Quote
hyperbole Posted November 4, 2018 Report Posted November 4, 2018 Tdp party office laga kattinadu..color selection kuda matching Quote
ChinnaBaabu Posted November 4, 2018 Report Posted November 4, 2018 4 hours ago, snoww said: Eenadu/ABN/TV9 soodhallo pattubadina vaallu andharu non-Ks maatrame vuntaaru yendhuku? Quote
Equalirights Posted November 4, 2018 Report Posted November 4, 2018 ACB ki IT department ki Theda teleyani Theda gallu.. Quote
SonaParv_522 Posted November 4, 2018 Report Posted November 4, 2018 Ohh acb pani chestonda AP lo? Quote
snoww Posted November 4, 2018 Author Report Posted November 4, 2018 fake news idi , bodi kutra. CBN real time governance dash board vunnaka corruption not possible. nippu CBN. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.