ZuniorVentiyar Posted November 9, 2018 Report Posted November 9, 2018 వాషింగ్టన్: హెచ్-4 వీసాల రద్దుపై పునరాలోచించాలనే యోచనలో ఉన్నట్లు అమెరికా వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత హెచ్-4 వీసాలపై కఠిన నిబంధనలను విధించారు. అయితే ట్రంప్ నిర్ణయంపై ఇటు అమెరికాలోని ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో దీనిపై ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్-1బీ వీసాలపై ఇతర దేశాల నుంచి అమెరికా వెళ్లిన నిపుణులకు అత్యంత సన్నిహితులు అంటే భార్య లేదా భర్త, 21 ఏళ్లలోపు పిల్లలకు హెచ్-4 వీసాలు ఇస్తారు. ఇప్పటివరకు ఈ వీసాపై ఉన్న రద్దు పట్ల ప్రజాభిప్రాయాన్ని కోరతామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ(డీహెచ్ఎస్) తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే యూస్ సిటిజెన్షిప్, ఇమ్మిగ్రేషన్ సేవల(యూఎస్సీఐఎస్) విభాగంతో చర్చలు జరిపినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించే యోచనలో ఉన్నట్లు కార్పొరేట్ సంస్థలు, ప్రజాప్రతినిధులకు ఇప్పటికే డీహెచ్ఎస్ లిఖిత పూర్వక లేఖలను రాసి పంపింది. 2019 జనవరిలోపు ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఈ కొత్త ప్రతిపాదన వర్క్ పర్మిట్లు ఉన్న సుమారు 70,000 హెచ్-4 వీసాదారులపై ప్రభావం చూపనుంది. దీనిపై యూఎస్సీఐఎస్ డైరెక్టర్ ఎల్ ఫ్రాన్సిస్ సిస్నా మాట్లాడుతూ.. ‘హెచ్-4 వీసాలపై తమ అభిప్రాయం తెలియజేసేందుకు ప్రజలకు, ఆ వీసాదారులకు అవకాశం కల్పిస్తాం. దీనిపై వారి వ్యాఖ్యలను నిర్భయంగా తెలియజేయవచ్చు. హెచ్-4వీసాలపై ఇలాంటి పరిమితులను విధించినందు వల్ల సుమారు లక్షమంది నైపుణ్యం గల మహిళలు ఉద్యోగం చేసే అవకాశాన్ని కోల్పోయారు. ఇది వారికే కాదు వారి కుటుంబానికి కూడా ప్రతికూల అంశమే. అంతేకాకుండా దీని వల్ల అమెరికా ప్రభుత్వం పట్ల కూడా ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం లేకపోలేదు’ అని తెలిపారు. Quote
Casanova Posted November 9, 2018 Report Posted November 9, 2018 trump lokesh bob ki cheppesadu anamata Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.