Jump to content

ED raids offices, companies of TDP MP Sujana Chowdary - HMTv


Recommended Posts

Posted

Jagan gadi ED cases some 1300 crores anukunta...

Sujana uncle oka adugu mundu esi 5700 croes varaku vellindu

AP is agragami ante endo anukuna..bagane development aitundi. 

  • Replies 30
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    12

  • timmy

    3

  • Android_Halwa

    2

  • cosmopolitan

    2

Top Posters In This Topic

Posted
4 minutes ago, Android_Halwa said:

TG Elections aipogane inni round estaru IT department and ED. 

Apati varaku CBN noru musukuni vunte okay...or narukutha peekutha ante isari sendranna intike kannam pedutaru...sendranna illu vunnadi hyderabad la...I have fower...I have folice...I have ACB ante vanga petti mari tantaru

CBN overnight Hyderabad nundi ela paaripoyado , alane ee pilla congress business people andariki ade gathi pattali. 

Andhra pradesh aathma gouravam ani sollu, choosthe malli business lu , home lu , family lu anni Hyderabad lo. 

Posted

120 డొల్ల కంపెనీల ద్వారా బ్యాంకులకు కుచ్చుటోపీ 

మనీల్యాండరింగ్‌ను ధ్రువీకరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌

ఒకే అడ్రస్‌పై పేపర్‌ కంపెనీల ఏర్పాటు, డమ్మీ డైరెక్టర్ల నియామకం

ఈడీ సోదాల్లో వెలుగులోకి భారీ ఆర్థిక నేరాలు.. హైదరాబాద్, ఢిల్లీలో 8 చోట్ల దాడులు

పలు హార్డ్‌డిస్క్‌లు, 6 లగ్జరీ కార్లు, 126 రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం

సుజనా చౌదరిదే కుట్ర అంటూ ఈడీ అధికారులకు వాంగ్మూలం ఇచ్చిన డైరెక్టర్లు

27న విచారణకు హాజరవ్వాలని సుజనాకు ఈడీ సమన్లు.. టీడీపీ పెద్దల్లో కలవరం!  

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు, ఆయన బినామీగా భావించే ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి సాగించిన భారీ ఆర్థిక నేరాల ‘సృజన’బట్టబయలైంది. పుట్టగొడుగుల్లా 120 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేసి వాటి పేరిట ఏకంగా రూ. 6 వేల కోట్ల మేర బ్యాంకు రుణాలు పొంది ఎగ్గొట్టిన ఉదంతం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) దాడుల్లో వెలుగులోకి వచ్చింది. తన దగ్గర పనిచేస్తున్న ఉద్యోగులనే కంపెనీల డైరెక్టర్లుగా నియమించి బ్యాంకులను బురిడీ కొట్టించిన వైనం బయటపడింది. బ్యాంకులకు రూ. వందల కోట్లు ఎగ్గొట్టిన సుజనా గ్రూపులోని ఓ కంపెనీ లావాదేవీల్లో ఫెమా చట్ట ఉల్లంఘనలు జరిగాయన్న సీబీఐ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఈడీ... శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం వరకు హైదరాబాద్‌తోపాటు ఢిల్లీలో చేసిన సోదాల్లో సుజనా అక్రమాల పుట్ట బద్దలైంది.

ఒకే చిరునామాపై షెల్‌ కంపెనీలు... 
హైదరాబాద్‌ పంజాగుట్ట నాగార్జున సర్కిల్‌లోని సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయం అడ్రస్‌తో ఉన్న బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజనీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌)లో ఈడీ సోదాలు ప్రారంభించింది. బీసీఈపీఎల్‌ మూడు బ్యాంకుల నుంచి రూ. 364 కోట్లు రుణాలుగా పొంది ఎగవేసింది. దీంతో రుణాలు జారీ చేసిన బ్యాంకులు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కి ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఇందుకు సంబంధించి మూడు కేసులు నమోదు చేసింది. ఈ కంపెనీల్లో జరిగిన లావాదేవీల్లో ఫెమా చట్ట ఉల్లంఘన జరిగిందంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌కు సీబీఐ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఈడీ చెన్నై బృందం హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించింది. బీసీఈపీఎల్‌ కంపెనీ చేసిన నేరంపై దర్యాప్తు చేస్తుండగా సుజనా చౌదరి సాగించిన భారీ ఆర్థిక నేరాల కుట్ర బయటపడింది. సుజనా చౌదరి చైర్మన్‌గా ఉన్న సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల గొడుగు కింద ఏర్పాటు చేసిన 120 షెల్‌ òకంపెనీల జాబితా ఈడీ అధికారుల చేతికి చిక్కింది. ఈ కంపెనీలన్నీ పంజాగుట్టలోని ఒకే చిరునామాపై ఏర్పాటు చేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. అంతే కాకుండా ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారికి ఈ కంపెనీలు సాగించిన లావాదేవీల విషయాలు ఏవీ తెలియకపోవడంతో ఈడీ మరింత లోతుగా సోదాలు చేపట్టింది. 
sujan_house.jpgసుజనా చౌదరి ఇల్లు

అన్నీ సుజనా చెప్పినట్లే... 
సుజనా చౌదరి 120 షెల్‌ కంపెనీల పేరుతో రూ. 6 వేల కోట్ల రుణం తీసుకొని ఎగ్గొట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గుర్తించింది. ఈ కంపెనీల్లో సాగించిన ఆర్థిక నేరాలకు, కుట్రకు దారి తీసిన అంశాలన్నీ ఆయా కంపెనీల ఈ–మెయిల్స్‌లో లభించాయి. డైరెక్టర్లకు, సుజనా చౌదరికి మధ్య జరిగిన కీలక వివరాలు ఈ–మెయిల్స్‌లో లభ్యమయ్యాయి. వాటికి సంబంధించిన హార్డ్‌డిస్క్‌లను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కంపెనీల్లో డైరెక్టర్లుగా ఉన్న వారిని ఈడీ శనివారం విచారించగా సుజనా చౌదరి చెప్పినట్లే తాము వ్యవహరించామని, కంపెనీల్లో ఏం జరుగుతుందో కూడా తమకు తెలియదని, ఈ మొత్తం వ్యవహారం సుజనా కనుసన్నల్లోనే జరిగినట్లు వాంగ్మూలాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీల్లో సుజనా చౌదరే దగ్గరుండి వ్యవహారాలు చక్కబెట్టారని, ఆయన చెప్పిన చొట, చెప్పిన సమయంలో సంతకాలు మాత్రం డైరెక్టర్లు పెట్టినట్టు ఈడీ గుర్తించింది. బీసీఈపీఎల్‌ సంస్థకు వచ్చిన రుణాలు ఎక్కడి నుంచి ఎక్కడి పోతున్నాయో కూడా తమకు తెలియదని డైరెక్టర్లు వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. ఈ మొత్తం కుట్ర, ఆర్థిక నేరానికి కీలక నిందితుడిగా సుజనా చౌదరియేనని పూర్తిస్థాయిలో ధ్రువీకరించుకున్నట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు.  

 

ఫెమా చట్టాల ఉల్లంఘన... 
సుజనా చౌదరి సాగించిన ఈ నేరాలన్నీ ఫెమా చట్టం ఉల్లంఘన కిందకు వస్తాయని, ఇందులో ఈడీతోపాటు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ), సీబీఐ కూడా విచారణ సాగించేందుకు అవకాశం ఉన్నట్లు దర్యాప్తు అధికారుల ద్వారా తెలిసింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి హైదరాబాద్‌లో ఏడు చోట్ల, ఢిల్లీలో ఒక చోట ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 126 రబ్బర్‌ స్టాంపులు, షెల్‌ కంపెనీల పేర్ల మీద కొనుగోలు చేసిన ఆరు లగ్జరీ కార్ల (ఆడీ, ఫెరారీ, బెంజ్‌ రేంజ్‌ రోవర్‌ మొదలైనవి)ను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు స్పష్టంచేశారు. అదే విధంగా ఈ కంపెనీల ద్వారా ఫొరెక్స్‌ లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సైతం స్వాధీనం చేసుకున్నారు.  

27న విచారణకు రావాలంటూ సుజనాకు సమన్లు... 
పుట్టలకొద్దీ షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి రూ. వేల కోట్లు కొల్లగొట్టిన టీడీపీ రాజ్యసభ ఎంపీ సుజనా చౌదరికి ఉచ్చు మరింత బిగుసుకోనుందని స్పష్టమవుతోంది. ఇన్ని కంపెనీలు, రుణ ఎగవేతలు, ఫెమా చట్టాల ఉల్లంఘనలకు పాల్పడ్డ ఆయన్ను లోతుగా విచారించేందుకు ఈడీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ నెల 27న చెన్నైలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని సమన్లు జారీ చేసింది. ఈ పరిణామం టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ పెద్దలను షాక్‌కు గురిచేసినట్లు తెలుస్తోంది. ఈడీ విచారణలో తమకు సంబంధించిన వివరాలేమైనా బయటకు వచ్చాయేమోనని వారు కంగారు పడ్డట్లు తెలిసింది. 

వ్యాపార నియమాలకు లోబడే..: సుజనా గ్రూప్‌ 
పదేళ్ల క్రితం నాటి కేసు విషయంలో ఈడీ అధికారులు సమాచారం కోరేందుకు తమ కార్యాలయానికి వచ్చారని, వారికి కావాల్సిన సమాచారాన్ని ఇచ్చామని సుజనా గ్రూప్‌ శనివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. వ్యాపార నియమాలకు లోబడే తాము వ్యాపారం చేస్తున్నామని, కొంత మంది కావాలనే దురుద్దేశపూరితంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. తమ డైరెక్టర్లపై లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. 
sujana_office.jpgసుజనా ఆఫీసు 

Posted
సుజనాకు ఈడీ తాఖీదు 
బ్యాంకులను రూ.5700 కోట్లకు మోసగించారు 
ఆ గ్రూప్‌నకు 120కి పైగా డొల్ల కంపెనీలు 
అత్యధికం సుజనాచౌదరి నియంత్రణలోనే.. 
27న వ్యక్తిగతంగా హాజరుకావాలని సమన్లు 
ప్రకటనలో వెల్లడించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ 
8 ప్రాంగణాల్లో సోదాలు.. 
విలువైన పత్రాలు, ఖరీదైన 6 కార్లు స్వాధీనం 
బ్యాంకుల కన్సార్షియం ఫిర్యాదు, సీబీఐ కేసు నేపథ్యంలో దర్యాప్తు చేపట్టినట్లు స్పష్టీకరణ 
ఈనాడు - దిల్లీ 
24ap-main1a.jpg

సుజనా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలు బ్యాంకులను రూ.5,700 కోట్ల మేర మోసం చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) పేర్కొంది. బ్యాంకుల ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదులో భాగంగానే ఆ సంస్థకు చెందిన ఎనిమిది ప్రాంగణాల్లో శుక్రవారం సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. తదుపరి విచారణ కోసం ఈ నెల 27న వ్యక్తిగతంగా హాజరుకావాలని కేంద్ర మాజీ మంత్రి, తెదేపా రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి సమన్లు జారీ చేసినట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం ఈడీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. చెన్నైకి చెందిన బెస్ట్‌ అండ్‌ క్రాంప్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ (బీసీఈపీఎల్‌) తప్పుడు ఖాతాలు, స్టేట్‌మెంట్ల ఆధారంగా రుణాలు పొందిందని, తద్వారా తాము రూ.363కోట్లకు పైగా మోసపోయామని మూడు బ్యాంకుల సహవ్యవస్థ (కన్సార్షియం) ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు సీబీఐ, బీఎస్‌ అండ్‌ ఎఫ్‌సీ (బ్యాంకింగ్‌ సెక్యూరిటీస్‌ అండ్‌ ఫ్రాడ్‌ సెల్‌)లు కేసులు నమోదు చేశాయని ఈడీ పేర్కొంది. సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (రూ.133 కోట్లు), ఆంధ్రా బ్యాంకు (రూ.71 కోట్లు), కార్పొరేషన్‌ బ్యాంకు (రూ.159 కోట్లు)లు సహవ్యవస్థగా ఏర్పడి ఈ రుణాలు ఇచ్చాయి. 
సీబీఐ, బీఎస్‌ అండ్‌ ఎఫ్‌సీ కేసుల ఆధారంగా ఈడీ చెన్నై విభాగం అక్రమ నగదు చెలామణి నిరోధక చట్టô కింద దర్యాప్తు ప్రారంభించిందని, దీనిలో భాగంగా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లలోని బీసీఈపీఎల్‌కు చెందిన అధికారుల ఇళ్లలో అక్టోబరు 8వ తేదీన సోదాలు నిర్వహించినట్లు ఈడీ వివరించింది. సోదాల్లో కొన్ని కీలకమైన దస్త్రాలు, దస్తావేజులు స్వాధీనం చేసుకొని దర్యాప్తు కొనసాగించినట్లు తెలిపింది.

‘సుజనా చౌదరి నిర్దేశంలోనే’ 
‘‘హైదరాబాద్‌లోని నాగార్జున  హిల్స్‌ ప్లాట్‌ నంబర్‌.18లోని వాణిజ్య ప్రాంగణం నుంచి వివిధ డొల్ల (షెల్‌) కంపెనీలకు సంబంధించిన 126 రబ్బర్‌ స్టాంపులు స్వాధీనం చేసుకున్నాం. ఆ ప్రాంగణంలో సుజనా గ్రూప్‌నకు చెందిన చాలా కంపెనీలు ఉన్నట్లు గుర్తించాం. మాకు లభించిన దస్తావేజులు, రికార్డులను పరిశీలించగా బీసీఈపీఎల్‌తో పాటు, సుజనా గ్రూప్‌లోని చాలా కంపెనీలు సుజనాచౌదరి ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు గుర్తించాం. సుజనా గ్రూప్‌లోని అన్ని సంస్థలకు చెందిన డైరెక్టర్లు సుజనాచౌదరి నిర్దేశాల మేరకు నడుచుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. అందుకు సంబంధించిన ఈమెయిల్స్‌, ఇతర సమాచారాన్ని బీసీఈపీఎల్‌ డైరెక్టర్స్‌ నివాస, వాణిజ్య సముదాయాల నుంచి స్వాధీనం చేసుకున్నాం. సుజనాగ్రూప్‌నకు చెందిన మొత్తం వ్యవహారాలకు సుజనాచౌదరి ఒక్కరే వ్యక్తిగత బాధ్యుడని చెబుతూ ఆయా సంస్థల డైరెక్టర్లు పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 50 కింద స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చారు. సుజనాచౌదరి నేరుగా లేదా ఆయనకు గ్రూప్‌నకు చెందిన సీఎఫ్‌ఓ(చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌), సీఎస్‌ (కంపెనీ సెక్రెటరీ)ల ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు సంతకాలు చేసే వారమన్నారు. తాము పేరుకు మాత్రమే డైరెక్టర్లమని, బీసీఈపీఎల్‌ నిధులను ఎలా ఉపయోగించారన్నది తమకు ఏమాత్రం తెలియదని చెప్పారు. సుజనా గ్రూప్‌నకు సంబంధించిన మొత్తం లావాదేవీలు ఆ ముగ్గురికి మాత్రమే తెలుసని వారు పేర్కొన్నారు’’ అని ఈడీ తెలిపింది.

24ap-main1b.jpg

హైదరాబాద్‌లో 7, దిల్లీలో ఒక చోట సోదాలు 
‘‘విచారణలో వెలుగులోకి వచ్చిన విషయాల ఆధారంగా ఈ నెల 23న సుజనా గ్రూప్‌ కంపెనీలకు చెందిన 8 ప్రాంగణాల్లో (హైదరాబాద్‌లో 7, దిల్లీ 1)  సోదాలు నిర్వహించాం. ఈ గ్రూప్‌ కంపెనీలు బ్యాంకులను రూ.5,700 కోట్లకు పైగా మోసం చేసినట్లు గుర్తించాం. స్వాధీనం చేసుకున్న వివిధ దస్తావేజులను బట్టి చూస్తే ఈ కంపెనీలపై ఫెమా, డీఆర్‌ఐ, సీబీఐ కేసులు ఉన్నట్లు తేలింది. ఇదే సందర్భంగా ఫారెక్స్‌ లావాదేవీలకు సంబంధించిన దస్తావేజులను స్వాధీనం చేసుకున్నాం. ఆ దస్తావేజుల ఆధారంగా వీరికి 120 సంస్థలపై నియంత్రణ ఉన్నట్లు తేలింది. అందులో చాలా కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలులేని, కాగితం(పేపర్‌) కంపెనీలే. వేటికీ నిజమైన వ్యాపార లావాదేవీలు లేవు. వైఎస్‌చౌదరి వ్యక్తిగత పూచీతో ఈ గ్రూప్‌ కంపెనీలకు రుణాలు మంజూరయినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. చౌదరి నివాస ప్రాంగణంలో 6 ఖరీదైన కార్లు (ఫెరారీ, రేంజ్‌రోవర్‌, బెంజ్‌లాంటివి) కనిపించాయి. అవన్నీ డొల్ల కంపెనీల పేర్లతో రిజిష్టర్‌ అయి ఉన్నాయి. పీఎంఎల్‌ఏ చట్టం కింద ఆ వాహనాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నాం. ఈనెల 27వ తేదీన విచారణ నిమిత్తం వ్యక్తిగతంగా హాజరుకావాలని వైఎస్‌చౌదరికి అధికారులు సమన్లు జారీచేశారు’’ అని పత్రికా ప్రకటనలో ఈడీ స్పష్టం చేసింది. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొంది. 


కేంద్రం ఆనాడే చర్య తీసుకుంటే భారీ మోసాలు జరిగేవి కాదు: వైకాపా

ఈనాడు, అమరావతి: సుజనాచౌదరిపై కేంద్రం లోగడే చర్య తీసుకుని ఉంటే బ్యాంకులనుంచి రూ.వేల కోట్ల రుణాలు తీసుకుని మోసానికి పాల్పడే పరిస్థితి వచ్చేదికాదని వైకాపా పేర్కొంది. ‘సుజనాచౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతిలో ఒక సాధనం. బినామీ మాత్రమే. అసలు లబ్ధిదారు చంద్రబాబే’ అని ఆరోపించింది. ‘సుజనాచౌదరి కంపెనీల మీద ఈడీ దాడుల్లో వెలుగుచూసిన అంశాలను వైకాపా నిశితంగా గమనిస్తోంది’ అంటూ ఆ పార్టీ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. సుజనాచౌదరికి ఆస్తుల్లేకపోయినా వాటినే మళ్లీ మళ్లీ చూపుతూ అప్పులు తీసుకుంటున్న విషయం బ్యాంకులకు, మార్కెట్‌లో అందరికీ తెలిసినా.. చంద్రబాబు ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్‌ చేయబట్టే ఇన్నాళ్లూ విచారణ జరగలేదని వివరించింది. ఎప్పుడో బయటపడాల్సిన మోసాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొంది. ‘2017 మార్చి31 నాటికే మోసాలు(అప్పులు) రూ.7,346 కోట్లకు చేరాయని, ఇప్పుడవి దాదాపు రూ.9,500 కోట్లకు చేరాయని ప్రసార మాధ్యమాల్లో వార్తలనుబట్టి అర్ధమవుతోంది. ఈ డబ్బంతా ఎటుపోయిందన్న ప్రశ్నకు సమాధానం కూడా అందరికీ తెలిసిందే’ అని ఆ ప్రకటనలో వైకాపా పేర్కొంది.


ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు కుట్ర: సుజనా గ్రూపు

ఈనాడు, హైదరాబాద్‌: సుజనా గ్రూపు ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, వ్యాపార నియమాలకు లోబడి జరిగిన పరిణామాలకు ఇతర దురుద్దేశపూరిత సమాచారాన్ని జోడించి అసత్య ప్రచారం చేస్తున్నారని సుజనా గ్రూపు ఒక ప్రకటనలో తెలిపింది. పదేళ్లనాటి ఒక శోధనలో భాగంగా సుజనా గ్రూపు సమాచారం కోసం చెన్నై నుంచి ఈడీ అధికారులు వచ్చారని పేర్కొంది. ఆ దర్యాప్తు సంస్థకు అవసరమైన సమాచారాన్ని సుజనా సంస్థలు అందించాయని వివరించింది. అయితే, సుజనా గ్రూపులోని డైరెక్టర్ల కోసం లుకౌట్‌ నోటీసు జారీ చేశారన్న దుష్ప్రచారం జరుగుతోందని, ఈ ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించింది.

Posted
Quote

సుజనా గ్రూప్‌లోని అన్ని సంస్థలకు చెందిన డైరెక్టర్లు సుజనాచౌదరి నిర్దేశాల మేరకు నడుచుకుంటున్నట్లు దర్యాప్తులో తేలింది. అందుకు సంబంధించిన ఈమెయిల్స్‌, ఇతర సమాచారాన్ని బీసీఈపీఎల్‌ డైరెక్టర్స్‌ నివాస, వాణిజ్య సముదాయాల నుంచి స్వాధీనం చేసుకున్నాం. సుజనాగ్రూప్‌నకు చెందిన మొత్తం వ్యవహారాలకు సుజనాచౌదరి ఒక్కరే వ్యక్తిగత బాధ్యుడని చెబుతూ ఆయా సంస్థల డైరెక్టర్లు పీఎంఎల్‌ఏ సెక్షన్‌ 50 కింద స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చారు. సుజనాచౌదరి నేరుగా లేదా ఆయనకు గ్రూప్‌నకు చెందిన సీఎఫ్‌ఓ(చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌), సీఎస్‌ (కంపెనీ సెక్రెటరీ)ల ద్వారా ఇచ్చిన ఆదేశాల మేరకు సంతకాలు చేసే వారమన్నారు. 

annitiki sujana ee responsible ite meeru andaru directors gaa enduku vunnaru raa lafut fellows. free gaa jeethalu dobbesthunnara. directors ni andarini bokkalo vesthe thappa buddi raadu naa kodukalaki. 

Posted
15 minutes ago, timmy said:

 

కడిగిన ముత్యం ..మా సుజనా ..😔

Posted
37 minutes ago, Hitman said:

కడిగిన ముత్యం ..మా సుజనా ..😔

Eerojullo evaroo kadukkoru, anduke memu kuda ade follow avutham alantollake support chestam antunna @futureofandhra

 

Posted

naku india lo house loan adigithe.. credit score konchem thakuva undhi sir midhi  ani savagotaru... alantidhi veelaki business losses lo una, inni vela kotlu ela isthanru.. 

Posted
5 hours ago, cosmopolitan said:

naku india lo house loan adigithe.. credit score konchem thakuva undhi sir midhi  ani savagotaru... alantidhi veelaki business losses lo una, inni vela kotlu ela isthanru.. 

political background vundi , commissions isthey istharu. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...