snoww Posted November 18, 2018 Report Posted November 18, 2018 ఆహ్లాదంగా ఆనంద ఆదివారం విజయవాడ నగరపాలకసంస్థ, న్యూస్టుడే: పెద్దలు, పిన్నల కేరింతలు, విద్యార్థుల నృత్యాలతో ఆనంద ఆదివారం అత్యంత ఆహ్లాదంగా సాగింది. విజయవాడ నగరపాలక సంస్థ, సన్షైన్ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన ఆనంద ఆదివారం 9 గంటల వరకు అత్యంత జోరుగా హుషారుగా సాగింది. నగరంలోని వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, కళాకారులు, యువత వారి ప్రతిభ పాటవాలను రంగరించి ప్రదర్శించారు. వివిధ సినీ, దేశభక్తి, జానపద గీతాలకు ప్రతిగా సాగిన నృత్యాలు అందర్నీ ఆకట్టుకున్నాయి. భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో జానపద కళా రూపాల గీతాలను ఆకట్టుకున్నాయి. సన్షైన్ ఈవెంట్్్స ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక నృత్యాలు ఉర్రూతలూగించాయి. మరోవైపు కార్యక్రమం వేదికగా వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, త్రోబాల్, ఇతర క్రీడలు ఆకర్షించాయి. స్పోర్ట్సు అధికారి శేఖర్, పలు పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం, నగరవాసులు పాల్గొన్నారు. Quote
snoww Posted November 18, 2018 Author Report Posted November 18, 2018 Quote సన్షైన్ ఈవెంట్్్స ఆధ్వర్యంలో 'mana' valla de naa company. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.