Jump to content

Gujarat Patel statue


Recommended Posts

Posted
1 minute ago, snoww said:

First koncham pilla congress PPT's lo kaakunda , google chesi government websites articles lo chaduvu , which project got how many funds from center ani. 

dholera special investment region basis meda already center released funds 5000C 

neku telvakapote jai telangana anukuni silent undu  ikada sollu preachings iyamak

  • Replies 40
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • ariel

    22

  • snoww

    7

  • sattipandu

    5

  • TOM_BHAYYA

    1

Top Posters In This Topic

Posted

దేశంలో ఆర్ధిక రంగం విషయంలో కేంద్ర ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఎంతగానో ఉన్నాయి. చిన్నపాటి అలసత్వం అయినా సరే అది ప్రభుత్వానికి ఇబ్బంది కావడమే కాకుండా దేశ ఆర్ధిక వ్యవస్థనే కుప్ప కూల్చేస్తుంది. అందుకే ప్రధానిగా ఉన్న వ్యక్తి ఆర్ధిక మంత్రిగా సమర్ధుడిగా ఉన్న వ్యక్తిని నియమిస్తూ ఉంటారు. గతంలో పీవీ నరసింహారావు దేశం ఆర్ధిక సంక్షోభంలో ఉన్న సమయంలో తన మంత్రి వర్గంలో మన్మోహన్ సింగ్ ని తీసుకుని ఆయనతో కలిసి ఆర్ధిక వ్యవస్థను చాకచక్యంగా చక్కదిద్దారు.

kuylkuli.jpg

ఇప్పుడు మోడీ సర్కార్ విషయానికి వస్తే లాయర్ గా ఉన్న వ్యక్తిని ఆర్ధిక మంత్రిగా నియమించారు. మంత్రి కేవలం రబ్బరు స్టాంపుగా మిగిలిపోయారని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఆయన ప్రమేయం లేకుండానే జరిగిపోతున్న విషయం ప్రజలకి తెలుస్తూనే ఉంది. ఇక దేశం పడుతున్న కష్టాల గురించి అందరికి తెలిసిన విషయమే. అరుణ్ జైట్లీ తీసుకున్న నిర్ణయాలే గాని మరొకటి గాని ఇప్పటి వరకు దేశానికి ఉపయోగ పడింది ఏమిలేదనే చెప్పవచ్చు. ఇప్పుడు తాజాగా దేశం మరో ఆర్ధిక ఇబ్బందిని ఎదుర్కోవడానికి సిద్దమవుతుంది. వచ్చే 9 రోజుల్లో ఈ దేశం లో ఉన్న NBFC లకు దాదాపు 50 వేల కోట్లు కావాలి, వాళ్ళు తెచ్చిన అప్పు వాయిదా కట్టడానికి.. ఇది కట్టకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు సంక్షోభం లో వున్న NBFC ల దగ్గర అంత సొమ్ము లేదు.. సొమ్ము చెల్లించకపోతే ..నవంబర్ 9 కల్లా కంపెనీలు స్టాక్ మార్కెట్ లు కుప్పకూలే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి… ఇప్పటికే నెల క్త్రితం మార్కెట్ కుదుపు లో 4 లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. మార్కెట్ లో NBFC ల దగ్గర నుండి రుణాలు దొరికే అవకాశాలు ఏ మాత్రం లేవు. ఇంటి రుణాలు, బంగారం రుణాలు, బండి రుణాలు, PMAY, ముద్ర, చిన్న వ్యాపారుల రుణాలు అన్నీ ఆగిపోయి అల్లకల్లోలం అవుతుంది, దీనిని ఎదుర్కొకపోతే దేశం పరువు కూడా పోయే అవకాశం ఉంది.

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపధ్యంలో దీన్ని తప్పించుకోవడం కోసం, ప్రభుత్వం ఈ NBFC లకు వేల కోట్ల సాయం చేస్తాను అంటోంది …కానీ ఇది చట్ట విరుద్దం ..ఇలా చేయకూడదు ..ఇవేమీ ప్రభుత్వ రంగ సంస్థలే కాదు ..మోడీ పరువు దక్కించుకోవడానికి వేల కోట్లు ఫణం గా పెడుతున్నారు, RBI ద్వారా ప్రభుత్వ బ్యాంకులను వీటికి లక్ష కోట్లు ఇవ్వమని ఒత్తిడి చేస్తున్నారు, దీనినే RBI ఒప్పుకోవడం లేదు అందుకే రిజర్వ్ బ్యాంకు గవర్నర్ ఊర్జిత్ పటేల్ కి గొడవ.. ఇప్పటికే నోట్ల రద్దుతో పరువు పోగొట్టుకున్న ఆర్బిఐ దీనిని ఎదుర్కోవడానికి నానా అవస్థలు పడుతుంది. మరి రుణ ఎగవేతదారుల లాభం కోసం ఇప్పుడు ఆర్బిఐ దగ్గర ఉన్న ఆ డబ్బుని కూడా ప్రధాని మోడీ ఆవిరి చేస్తారా లేక ఆర్బీఐ దేశం కోసం ప్రధాని మాటలని ఖాతరు చేయకుండా నిలబడుతుందా. ఏమో చూడాలి మరి.

Posted

 

గుజరాత్‌లోని నర్మదానదీ తీరంలో నవభారత నిర్మాత సర్దార్‌ పటేల్‌ 182 మీటర్ల ఎత్తు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం ముదావహం. ప్రపంచంలోనే అంత ఎత్తయిన విగ్రహం మరొకటి లేదు. అది ప్రపంచంలో (8వ ‘అద్భుతం’ కాగలదనడంలో సందేహం లేదు!

 

అయితే ఆ విగ్రహం కింద వుండే ఫలకంపై అన్ని భాషలు వున్నా, తెలుగు భాష లేదన్న విషయమై వాదోపవాదాలు జరుగుతున్నాయి. తెలుగు భాష లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కూడా తన అసమ్మతిని వ్యక్తం చేశారు.

 

నిజానికి, ‘దేశ భాషలలో తెలుగు లెస్స’ మాత్రమే కాదు – హిందీ తరువాత రెండవ పెద్ద భాష కూడా. తెలుగును ‘మూడవ పెద్ద భాష’ అంటున్నారు కాని, అది సరికాదు. బెంగాల్‌ను తూర్పు బెంగాల్‌, పశ్చిమ బెంగాల్‌గా దేశ విభజన సమయంలో చీల్చక పూర్వం హిందీ, బెంగాలీ, తెలుగు భాషలు వరుసగా ఒకటి, రెండు, మూడవ స్థానాలలో వుండేవి. ఇప్పుడు తూర్పు బెంగాల్‌ కూడా ‘బంగ్లాదేశ్‌’గా వేరే దేశమై పోయింది. అందువల్ల, తెలుగు భాషకు హిందీ తరువాత రెండవ స్థానం లభించింది.

 

భారతదేశంలో తెలుగు భాష ప్రాముఖ్యం ఒకసారి కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీలోనే తెలిసింది. అది కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతున్న సన్నివేశం. ఆంధ్రప్రముఖుడు, మహా మేధావి. ఆ తరువాత అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడైన (1948) డాక్టర్‌ పట్టాభి సీతారామయ్య ఆ సమావేశంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధి, పండిట్‌ నెహ్రూ, సర్దార్‌ పటేల్‌, మౌలానా ఆజాద్‌ వంటి హేమా హేమీలందరూ వున్నారు. డాక్టర్‌ పట్టాభి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర నిర్మాణాన్ని గురించి ప్రస్తావించగా, ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ పటేల్‌ లేచి, ‘పట్టాభీ! ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అంటావు! మీ ఆంధ్ర రాష్ట్రం దేశంలో ఎక్కడున్నదయ్యా! మీరు మద్రాసులో వున్నారు. మీరు మద్రాసీలు కదా!’ అంటూ కొంచెం వెటకారంగానే ప్రశ్నించారు!

 

డాక్టర్‌ పట్టాభి సామాన్యుడా! ఆయన వెంటనే లేచి, అప్పుడు వాడుకలో వున్న ‘అణా’ నాణెమును తన జేబులో నుంచి తీసి చూపిస్తూ పటేల్‌గారూ, మా తెలుగు భాష స్థానాన్ని బ్రిటిష్‌ ప్రభుత్వమే గుర్తించింది! ఇదుగో! ఈ అణా కాసును చూడండి. దీనిపై జాతీయ భాష అయిన హిందీలో ‘ఏక్‌ అణా’ అని, అధికార భాష అయిన ఇంగ్లీషులో ‘వన్‌ అణా’ అని, తరువాత మా తెలుగు భాషలో ‘ఒక అణా’ అని రాసివుంది. మరి, మీ గుజరాతీ భాష కాని, మీరు చెప్పిన మద్రాసీల తమిళ భాష కాని లేవే?’ అని వెటకారంగానే అన్నారు.

 

సమావేశంలోనే వున్న మహాత్మాగాంధి చిరునవ్వు నవ్వారు. ఆయన మాతృ భాష కూడా గుజరాతీ కదా! సర్దార్‌ పటేల్‌ కూడా నిరుత్తరుడై, ఔనన్నట్లు తల వూపారు. తక్కిన కాంగ్రెసు వర్కింగ్‌ కమిటీ సభ్యులెవ్వరూ మాట్లాడలేదు. ఔను, మరి! అణాకాసు పై వున్న సాక్ష్యాధారాలతో తెలుగు భాష ఘనతను ప్రపంచానికి తెలియజెప్పినప్పుడు ఎవరైనా ఏమి మాట్లాడ గలరు? అది బ్రిటిష్‌ ప్రభుత్వం ముద్రించిన అణా నాణెం కదా అంతే కాదు – ఇటాలియన్‌, భాషావేత్త నికోలయ్‌ కోంటి 1420లో భారత దేశ సందర్శనకు వచ్చి, దేశంలోని ప్రధాన భాషలన్నింటిని పరిశీలించి, అజంతమైన, తెలుగు భాషను ‘ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్’ గా అభివర్ణించారు. ప్రసిద్ధ తమిళ కవీంద్రుడు సుబ్రహ్మణ్య భారతి ‘సుందర తెలుంగు’ అని ప్రస్తుతించారు.

 

దేశానికే తెలుగు అధికార భాష కావాలి. ఇక ప్రసిద్ధ బ్రిటిష్‌ శాస్త్రవేత్త జె.బి.ఎన్‌. హాల్టేన్‌ తెలుగు భాష భారతదేశంలోని భాషలన్నింటికంటే దేశానికే అధికార భాష కాదగినదని పేర్కొన్నారు. కాగా, 2012 అక్టోబర్‌లో థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ భాషాలిపుల నిపుణుల మహా సభలో తెలుగు లిపికి రెండవ ఉత్తమ లిపి స్థానం లభించగా, కొరియన్‌ లిపికి ప్రథమ స్థానం లభించింది. అయితే, ఆ భాష రెండు కొరియా దేశాలకే పరిమితం. తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో వున్నారు.

 

ఇంత ఘనమైన తెలుగు భాష ప్రశస్తి, ప్రసక్తి ఆ ప్రపంచంలోనే అపురూపమైన విగ్రహ ఫలకంపై అన్ని భాషలతో పాటే లేకపోతే అలా వచ్చిన వార్త యధార్థమైతే, సర్దార్‌ పటేల్‌ ఆత్మ సంతోషించదు! పట్టాభి – అణా కాసు కథ చరిత్రాత్మకమైనది. అది సర్దార్‌ పటేల్‌ సమక్షంలో జరిగిన యధార్థ గాధ!

Posted

Telugu bhasha ni tokkeyalani chudadame statue meda mana language lekapovadam 

 

Posted
12 minutes ago, ariel said:

అయితే ఆ విగ్రహం కింద వుండే ఫలకంపై అన్ని భాషలు వున్నా, తెలుగు భాష లేదన్న విషయమై వాదోపవాదాలు జరుగుతున్నాయి. తెలుగు భాష లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కూడా తన అసమ్మతిని వ్యక్తం చేశారు.

 

 

10 minutes ago, ariel said:

Telugu bhasha ni tokkeyalani chudadame statue meda mana language lekapovadam 

 

Bro info that Telugu wasn't there in list of Languages is fake adi chudaledha inka...

Posted
9 minutes ago, ariel said:

Telugu bhasha ni tokkeyalani chudadame statue meda mana language lekapovadam 

 

Lol Telugu undi Ra erri p avvoddu malli malli... Nee brainless yellow slavery supinchindi saalu iga

Posted
5 hours ago, Kool_SRG said:

 

Bro info that Telugu wasn't there in list of Languages is fake adi chudaledha inka...

PPT lo vuntene vunnnattu pilla congress fans ki. Like Amaravati , top city in the world in PPT's

Posted
On 11/6/2018 at 1:01 PM, ariel said:

Bodi gadu Gujarat ni ekadiko tesukeldam ani baga try chestunnadu *&*

ee vishayam aa pk  ki cheppandi va... modi desaniki upayogam padadatam impossible....

gujju gallu telisindhe ga.. chetha nayallu

 

Posted

Fake foto circulate aindi man , google it chala articles osthay ah faking medha

Posted
9 hours ago, roll_retta said:

Lol Telugu undi Ra erri p avvoddu malli malli... Nee brainless yellow slavery supinchindi saalu iga

telugu gurinchi matladite yellow slavery antav endi dhed dimag fellow 

Posted
9 hours ago, Kool_SRG said:

 

Bro info that Telugu wasn't there in list of Languages is fake adi chudaledha inka...

 

2 hours ago, perugu_vada said:

Fake foto circulate aindi man , google it chala articles osthay ah faking medha

All news channels circulate chesay e news..  telugu undi ante ok

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...