snoww Posted November 10, 2018 Report Posted November 10, 2018 వేలి ముద్రతో ఓటరు కార్డు పొందాలి సామాజిక మాధ్యమాల మద్దతంతా ఓట్లుగా మారతాయనేది అపోహే సోషల్ మీడియా సమ్మిట్-2018లో ఖుష్బు వ్యాఖ్యలు కొత్త విషయాల వేదిక: వీవీఎస్ లక్ష్మణ్ ఈనాడు, అమరావతి: రాజకీయ పార్టీలు, నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం ప్రజలతో అనుసంధానమై ఉండటం మంచి పరిణామమేనని అయితే ఆ మాధ్యమాల్లో ఉండే మద్దతంతా వాస్తవ రూపంలో ఓట్లుగా మారతాయనేది వట్టి అపోహేనని ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బు అభిప్రాయపడ్డారు. ఓటరు కార్డులను తీసుకోవడాన్ని మరింత సరళతరం చేయాలని, ఓ సామాన్య దినసరి కూలీ రోజంతా పని మానేసి వెళ్లి తన వివరాలన్నీ నమోదు చేయించుకుని ఓటు కార్డు పొందాల్సి రావడంతో ఎక్కువ మంది తమకెందుకులే అని వదిలేస్తున్నారని పేర్కొన్నారు. అందుకే ఒక్క వేలి ముద్రతో ఓటు కార్డును పొందేలా చేయాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో నకిలీ వార్తలను ప్రచారం చేస్తూ అందరినీ తప్పుదోవ పట్టించడం ఇటీవల బాగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వాటివల్లే తాను ఫేస్‌బుక్ నుంచి బయటకు వచ్చేశానని తెలిపారు. విజయవాడలో శుక్రవారం ప్రారంభమైన సోషల్ మీడియా సమ్మిట్ అండ్ అవార్డ్స్ అమరావతి 2018 కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుతం సామాజిక మాధ్యమం ఎంతో ప్రభావవంతంగా మారిందని భారత జట్టు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఎక్కడెక్కడో ఉన్న వారందరినీ సామాజిక మాధ్యమాలు ఒక్క చోటికి చేరుస్తున్నాయని చెప్పారు. అనేక కొత్త విషయాలను నిత్యం తెలుసుకునేందుకు దోహదం చేస్తున్నాయని తెలిపారు. సమాజంలో మంచిని ప్రోత్సహించేలా సామాజిక మాధ్యమాలు ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. సామాజిక మాధ్యమాల్లో అందరూ బాధ్యతతో వ్యవహరించాలని బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ సూచించారు. సమాజంలో జరిగే ప్రధానమైన సంఘటనలపై తాను అంతర్జాలం కేంద్రంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటానని చెప్పారు. మహిళలపై లైంగిక వేధింపులు అన్నిచోట్లా ఉన్నాయని, దానికి బాలీవుడ్ అతీతం కాదని స్పష్టం చేశారు. శనివారం అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై సోషల్ మీడియా విజేతలకు అవార్డులను అందజేస్తారు. అమరావతి క్రికెట్ కప్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఈనాడు డిజిటల్, అమరావతి: రాజధాని అమరావతిలోని మూలపాడు స్టేడియంలో ఈ నెల 16, 17, 18 తేదీల్లో ఏపీ అక్రిడేటెడ్ పాత్రికేయుల క్రీడలు, సాంస్కృతిక లీగ్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి క్రికెట్ కప్‌ను ఆవిష్కరించారు. ప్రథమ బహుమతి రూ.50 వేలు, ద్వితీయ బహుమతి రూ.30 వేలు, తృతీయ బహుమతి రూ.20 వేలు నగదు, ప్రశంసా పత్రం ఇవ్వనున్నట్లు లీగ్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. 400 మంది ఈ పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. Quote
snoww Posted November 10, 2018 Author Report Posted November 10, 2018 ilanti bakwas programs meeda money antha thagilesi , malli center meeda crying money ivvatle ani. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.