snoww Posted November 27, 2018 Report Posted November 27, 2018 విజయవాడ బైపాస్‌కు మోకాలడ్డు! గడువు మీద గడువు.. కొర్రీల మీద కొర్రీలు.. డీపీఆర్ కోసం కన్సల్టెన్సీలను ఎంపిక చేయని కేంద్రం జాతీయ రహదారి విస్తరణ టెండర్లలోనూ జాప్యం ఈనాడు, అమరావతి గడువుల మీద గడువులు పెంచారు.. అయిదుసార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు సాంకేతిక టెండర్లను పిలిచారు.. మరికొన్నింటికి ఇంకా సాంకేతిక అర్హత టెండర్లను సైతం తెరవలేదు.. సవివర నివేదికలకే కన్సల్టెన్సీలను నియమించలేదు. ఇక టెండర్ల ఖరారు ప్రశ్నార్థకమే..! కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వ సంబంధాలు బెడిసి కొట్టిన తర్వాత ఆ ప్రభావం జాతీయ ప్రాజెక్టులపై చూపుతోంది. టెండర్లను పిలిచిన ప్రాజెక్టులకు సైతం కేంద్ర సంస్థలు ఆమోదముద్ర వేయకుండా తీవ్ర జాప్యం చేస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారుల నిర్మాణంలో పూర్తి అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. గతంలో మంజూరైన ప్రాజెక్టులకు సైతం నిధులు విడుదల చేయకుండా అడ్డుపుల్ల వేస్తున్నాయి. కొర్రీల మీద కొర్రీలు వేస్తూ దస్త్రాలను తిప్పి పంపుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని నగరంగా గుర్తింపు పొందిన విజయవాడ నగరానికి బాహ్యవలయ రహదారి (బైపాస్) నిర్మాణం మూడు అడుగులు ముందుకు పడితే.. నాలుగు అడుగులు వెనక్కి వస్తోంది. గతంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గామన్ ఇండియా చేసిన నిర్వాకం ఫలితంగా ఆగిపోయిన జాతీయ రహదారి విస్తరణ.. ఏడాది అయినా టెండర్లు ఖరారు కాలేదు. కొన్ని సవివవర నివేదిక తయారు కాలేదు. ఇదిగో అదిగో అంటూ నెలలు గడిచిపోతున్నాయి. ఈ ప్రాజెక్టు అటకెక్కుతుందా లేదా అనేది అనుమానంగా మారింది. ప్రాజెక్టులో జాతీయ రహదారి విస్తరణ పనులు, విజయవాడ బైపాస్ రహదారి నిర్మాణం, కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణం ఉన్నాయి. ప్రస్తుతం ఈ పనులపై నీలిపనీడలు కమ్ముకున్నాయి. ఇదీ నేపథ్యం..! జాతీయ రహదారి నెం16 విస్తరణ పనుల్లో భాగంగా విజయవాడ బైపాస్ రహదారితో పాటు.. కృష్ణానదిపై వంతెన నిర్మాణం పనులను గతంలో జాతీయ రహదారుల సంస్థ మంజూరు చేసింది. బీఓటీ ప్రాజెక్టు కింద మంజూరు చేయగా దీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గామన్ ఇండియా దక్కించుకుంది. ఒప్పందం చేసుకున్న తర్వాత పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేసింది. చిన్నఅవుట్పల్లి వద్ద పనులను ప్రారంభించారు. తర్వాత పట్టించుకోలేదు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను వరకు ఆరు వరసల రహదారి నిర్మాణం చేయాల్సి ఉంది. చిన్నఅవుట్పల్లి నుంచి గొల్లపూడి వరకు బైపాస్ రహదారి నిర్మాణం కృష్ణానదిపై వంతెన నిర్మాణం చేయాల్సి ఉంది. చెన్నై నుంచి వచ్చే వాహనాలు విజయవాడ నగరానికి రాకుండా ఈ బైపాస్‌లో విశాఖకు వెళ్లేందుకు అనువుగా ఉంటాయి. అలాగే హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు అనువుగా ఉంటుంది. నగరంలో ట్రాఫిక్ భారం తగ్గే అవకాశం ఉంది. కానీ ఈ పనులు ప్రారంభించకుండా గామన్ ఇండియా తాత్సారం చేసింది. పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆఖరి అవకాశం అంటూ దాదాపు రెండేళ్లు గడిపింది. ఎట్టకేలకు తాము పనులు చేయబోమంటూ చేతులు ఎత్తేసింది. దీంతో దీనికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. దీనిలో భాగంగా జాతీయ రహదారుల సంస్థ నాలుగు ప్యాకేజీలుగా విభజించింది. వాటికి టెండర్లను పిలవాలని నిర్ణయించింది. రెండు ప్యాకేజీలకు ఆర్థిక ఆమోదం పొంది టెండర్లను పిలిచింది. రెండు ప్యాకేజీలకు సవివర నివేదికల కోసం కన్సెల్టెన్సీలను నియమించేందుకు బిడ్లు ఆహ్వానించింది. ఇది జరిగి ఆరు నెలలు గడిచినా ఒక కొలిక్కి రాలేదు. ఎట్టకేలకు రెండు ప్యాకేజీల టెండర్లను తెరిచారు. కానీ ప్రైస్ బిడ్ (ధరల టెండర్) ఇంకా ఖరారు చేయలేదు. కన్సల్టెన్సీల కోసం పిలిచిన బిడ్లకు ఇంతవరకు మోక్షం లేదు. వాయిదాలపై వాయిదా..! విజయవాడ బైపాస్ రహదారిని ఈపీసీ కింద మెత్తం నాలుగు ప్యాకేజీలుగా విభజించారు. వీటిలో రెండు ప్యాకేజీలకు డీపీఆర్ సిద్ధం చేసి టెండర్లను పిలిచారు. రెండు ప్యాకేజీలకు డీపీఆర్ సిద్ధం కావాల్సి ఉంది. విజయవాడ బాహ్యవలయ రహదారి బీఓటీ ప్రాజెక్టు వ్యయం మొదట రూ.1680 కోట్ల్లుగా అంచనా వేశారు. దీన్ని మూడేళ్ల కిందట గామన్ ఇండియా దక్కించుకుంది. దీనిలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణం కూడా ఒకటిగా ఉండేది. దీన్ని ఇప్పుడు నాలుగు ప్యాకేజీలుగా ఈపీసీ కింద విభజించిన జాతీయ రహదారుల సంస్థ రెండింటింకి వెంటనే టెండర్లను పిలిచింది. చిన్నఅవుట్‌పల్లి నుంచి కలపర్రు వరకు ఒక ప్యాకేజీ, కలపర్రు నుంచి గుండుగొలను (పశ్చిమగోదావరి జిల్లా) వరకు మరో ప్యాకేజీగా విభజించారు. రెండు ప్యాకేజీల అంచనా వ్యయం రూ.1355 కోట్లుగా నిర్ణయించారు. చిన్నఅవుట్‌పల్లి నుంచి కలపర్రు ప్యాకేజీ అంచనా వ్యయం రూ.648 కోట్లుగా నిర్ణయించారు. రెండో ప్యాకేజీ కింద కలపర్రు నుంచి గుండుగొలను వరకు అంచనా వ్యయం రూ.707 కోట్లుగా నిర్ణయించారు. దీనికి మొదట టెండర్లను పిలిచి మే నెల చివరి గడువుగా నిర్ణయించారు. ఆ తర్వాత మే నెల నుంచి జులై, తర్వాత సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు వరకు గడవు పెంచుకుంటూ పోయారు. ఎందుకింత జాప్యం జరిగిందనేది అధికారులకు తెలియదు. ఎట్టకేలకు ఇటీవల సాంకేతిక టెండర్లను తెరిచినట్లు తెలిసింది. ఒక ప్యాకేజీకి నాలుగు సంస్థలు, మరో ప్యాకేజీకి అయిదు సంస్థలు అర్హత సాధించాయి. ప్రస్తుతం ధరల బిడ్‌ను సరిపోల్చుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. దీనికి ఎంత సమయం తీసుకుంటారనేది తేలాల్సి ఉంది. ప్రైస్‌బిడ్ ఖరారు చేసిన తర్వాత గుత్త సంస్థలతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించాల్సి ఉంది. నగరానికి అత్యంత కీలకం...: విజయవాడ నగరానికి సంబంధించి ఈ రహదారి విస్తరణ, బైపాస్ నిర్మాణం అత్యంత కీలకం. గన్నవరం నుంచి రామవరప్పాడు రింగ్ వరకు జాతీయ రహదారి అత్యంత రద్దీగా ఉంటుంది. రోజూ నాలుగైదు ప్రమాదాలు జరుగుతున్నాయి. సగటున రోజుకొకరు మృత్యువాత పడుతున్నారు. ప్రధానంగా గన్నవరం, నిడమనూరు, ఎనికేపాడు, ప్రసాదంపాడు, రామవరప్పాడు రింగు వద్ద ప్రమాదాలు దారుణంగా జరుగుతున్నాయి. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. గంటల తరబడివ వాహనాలు నిలిచిపోతున్నాయి. దీనికి బైపాస్ ఒకటే పరిష్కారం అని అధికారులు చెబుతున్నారు. కానీ ఈ టెండర్లను వాయిదా వేస్తూ తాత్సారం చేస్తున్నారు. రూ.36 కోట్లతో..! జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలోనే మరో ప్రాజెక్టు ఆఘమేఘాల మీద రోడ్డెక్కింది. విజయవాడ నగరం నుంచి గన్నవరం వరకు జాతీయ రహదారి మరమ్మతులకు రూ.36 కోట్లు మంజూరు చేశారు. దీనికి టెండర్లను పలిచి ఖరారు చేశారు. త్వరలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణలంక వారధి నుంచి గన్నవరం వరకు 16వ నెంబరు జాతీయ రహదారి గతుకుల మయంగా మారింది. ఇటీవల కాలంలో మరమ్మతులు లేవు. వాస్తవానికి ఇది టోల్ రోడ్డు. వినియోగ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కానీ మరమ్మతులు మరిచారు. ఇటీవల కాలంలో గన్నవరం నుంచి ప్రముఖులు రావడంతో ఈ రహదారిని మెరుగులు దిద్దాలని సూచించారు. కొన్ని సాంకేతిక లోపాలను సరి చేసి మరో వరస బీటీ పొర వేయాలని ప్రతిపాదించారు. దీనికి కేంద్రం రూ.36 కోట్లు మంజూరు చేసింది. ఇటీవల దీనికి అత్యవసరంగా టెండర్లను పలిచారు. అయితే టెండర్ సంస్థను రహస్యంగా ఉంచారు. త్వరలో ఒప్పందం కుదరనుంది. ఈ పనుల్లో మిగులు శాతం అధికంగా ఉంటుందని అందుకే ఆఘమేఘాల మీద ఖరారు చేశారన్న విమర్శలు ఉన్నాయి. జనవరి నాటికి..! పదహారో నెంబరు జాతీయ రహదారి విస్తరణ పనులు వచ్చే జనవరి నాటికి ప్రారంభించే అవకాశం ఉందని జాతీయ రహదారుల సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్ చెప్పారు. బైపాస్ రహదారి నిర్మాణం జాప్యంపై ఆయనను ‘ఈనాడు’ వివరణ కోరగా ధరల బిడ్ ఎవాల్యూషన్ జరుగుతుందని వివరించారు. ఒక ప్యాకేజీకి నాలుగు సంస్థలు, మరో ప్యాకేజీకి అయిదు సంస్థలు దాఖలు చేశాయని వివరించారు. మరో రెండు ప్యాకేజీల డీపీఆర్ తయారీకి సంస్థలను ఎంపిక చేయాల్సి ఉందని, దిల్లీలో దస్త్రం ఉందని తెలిపారు. విమానాశ్రయం రహదారి మరమ్మతుల పనులను త్వరలోనే ప్రారరంభిస్తామని చెప్పారు. ఇన్ని రోజులా..? విజయవాడ బైపాస్ రహదారి నిర్మాణం, కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణం కోసం సవివర తయారీ నివేదిక అందించేందుకు ఏడు సంస్థలు ఆసక్తి వ్యక్తీకరణ దరఖాస్తులు (బిడ్లు) సమర్పించాయి. గత జులైలోనే ఈ బిడ్లు దాఖలు చేశాయి. డీపీఆర్ తయారు చేసిన తర్వాత దీన్ని కేంద్రానికి పంపనున్నారు. చిన్న అవుట్‌పల్లి నుంచి గొల్లపూడి వరకు విజయవాడ బైపాస్ రహదారి సుమారు 18 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీన్ని ఆరు వరసల రహదారిగా నిర్మాణం చేస్తారు. దీనికి డీపీఆర్ తయారు చేసిన తర్వాత ఈపీసీ టెండర్లను పిలవాల్సి ఉంది. ఈ రెండు ప్యాకేజీలకు కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి ఉంది. సవివర నివేదిక తర్వాత మాత్రమే కేంద్రం ఆమోదానికి పంపనున్నారు. విజయవాడ బైపాస్ రహదారి గొల్లపూడి నుంచి చిన్న అవుట్‌పల్లి వరకు సుమారు రూ.300 కోట్లు పైగా ఉంటుందని అంచనా. మరో ప్యాకేజీలో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణం. దీన్ని ఇప్పటికే సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పలు ఆకృతులు తయారు చేశారు. దీని నిర్మాణంపై ప్రతిష్టంభన ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ చేపడుతుందా.. లేక సీఆర్‌డీఏ చేపడుతుందా అనేది ప్రశ్నార్థకమే. ఎన్‌హెచ్‌ఏఐ మాత్రం డీపీఆర్ తయారు చేయాలని టెండర్లను ఆహ్వానించడం విశేషం. ప్రస్తుతం ప్రాంతీయ కార్యాలయంలో టెండర్లను తెరవాల్సి ఉంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు. వడపోతలో ఏడు సంస్థలు నిలిచాయని పీడీ విద్యాసాగర్ చెబుతున్నారు. దాదాపు అయిదు నెలలు గడిచినా దీనిపై ప్రాంతీయ కార్యాలయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. డీపీఆర్ తయారీకి సంస్థలను ఎంపిక చేయలేదు. దీనికి అధికారులు సరైన కారణం మాత్రం చెప్పలేకపోతున్నారు. దీనికి ఆర్థిక శాఖ ఆమోదం లేకపోవడమే కారణమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం ఎందుకు సంస్థలను ఎంపిక చేయలేదనేది ప్రశ్నార్థకంగా మారింది. Quote
snoww Posted November 27, 2018 Author Report Posted November 27, 2018 Bodi . Enduku man neeku Amaravati lo jaruguthunna world class development choosi kullu. @idebezawada bro. nuvvu ina cheppu Bodi ki , Jagan ki , PK ki Quote
superhit3 Posted November 27, 2018 Report Posted November 27, 2018 BJP Govt yedaina help iste surprise ...mokalu arikalu veste surprise yemundi Quote
MiryalgudaMaruthiRao Posted November 27, 2018 Report Posted November 27, 2018 lol nakka antunna langas Quote
sattipandu Posted November 27, 2018 Report Posted November 27, 2018 24 minutes ago, MiryalgudaMaruthiRao said: lol nakka antunna langas so u langa?? Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.