Jump to content

We want appireddy anna #AppiArmy


Recommended Posts

Posted

శానంపూడి సైదిరెడ్డి... హుజుర్నగర్ తెరాస అభ్యర్థి ...మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పూర్తి నేర చరిత్ర.

1974 జననం గుండ్లపల్లి గ్రామం 
1989 హై స్కూల్ మట్టంపల్లి
1991 ఇంటర్మీడియట్ 
1993 డిగ్రీ జాయిన్ కానీ పూర్తి చేయలేదు 
1995 వేనేపల్లి చందర్ రావు తో పరిచయం, చందర్ రావు సారా కాంట్రాక్టులు చక్కబెట్టటం 
1997 గుండ్లపల్లి హత్యా రాజకీయాలు మొదలు, కృష్ణ నది ఒడ్డున ఇసుకలో బాంబులు దాచి వేట కొడవళ్ళతో దాడులు, ప్రత్యర్థులపై బాంబు దాడులు
1998 బండి రాములమ్మ భర్త హత్య.. అర్థరాత్రి పడుకున్న వ్యక్తిని అడ్డంగా గొడ్డలితో నరికిన సైదిరెడ్డి అనుచరులు 
a1 ముద్దాయిగా సైదిరెడ్డి పేరు చేర్చిన పోలీసులు 

గుండ్లపల్లి నుండి కుటుంబం పరార్ 
చందర్ రావు అండతో బెయిల్ 

2000 సైదిరెడ్డి తల్లి ఊరి ప్రవేశం 
సర్పంచిగా పోటీ యత్నం .. కారం తో దాడి చేసిన గ్రామస్థులు 
తండ్రి అంకిరెడ్డి ఆక్సిడెంట్లో దుర్మరణం.. కక్ష తో చంపారని ఊరంతా గుస గుసలు 

సైదిరెడ్డి శత్రువుల నుండి ప్రాణాలు కాపాడాలని చందర్ రావు కాళ్ళు పట్టుకోటం 
అప్పటి సర్కిల్ ఇన్స్పెక్టర్ సర్వేశ్వర్ రెడ్డి సహాయంతో పాస్పోర్ట్ వచ్చేలా రిపోర్ట్ 
పాస్పోర్ట్ చేతికి రావటం తో దొంగ సర్టిఫికెట్లు సృష్టించి జమైకా వీసా పొందటం..జమైకా పారిపోవటం అక్కడ ఒక రెస్టారంట్ లో పనికి కుదరటం 
కాల క్రమేణా కేసు కూడా నీరు కారిపోవడం దేశం నుండి పారిపోవటం తో ప్రత్యర్ధులు కూడా వదిలేసిన వైనం 

2002 మట్టంపల్లి చుట్టుపక్కల యువకుల్ని జమైకాలోఉద్యోగాలు ఇప్పిస్తానని మళ్ళీ తెరపైకి 

షుమారు 60 మంది యువకుల్ని డబ్బు గుంజి మోసం చేయటం..ఒక్కరినో ఇద్దరినో తీసుకెళ్లటం ..బి టెక్ గ్రాడ్యుయేట్స్ ని తాను పని చేసే రెస్టారంట్ లో పనికి కుదిర్చిన వైనం

డ్రగ్స్ అమ్మాయిలని అలవాటు చేయటం తో పిచ్చి వాళ్లుగా తిరిగొచ్చిన ఇద్దరు స్టూడెంట్స్ ( మట్టంపల్లి మండలంలో అడగొచ్చు) 

జమైకాలో రెస్టారంట్ నడుపుతున్న వ్యక్తిని నయనా భయానా బెదిరించి రెస్టారంట్ తనదని రాయించుకోటం 

2004 రెస్టారంట్ వ్యాపారం చేస్తూ దొంగ సర్టిఫికెట్లతొ ఉద్యోగానికి ఎర ఈ సమయంలో తమ్ముడు శేఖర్ రెడ్డి ని జమైకా పిలిపించుకోటం ( తమ్ముడు శేఖర్ పదవ తరగతి పరీక్ష కాపీ కొడుతూ పట్టు బడటం, నాలుగు సంవత్సరాలు చదువు నుండి డిబార్ చేసిన విద్యాశాఖ) ఫైనాన్స్ కంపెనీ లో తమ్ముడికి ఉద్యోగం..

 రెస్టారంట్ కి వచ్చే కస్టమర్లు ఒకసారి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజషన్స్ వాళ్లు వచ్చినపుడు పరిచయంతో వాలంటీర్ గా పని చేయటం .. అందులో జాబ్ చేస్తున్నట్లుగా సృష్టించటం.. నిజానికి ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజషన్.. ఇందులో ఎవరైనా ఉచితంగా పనిచేయొచ్చు వాలంటీర్ గ (నిజానికి చిన్న చిన్న శిక్షలు పడితే కూడా కోర్టు వాలంటీర్ వర్క్ చేయిస్తుంది .. దానినే uno లో పనిచేసినట్లుగా ప్రచారం 

2005 జమైకా టూరిస్ట్ దేశం కాబట్టి ఇతర దేశాలనుండి జనం వస్తారు.. ఆ సమయంలో కెనడా పౌరులు కలవటం.. స్నేహితుల సహాయంతో కెనడా చేరటం.. తనకి తెలిసిన విద్య రెస్టారంట్ కాబట్టి మయూరి ఇండియన్ రెస్టారంట్ స్టార్ట్ చేయటం
ఈ రెస్టారంట్ బిజినెస్ క్యాటగిరీ లో కెనడా పౌరసత్వం. 

2015 మంత్రి జగదీశ్ రెడ్డి పరిచయం ఒకే జిల్లా కావటం తో దగ్గరికి తీసిన మంత్రి
జగదీష్ రెడ్డి బినామీగా కాలేజీలు, స్థలాలు, పవర్ కంపెనీలు, ఫర్నిచర్ షాపులు, బాయ్స్ హాస్టల్స్ ..గర్ల్స్ హాస్టల్స్ బిజినెస్లు, 
మంత్రి పరిచయంతో కెసిఆర్ ని కలవటం మల్లి రాజకీయాలు మొలకెత్తటం ఇంజనీరింగ్ కాలేజీ మూత పడటం తో దానిని నాన్ ప్రాఫిట్ సంస్థగా మార్చి అక్రమ సంపదనంతా ఆ సంస్థలో దాచాలని కెసిఆర్ కోసం ప్రయత్నాలు 

అనూహ్యంగా సూర్యాపేట కలెక్టరేట్ తెరపైకి కెసిఆర్ అటుగా వెళ్తూ కాలేజీని చూపించి తాత్కాలిక కలెక్టరేట్ సైదిరెడ్డి కాలేజీలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదన 
నాలుగు వందల యాభై కోట్లు స్కాం కు శ్రీకారం వేరెవరో అయితే కష్టమని సైదిరెడ్డి బెదిరింపు చర్యలకి తలొగ్గిన జగదీష్ రెడ్డి.. జగదీష్ రెడ్డిని సైతం బ్లాక్మెయిల్.. రెండు సంవత్సరాలు నమ్మించి జగదీష్ రెడ్డికే చెక్ పెట్టినట్లు సమాచారం... జగదీష్ జుట్టు బినామీ ఆస్తులు సైదిరెడ్డి దగ్గర కనుక శంకరమ్మ ని తప్పిచ్చి మరి సైదిరెడ్డికి టికెట్ .. మిగతా కథ సూర్యాపేట కలెక్టరేట్ ఫేమ్ మీకు తెలిసిందే ..

హుజుర్నగర్ ఓటర్లకు/యువకులకు సూటి ప్రశ్నలు మీరే ఆలోచించుకోండి 

1 పద్దెనిమిది సంవత్సరాలు దేశం బయట ఉన్నవాడు స్థానికుడా? ఎలా అవుతాడు?
2 హత్య కేసులో దొంగ సర్టిఫికెట్స్ తో పాసుపోర్టుతో దేశం వదిలి పారిపోయినోడు మీ నాయకుడా?

3 పద్దెనిమిదేండ్లు జమైకాలో కెనడాలో అంట్లు తోముకుని దోషాలు, బిర్యానీలు చేసినోడు ఏం తెలుసనీ రేపు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు చూపిస్తాడు? 

4 చదువు లేదు, దొమ్మీలు, రాజకీయ హత్యలు, జమైకా డ్రగ్స్ ( హైదరాబాద్ డ్రగ్స్ కేసులో పాత్రలున్నట్లు అనుమానం, జమైకా నల్లజాతీయుల దేశం), అమ్మాయిలు ఈ చరిత్రున్నోడు రేపు మిమ్మల్ని బ్రతకనిస్తాడా? 

5 రాజకీయాల్లోకి రాకముందే సూర్యాపేట భూ కుంభకోణంలో 350 కోట్లు ప్రజల సొమ్ము దోచుకున్నోడు రేపటి హుజుర్నగర్ పరిస్థితి ఏమిటి? 

6 శానంపూడి అనే ఇంటిపేరు మీరు ఎపుడైనా తెలంగాణ లో విన్నారా? కనుక్కోండి ..ఆంధ్ర నుండి వచ్చిన ఒకే ఒక్క ఫామిలీ, కనీసం తెలంగాణ స్పెల్లింగ్ కూడా తెల్వదు, అలాంటిది తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన పన్నెండు వందల ఆత్మ బలిదానాల శ్రీకాంత్ తల్లి శంకరమ్మ టికెట్ నే మింగేసిన ద్రోహి 

7  2016  వరకు ఒక్క రెస్టారంట్ సంపాదనతో బతుకుతున్న ఈ సైదిరెడ్డి కెసిఆర్ కె డబ్బులిచ్చి టికెట్ కొనే అన్ని డబ్బులు ఎక్కడివి? జగదీష్ రెడ్డి అడ్డంగా నొక్కేసిన జనం సొమ్మా లేక అనుమానులున్నట్లు డ్రగ్స్ అమ్మితే వచినవా? 

8 త్యాగాల పురిటిగడ్డ తెలంగాణలో ఇంత నీచులకి mla టిక్కెట్లా? అసలు కెసిఆర్ ఏం చూసి టికెట్ ఇచ్చాడు? మంచి నాయకులూ, డాక్టర్లు, సాహితీ వేత్తలు, ఉద్యమకారులు పుట్టిన తెలంగాణ గడ్డ నల్గొండ ఖిల్లా .. టికెట్ ఇవ్వటానికి మంచి నాయకుడే లేడా? 

9 యువకులారా ఇలాంటి చెత్తని నమ్మకండి. సోషల్ మీడియా, ఇంటర్నెట్ యుగం లో globalization భయంకరంగా ఉపయోగపడ్తున్న ఈరోజుల్లో, అసలెవరీ సైదిరెడ్డి??తెలుసుకోండి!!! 2015 కి ముందు ఇతని చరిత్రేన్తో తెలుసుకోండి.. వెతకండి .. అన్వేషణతో ..స్టార్ట్ ఫైండింగ్ ది ఫాక్ట్స్. 

10 టీచర్ కాదు, ఉద్యమ కారుడు కాదు, కళాకారుడు కాదు, సాహిత్యవేత్త కాదు, అసలు ఇన్నాళ్లు కనీసం మనకోసం మన పనికోసం తెలంగాణ కోసం తిరిగిన మన స్థానికుడు కానే కాదు. మన దేశం మీద గౌరవం లేక కెనడా పౌరసత్వం అది కూడా రెస్టారెంట్లో ఎంగిలి ప్లేట్లు కడుగుతూ 

మంత్రి పరిచయంతో మన దగ్గరకు .. వీడు మన తెలంగాణ రాజ్యాంగాన్ని రిప్రెసెంట్ చేయటానికి 119  లో ఒక శాసన సభ్యునిగా ఉండటానికి ఓట్లు అడగటం?? రేపు ఈ చెత్తకి ఓట్లేసి గెలిపిస్తే ...అహర్నిశలు రాత్రియంబవళ్ళు కస్టపడిన కలెక్టర్లు, పోలీసులు, టీచర్లు, mro లు, ఉద్యోగులు సలాములు కొట్టాలి.. ఏం ఖర్మరా బాబు??? ఇందుకా త్యాగాల తెలంగాణ c తెచ్చుకుంది?? ఇంతకంటే గొప్ప వ్యక్తులు లేరా తెలంగాణాలో? ఆలోచించండి? 

పైన పేర్కొన్న వాటిలో ఏ ఒక్కటి కూడా తప్పుగా చెప్పలేదని చనిపోయిన మా తెలంగాణ అమరవీరుల ఆత్మల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం!! జోహార్ తెలంగాణ అమరవీరులు!! జోహార్🙏🙏

Posted
2 hours ago, Veeraveera said:

Consultancy eppudu pettadu?  when ?

Can't see that 

 

Consultancy undha saidi reddy ki

Posted
2 hours ago, Veeraveera said:

Consultancy eppudu pettadu?  when ?

Can't see that 

 

aa history antha saidi reddy di

Posted
3 hours ago, Paidithalli said:

ఈ రెస్టారంట్ బిజినెస్ క్యాటగిరీ లో కెనడా పౌరసత్వం. 

 

if you are the Canadian citizen how can someone contest in elections??

 

Posted
1 hour ago, kevinUsa said:

if you are the Canadian citizen how can someone contest in elections??

 

Canadian PR emo...

Posted
1 hour ago, Android_Halwa said:

Canadian PR emo...

ok.  even this should be included if you a resident of a country for more than 10 years u are not eligible ani.

 simple u dont know what are current demographics and you let someone contest in elections.

never compare india with western democracy....

Posted
11 hours ago, kevinUsa said:

if you are the Canadian citizen how can someone contest in elections??

 

restaurant category? gods must be crazy

Posted
23 minutes ago, The_One_Above_All said:

matter in 0 lines fleez , no interest anduke 0 lines

0

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...