snoww Posted November 23, 2018 Report Posted November 23, 2018 అమరావతి విహంగ వీక్షణం 250 మీటర్ల ఎత్తున శాసనసభ టవర్‌పై ప్రత్యేక గ్యాలరీ అసెంబ్లీ, సచివాలయ బాహ్య ఆకృతులు దాదాపు ఖరారు బోర్లించిన లిల్లీ ఫ్లవర్ నమూనాలో అసెంబ్లీ పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ నెల 30న టెండర్లు ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని పరిపాలన నగరంలో నిర్మించే శాసనసభ, సచివాలయ భవనాల బాహ్య ఆకృతుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం దాదాపు ఖరారు చేశారు. లండన్‌కు చెందిన నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ శాసనసభ, సచివాలయ భవనాలకు సంబంధించి మూడేసి బాహ్య ఆకృతుల్ని సిద్ధం చేసి తీసుకొచ్చింది. వాటిని ముఖ్యమంత్రి సచివాలయంలోని తన కార్యాలయంలో క్షుణ్నంగా పరిశీలించారు. శాసనసభకు...మూడంతస్తుల భవనంపై పొడవైన టవర్‌తో ఉన్న ఆకృతిని ఇది వరకే ఖరారు చేశారు. దాని బాహ్య స్వరూపానికి సంబంధించి ఇది వరకు ఇచ్చిన ఆకృతుల్లో కొన్ని మార్పులు చేసి... మూడు తాజా ఆకృతుల్ని నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇప్పుడు తీసుకొచ్చింది. శాసనసభ భవనం ఆకృతిని బోర్లించిన ‘లిల్లీ ఫ్లవర్’ని పోలిన విధంగా రూపొందించింది. శాసనసభ పైనుంచి రాజధానిని వీక్షించేలా గ్యాలరీలు ఏర్పాటు చేసింది. అసెంబ్లీ భవనం ఎత్తు 250 మీటర్లు, పొడవు 200 మీటర్లు, వెడల్పు 200 మీటర్లు ఉంటుంది. సాధారణ సందర్శకుల్నీ ఈ భవనంలోకి అనుమతిస్తారు. ఈ భవనం మధ్యలోంచి టవర్‌పైకి వెళ్లేందుకు లిఫ్ట్‌లు ఉంటాయి. ఇది వరకు ఇచ్చిన ఆకృతిలో టవర్‌లో 80 మీటర్ల ఎత్తు నుంచి మొత్తం రాజధాని నగరాన్ని వీక్షించేందుకు వీలుగా ఒక ‘వ్యూయింగ్ గ్యాలరీ’ని ఏర్పాటు చేశారు. తాజా ఆకృతిలో మొత్తం రెండు ‘వ్యూయింగ్ గ్యాలరీలు’ ప్రతిపాదించారు. 80 మీటర్ల ఎత్తులో ఒకటి గ్యాలరీ, 250 మీటర్ల ఎత్తులో చివర్న మరో గ్యాలరీ ఉంటాయి. 80 మీటర్ల ఎత్తు గ్యాలరీ నుంచి ఒకేసారి 300 మంది, 250 మీటర్ల ఎత్తున్న గ్యాలరీ నుంచి ఒకేసారి 25 మంది రాజధానిని వీక్షించే వీలుంటుంది. శాసనసభ భవనంలో పార్లమెంటు భవనంలో మాదిరిగా ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ హాల్ ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, సందర్శకులకు ఆహ్లాదాన్ని పంచేలా ఉండాలని సీఎం సూచించారు. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు ఆ ప్రాంతం ఒక వారధిలానిలవాలన్నారు. హైకోర్టు భవనం బాహ్య ఆకృతిని ఇది వరకే ఖరారు చేయగా, మరికొంత మెరుగులు దిద్దిన ఆకృతిని నార్మన్ ఫోస్టర్ బృందం తీసుకొచ్చింది. దానిపై సీఎం సంతృప్తి వ్యక్తంచేశారు. హెలిప్యాడ్ అవసరమే! పరిపాలన నగరంలో శాసనసభ, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని ఐదు టవర్లుగా నిర్మిస్తున్నారు. వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనంలో 50 అంతస్తులు, మిగతా నాలుగు భవనాల్లో 40 అంతస్తులు చొప్పున ఉంటాయి. ఈ భవనాల్ని దేశంలోనే తొలిసారిగా ‘డయాగ్రిడ్’ విధానంలో నిర్మిస్తున్నారు. ఈ భవనాల బాహ్య స్వరూపానికి సంబంధించి మూడు ఆకృతుల్ని నార్మన్ ఫోస్టర్ సంస్థ రూపొందించింది. వాటిలో ఏ ఆకృతి బాగుందన్నదానిపై సమావేశానికి హాజరైన వారందరి అభిప్రాయాల్ని ముఖ్యమంత్రి తెలుసుకున్నారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ మొదట్లో ఇచ్చిన ‘డైమండ్’ నమూనా ఫ్రేమ్‌తో ఉన్న ఆకృతి ఇప్పటికే ప్రజల్లోకి బలంగా వెళ్లిందని, దాన్నే ఖరారు చేద్దామని ఎక్కువ మంది చెప్పడంతో ముఖ్యమంత్రి సరేనన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయ భవనం ఉన్న టవర్‌పై నార్మన్ ఫోస్టర్ సంస్థ హెలిప్యాడ్‌ను ప్రతిపాదించింది. హెలిప్యాడ్ ఉండాలా? లేదా? అన్న విషయంలో చర్చ జరిగింది. భవనంపైన హెలిప్యాడ్ ఉండటాన్ని విలాసంగా భావించే అవకాశముందున్న అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. కానీ ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఎత్తైన భవనంపై హెలిప్యాడ్ ఉండటం అవసరమే తప్ప, విలాసం కాదని అధికారులు వివరించడంతో ముఖ్యమంత్రి సరేనన్నారు. ప్రజల కోసం ప్రత్యేక జోన్! శాసనసభలోకి సందర్శకులను అనుమతిస్తున్నట్టే... సచివాలయం ప్రాంగణంలోకి సాధారణ ప్రజల్ని అనుమతించాలా? లేదా? అన్న విషయంలో చాలా చర్చ జరిగింది. ప్రభుత్వ భవనాల్ని కేవలం అధికార యంత్రాంగానికే పరిమితం చేయకుండా, సాధారణ ప్రజలు సందర్శించేందుకూ వీలుగా ఉండాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజల్ని అనుమతించకపోతే ఆ ప్రాంగణమంతా సాయంత్రానికి నిర్మానుష్యంగా మారిపోతుందన్నారు. ఎలాగూ పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపడతాం కాబట్టి... సాధారణ ప్రజల్ని అనుమతిస్తేనే బాగుంటుందన్నారు. దుబాయిలో వాణిజ్య భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలూ ఉంటాయని గుర్తుచేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోకి ప్రజల్ని స్వేచ్ఛగా అనుమతించడం వల్ల గోప్యత పరంగా, ఇతరత్రా సమస్యలు కూడా వస్తాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దీనిపై చాలా చర్చ జరిగిన మీదట... ఐదు సచివాలయ టవర్లకు పక్కనే, ఉత్తరంవైపు ఉన్న స్థలాన్ని ప్రజల కోసం ప్రత్యేక వాణిజ్య, వినోద ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. అక్కడ మల్టీప్లెక్స్, షాపింగ్‌మాల్, రెస్టారెంట్లు, వినోద కేంద్రాలు, స్పోర్ట్స్ సెంటర్ వంటివి నిర్మించాలని సీఎం సూచించారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్ తరహాలో ఒక భవనాన్ని నిర్మించాలని తెలిపారు. శాసనసభ భవనంలో మొత్తం నిర్మిత ప్రాంతం 12.4 లక్షల చదరపు అడుగులు ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ విలేఖరుల సమావేశంలో తెలిపారు. తాజా ఆకృతిపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారని, వచ్చే సమావేశం నాటికి ఇంకా కొంత మెరుగుపరిచి తీసుకురమ్మని సూచించారని ఆయన వెల్లడించారు. శాసనసభ భవనం తొలి దశ పనులకు ఈ నెల 30 టెండర్లు పిలుస్తామన్నారు. Quote
Undavalli Posted November 23, 2018 Report Posted November 23, 2018 భ్రమరావతి పూర్తయిందని నమ్మించగల సమర్థుడు మన చంద్రబాబునాయుడుగారు. కావాలంటే కొట్టి చుడండి యూట్యూబుల్లో వాట్లో సరదాగా భలే వుంటుంది గ్రాఫిక్స్ మాయ .. ఏది మన రాజమౌళి బాహుబలి తీసినట్టు తీసి పెట్టారలాగా యూట్యూబుల్లో ఆన్లైన్లోని Quote
snoww Posted November 23, 2018 Author Report Posted November 23, 2018 current sachivalayam em chestharu future lo. elagu free gaa water coming kada building lopatiki. future lo F1 waster race lu andulo plan cheyyadi. PPT kooda chesukovachu. First time in the history , F1 water race indoors. Quote
Undavalli Posted November 23, 2018 Report Posted November 23, 2018 Just now, snoww said: current sachivalayam em chestharu future lo. elagu free gaa water coming kada building lopatiki. future lo F1 waster race lu andulo plan cheyyadi. PPT kooda chesukovachu. First time in the history , F1 water race indoors. చూపిస్తాడు! ఏ అందులో అనుమానమేముంది? భ్రమరావతి అనే సినిమా బాహుబలిని తలదన్నేదిలా ఉంటుంది Quote
snoww Posted November 23, 2018 Author Report Posted November 23, 2018 19 hours ago, Undavalli said: చూపిస్తాడు! ఏ అందులో అనుమానమేముంది? భ్రమరావతి అనే సినిమా బాహుబలిని తలదన్నేదిలా ఉంటుంది Quote
snoww Posted November 23, 2018 Author Report Posted November 23, 2018 CBN emo helipads kattukovachu public money tho. but Gujarat lo patel statue matram non public money tho kadithe crying Gujarat ki icharu , #Maggavaale Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.