idibezwada Posted November 7, 2018 Report Posted November 7, 2018 17 minutes ago, CuteDesiGal said: Aa prices endhi 3500/sqft 2lakhs car parking club house 1.75L drainage ki 50/sqft atu thirigi itu thirigi 65-70L chesela unnaru adhi kooda city ki 30km dooram lo industryki kothana aunty....car parking and amenities charge cheydam is petty common in gated communities Quote
snoww Posted November 7, 2018 Report Posted November 7, 2018 హ్యాపీనెస్ట్‌లో ఫ్లాట్ బుకింగ్‌పై ప్రజలకు అవగాహన సీఆర్డీఏ ప్రత్యేక ఏర్పాట్లు పటమట, న్యూస్‌టుడే: హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో ఫ్లాట్‌లు బుకింక్ ఈ నెల 9న ప్రారంభమవుతున్నందున, ఆసక్తి కలవారికి వివరాలను తెలిపేందుకు సీఆర్డీఏ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ సమావేశమందిరంలో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్న రెండు గంటల వరకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా బుకింగ్ చేసుకునే ప్రక్రియపై అవగాహన సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి ఉన్నవారు ఇప్పటికే వెబ్‌సైట్ ద్వారా వివరాలు తెలుసుకుని పలు సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి గంటకు కనీసం వంద మంది వరకు ఈ వివరాలను సీఆర్‌డీఏ అధికారుల నుంచి తెలుసుకోవచ్చని చెప్పారు. 9వ తేదీన సుమారు 20 హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేస్తున్నామని, ప్లాటు బుకింగ్ చేసుకోదలచిన వారు, ఇక్కడి సిబ్బంది సహకారంతో సహకాలంలో పనిపూర్తి చేసుకునే వీలు కల్పించామని వివరించారు. రైతుల ప్లాట్లలో పనులు వేగవంతం చేయాలి పటమట, న్యూస్‌టుడే: అమరావతి రాజధాని రైతులకు ప్లాట్లు కేటాయించిన లేఅవుట్లలో జరుగుతున్న మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మంగళవారం పరిశీలించారు. నెక్కల్లు, అనంతవరం, శాఖమూరు, తుళ్లూరు పరిధిలోని జోన్ వన్, టూ ఎల్పీఎస్ లేఅవుట్లలో భూగర్భ డ్రైనేజీ పైపులైను, మ్యాన్‌హోల్స్ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. పనులు ప్రణాళికాబద్ధంగా చేయాలని బీఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, పీఎంసీ ప్రతినిధులతో సమీక్ష జరిపారు. అనంతరం నేలపాడు పరిధిలో జరుగుతున్న జ్యుడీషియల్ కాంప్లెక్స్ పనులను పరిశీలించారు. సీఆర్డీఏ సీఈలు టి.ఆంజనేయులు, ఎం.జక్రయ్య, ఎస్‌ఈలు ప్రభాకరరావు, సీహెచ్ ధనుంజయ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓపెన్ ఫోరంలో నాలుగు దరఖాస్తులకు అనుమతి పటమట (విజయవాడ), న్యూస్‌టుడే: సీఆర్డీఏ కమిషనర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు అమరావతి రాజధాని గ్రామాల వారికి ప్రత్యేకంగా చేపట్టిన ఓపెన్ ఫోరం కార్యక్రమాన్ని మంగళవారం మందడంలో నిర్వహించినట్లు సీఆర్డీఏ డెవలప్‌మెంట్ ప్రమోషన్ విభాగం డైరెక్టర్ కె.నాగసుందరి తెలిపారు. అన్ని నిబంధనలు పాటించినవారికి దరఖాస్తులు పరిశీలించి అప్పటికప్పుడే ప్రాథమిక అనుమతులు మంజూరు చేస్తున్నామని అన్నారు. ఎక్కువ దరఖాస్తులు వచ్చిన గ్రామంలో ప్రతి మంగళవారం ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. విజయవాడ కార్యాలయంలో ఎప్పటిలాగే ప్రతి శుక్రవారం ఓపెన్ ఫోరం జరుగుతుందని చెప్పారు. జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ టి.నరేంద్రనాథ్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. Quote
watt_a_fruit Posted November 7, 2018 Report Posted November 7, 2018 1 hour ago, CuteDesiGal said: city ki 30km dooram lo epudayinaa VETA ki adaviki vellinapudu rest teeskovachu gaa Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.