trent Posted November 11, 2018 Report Posted November 11, 2018 పటేల్‌కు తెలుగు చురక! 11-11-2018 00:01:06 గుజరాత్‌లోని నర్మదానదీ తీరంలో నవభారత నిర్మాత సర్దార్ పటేల్ 182 మీటర్ల ఎత్తు విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించడం ముదావహం. ప్రపంచంలోనే అంత ఎత్తయిన విగ్రహం మరొకటి లేదు. అది ప్రపంచంలో (8వ ‘అద్భుతం’ కాగలదనడంలో సందేహం లేదు! అయితే ఆ విగ్రహం కింద వుండే ఫలకంపై అన్ని భాషలు వున్నా, తెలుగు భాష లేదన్న విషయమై వాదోపవాదాలు జరుగుతున్నాయి. తెలుగు భాష లేకపోవడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా తన అసమ్మతిని వ్యక్తం చేశారు. నిజానికి, ‘దేశ భాషలలో తెలుగు లెస్స’ మాత్రమే కాదు – హిందీ తరువాత రెండవ పెద్ద భాష కూడా. తెలుగును ‘మూడవ పెద్ద భాష’ అంటున్నారు కాని, అది సరికాదు. బెంగాల్‌ను తూర్పు బెంగాల్, పశ్చిమ బెంగాల్‌గా దేశ విభజన సమయంలో చీల్చక పూర్వం హిందీ, బెంగాలీ, తెలుగు భాషలు వరుసగా ఒకటి, రెండు, మూడవ స్థానాలలో వుండేవి. ఇప్పుడు తూర్పు బెంగాల్ కూడా ‘బంగ్లాదేశ్’గా వేరే దేశమై పోయింది. అందువల్ల, తెలుగు భాషకు హిందీ తరువాత రెండవ స్థానం లభించింది. భారతదేశంలో తెలుగు భాష ప్రాముఖ్యం ఒకసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనే తెలిసింది. అది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగుతున్న సన్నివేశం. ఆంధ్రప్రముఖుడు, మహా మేధావి. ఆ తరువాత అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షుడైన (1948) డాక్టర్ పట్టాభి సీతారామయ్య ఆ సమావేశంలో పాల్గొన్నారు. మహాత్మాగాంధి, పండిట్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా ఆజాద్ వంటి హేమా హేమీలందరూ వున్నారు. డాక్టర్ పట్టాభి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్ర నిర్మాణాన్ని గురించి ప్రస్తావించగా, ‘ఉక్కు మనిషి’ సర్దార్ పటేల్ లేచి, ‘పట్టాభీ! ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం అంటావు! మీ ఆంధ్ర రాష్ట్రం దేశంలో ఎక్కడున్నదయ్యా! మీరు మద్రాసులో వున్నారు. మీరు మద్రాసీలు కదా!’ అంటూ కొంచెం వెటకారంగానే ప్రశ్నించారు! డాక్టర్ పట్టాభి సామాన్యుడా! ఆయన వెంటనే లేచి, అప్పుడు వాడుకలో వున్న ‘అణా’ నాణెమును తన జేబులో నుంచి తీసి చూపిస్తూ పటేల్‌గారూ, మా తెలుగు భాష స్థానాన్ని బ్రిటిష్ ప్రభుత్వమే గుర్తించింది! ఇదుగో! ఈ అణా కాసును చూడండి. దీనిపై జాతీయ భాష అయిన హిందీలో ‘ఏక్ అణా’ అని, అధికార భాష అయిన ఇంగ్లీషులో ‘వన్ అణా’ అని, తరువాత మా తెలుగు భాషలో ‘ఒక అణా’ అని రాసివుంది. మరి, మీ గుజరాతీ భాష కాని, మీరు చెప్పిన మద్రాసీల తమిళ భాష కాని లేవే?’ అని వెటకారంగానే అన్నారు. సమావేశంలోనే వున్న మహాత్మాగాంధి చిరునవ్వు నవ్వారు. ఆయన మాతృ భాష కూడా గుజరాతీ కదా! సర్దార్ పటేల్ కూడా నిరుత్తరుడై, ఔనన్నట్లు తల వూపారు. తక్కిన కాంగ్రెసు వర్కింగ్ కమిటీ సభ్యులెవ్వరూ మాట్లాడలేదు. ఔను, మరి! అణాకాసు పై వున్న సాక్ష్యాధారాలతో తెలుగు భాష ఘనతను ప్రపంచానికి తెలియజెప్పినప్పుడు ఎవరైనా ఏమి మాట్లాడ గలరు? అది బ్రిటిష్ ప్రభుత్వం ముద్రించిన అణా నాణెం కదా అంతే కాదు – ఇటాలియన్, భాషావేత్త నికోలయ్ కోంటి 1420లో భారత దేశ సందర్శనకు వచ్చి, దేశంలోని ప్రధాన భాషలన్నింటిని పరిశీలించి, అజంతమైన, తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ గా అభివర్ణించారు. ప్రసిద్ధ తమిళ కవీంద్రుడు సుబ్రహ్మణ్య భారతి ‘సుందర తెలుంగు’ అని ప్రస్తుతించారు. దేశానికే తెలుగు అధికార భాష కావాలి. ఇక ప్రసిద్ధ బ్రిటిష్ శాస్త్రవేత్త జె.బి.ఎన్. హాల్టేన్ తెలుగు భాష భారతదేశంలోని భాషలన్నింటికంటే దేశానికే అధికార భాష కాదగినదని పేర్కొన్నారు. కాగా, 2012 అక్టోబర్‌లో థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో జరిగిన ప్రపంచ భాషాలిపుల నిపుణుల మహా సభలో తెలుగు లిపికి రెండవ ఉత్తమ లిపి స్థానం లభించగా, కొరియన్ లిపికి ప్రథమ స్థానం లభించింది. అయితే, ఆ భాష రెండు కొరియా దేశాలకే పరిమితం. తెలుగువారు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలలో వున్నారు. ఇంత ఘనమైన తెలుగు భాష ప్రశస్తి, ప్రసక్తి ఆ ప్రపంచంలోనే అపురూపమైన విగ్రహ ఫలకంపై అన్ని భాషలతో పాటే లేకపోతే అలా వచ్చిన వార్త యధార్థమైతే, సర్దార్ పటేల్ ఆత్మ సంతోషించదు! పట్టాభి – అణా కాసు కథ చరిత్రాత్మకమైనది. అది సర్దార్ పటేల్ సమక్షంలో జరిగిన యధార్థ గాధ! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.