Athadu007 Posted November 10, 2018 Report Posted November 10, 2018 🌷సుఖం -నిర్వచనం🌷 .🌴🌴🌴🌴🌴🌴🌴 జీవితంలో ప్రతి మనిషి సుఖంగా ఉన్నాడా? అసలు సుఖం అంటే? మనసుకు శాంతి అన్నా సుఖం అన్నా ఒక్కటేనా? జీవితంలో డబ్బు ఉంటే సుఖం ఉన్నట్లేనా? డబ్బు ఉన్న ప్రతి ఒక్కరూ మానసిక శాంతి అనుభవిస్తున్నారా? జీవితం ఎంత చిత్రం, విచిత్రం? ఏమి లేనపుడు కడుపుకు ఇంత కూడు చాలు అనిపిస్తూ తరువాత కాస్త గొంగళి, ఇంకాస్త ఉండేదానికి కాస్త గూడు అనీ, ఇంతవరకువచ్చి తృప్తిగా ఉన్నామా? లేదే! ఇంకా, ఇంకా ఎదగాలి! ఎదిగావు! ఇంకా డబ్బు సంపాదించాలి! సంపాదించావు! నా పిల్లలు లగ్జరీగా పెరగాలి! పెరిగారు! పెద్ద భవంతులు కావాలి! కొన్నావు! నా పరపతి పెరగాలి! పెరిగింది! అయినా ఇంకా ఏదో! ఏమిటి ఆ ఏదో? ఏదో తెలియని అసంతృప్తి ! ఎందుకు అంటే, ఏమో? ప్రతి మనిషికి ప్రతి మనసుకు ఎన్ని కధలు మరెన్ని వ్యధలు? ప్రతి కథ మాటున దాగిన కన్నీటి చెలమలు ఎన్నో ఎన్నెన్నో! డబ్బు ఉన్నా ఆరోగ్యం లేక, ఆరోగ్యం ఉన్నా డబ్బులేక, భార్యా భర్తల మధ్య గొడవలు. పిల్లలు మాట వినటంలేదని వేదన. ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఇల్లు, వాకిలి, ఇలా ఎన్నో ఎన్నెన్నో. ఎన్నో కధలు విని, కలత పడిన మనసు ప్రశ్నిస్తుంది. అసలు సుఖంగా ఉన్నవారు ఉన్నారా? సుఖం అంటే ఏమిటి? అవును సుఖం అంటే ఏమిటి? శాంతి అంటే ఏమిటి? శాంతి ఎక్కడ దొరుకుతుంది? మంచైనా, చెడైనా నీకు నచ్చిన విధంగా, నీ మనసు మెచ్చిన విధంగా జరిగిన ఏ విషయమైనా నీకు సంతోషం అనిపిస్తే అదే సుఖం! మంచైనా, చెడైనా నీకు నచ్చని ఏ సంఘటన జరిగినా, అది దుఃఖం అనుకుంటావు. అంటే సుఖం అయినా దుఃఖం అయినా నీ మనసులో కలిగే భావాలే కదా! ఆ భావనకు అతీతంగా స్థిమితంగా జీవించ గలిగితే స్థిత ప్రజ్ఞతే! ఈ స్థితికి మనసును ఎలా తీసుకు వెళ్ళాలి? నేనే ఈ మేను(శరీరం) అనుకున్నంతవరకు హృదయం చీకటేగా? కంటిలో నలుసులా కుదుట పడనీయదు. ఇక్కడ నేను అతిథిని మాత్రమే! అదికూడా నాలుగు రోజుల అతిథిని మాత్రమే! కనుక ఇది నాది కానే కాదు! అనే స్పృహ ఎందరికి ఉంటుంది. పరుగులు తీస్తున్న అరిషడ్వర్గాలను *సత్యం* అనే అంకుశంతో నిత్యం ఒక్కమారు స్పృశిస్తే సత్యం బోధపడుతుంది! సాక్షిగా నీ చూపు నిలబడుతుంది! డబ్బు, సిరులు, సంపదలు శరీరానికి సుఖాన్ని ఇస్తాయి కానీ, మనసుకు శాంతిని, ప్రశాంతతని ఇవ్వలేవు. ఆత్మ మాత్రమే మరణం లేని మీరు, మీరేనని గ్రహించిన క్షణం మాత్రమే సుఖాన్ని, శాంతిని అందుకోగలరు. 🌹🌹సహజ🌹🌹 Quote
TOM_BHAYYA Posted November 10, 2018 Report Posted November 10, 2018 Swathi magazine ki send bro Quote
Thanos Posted November 10, 2018 Report Posted November 10, 2018 matter in 1 line plz antha sadhive oopika no Quote
Paidithalli Posted November 10, 2018 Report Posted November 10, 2018 16 minutes ago, TOM_BHAYYA said: Swathi magazine ki send bro You mean middle pagr Quote
Paidithalli Posted November 10, 2018 Report Posted November 10, 2018 2 minutes ago, Heroin said: Vapan Quote
Heroin Posted November 10, 2018 Report Posted November 10, 2018 Just now, Paidithalli said: Vapan oka pichodu Quote
MuPaGuNa Posted November 10, 2018 Report Posted November 10, 2018 7 minutes ago, Heroin said: oka pichodu nuvvu db lo evarini vadala ledu kada............ Quote
whatsapp Posted November 10, 2018 Report Posted November 10, 2018 7 hours ago, Heroin said: oka pichodu Kadu pichollake pichodu ☺️ Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.