Jump to content

Recommended Posts

Posted

అనగనగా ఒక ఆశపోతు కోతి. దాని కళ్లెప్పుడూ పక్క చెట్లమీదే..! తనే అడవిని నాటాననీ, పెంచాననీ చెబుతుంది. అన్ని కోతులకూ, కొండముచ్చులకూ, చింపాంజీలకూ, ఒరాంగుటాన్లకూ, లంగూన్లకూ సమస్త వానరజాతికి నేనే ఊపిరి పీల్చడం; అరటిపళ్ళు వలుచుకోవడం; కొబ్బరి తినడం నేర్పించానని చెప్పుకునీ, చెప్పుకునీ తనుకూడా అదే భ్రమలో పూర్తిగా కూరుకుపోయింది...! దాని మాటలు నమ్మే భృత్యగణం కూడా ఒహటి తయారయ్యింది..!
🧠🧠

పక్కనే ఉన్న ఇంకో అడవిలో మొక్కజొన్న పంట కాపుకొచ్చిందని ఆ కోతికి తెలిసింది. వెంటనే, పంటను, వ్యవసాయాన్నీ కనుక్కుంది నేనే కాబట్టి, ఆ పంట తెచ్చుకుంటానంటూ కోతి ఆ మొక్కజొన్న తోటలో దూరి, దాని శక్తిమేరకు కొన్ని మొక్కజొన్న గింజలు తెంపుకుంది.🌽🌽🌽🌽🌽🌽

వాటిని తీసుకుని వెళుతుంటే దానికో విరగకాసిన రేగిపళ్ల చెట్టు కనిపించింది...!

కోతి తన కోతి లాజిక్ తో, రేగుపళ్లు మొక్కజొన్న గింజలకన్నా సైజులో పెద్దవి కాబట్టి, వీటిని తీసుకెళ్దాం అనుకుని, ఆ మొక్కజొన్న గింజలు పారబోసి కొన్ని రేగుపళ్లు తెంపుకుని బయల్దేరింది. ఇంతలో దానికో సపోటా పళ్లచెట్టు కనిపించింది...! 🍊🍊🍊

సేమ్ కోతిలాజిక్. రేగుపళ్లకన్నా సపోటాలు పెద్దవి. రేగుపళ్లను నేలక్కొట్టి, సపోటాలు తెంపుకెళుతుంటే ఆ మర్కటానికి అరటి తోట కనిపించింది...!🍌🍌🍌🍌

సేమ్ కోతిలాజిక్. సపోటాలు నేలపాలై, అరటిపళ్ళు కోతి చంకకెక్కాక, దానికి పుచ్చకాయల పాదు కనిపించింది...!🍉🍉🍉🍉🍉

కాసిన పుచ్చకాయల్లో మాంఛి బరువైనది తెంపుకుని తీసుకెళ్లడం ఓ చారిత్రక అవసరంగా భావించిందా వానరం..! చెట్టు నుండి తెంపడం కోసరం తీగను కొరకడం మొదలెట్టింది..!🐵

ఇంతలో పాపం ఓ కుందేలుకు ఆకలేసి అదే పుచ్చకాయను మెల్లగా తన చిట్టి కడుపుకు సరిపోయేంత తిని వెళదామని ఇంకోవైపు నుండి కొరకడం మొదలెట్టింది. 🦊🦊

కోతి కళ్లకున్న విజన్ గొప్పది కాబట్టి, కుందేలును చూసింది. ఎవరి తిండి వాళ్లది; ఎవరి బతుకు వాళ్లది అన్న స్పృహ లేని ఆ కోతి తను తినకుండా, ఆ కుందేలును తిననీయకుండా తరమడం మొదలెట్టింది. 

G29Y7O.gif🐵s

 

 

sssdsd🐵🐵

 

కుందేలు వాళ్ల తాతలు ఆ రోజుల్లో అమాయకత్వంతో తాబేళ్ళతో పరుగుపందెంలో ఓడిపోయిన బ్యాచీ. గుణపాఠం నేర్చుకున్న తరం దానిది. అందుకే ఆ కోతికి దొరక్కుండా పరిగెత్తడం మొదలెట్టింది..!🦄🦄

కుందేలును పట్టుకోవడానికి; కోతి తన ప్రకృతి ధర్మాన్ని మరిచి వెంబడించడం మొదలెట్టింది. కుందేలు తన ప్రాంతంలోకి తను వెళ్లి తన కలుగులో దాని పెద్దన్న తెచ్చిపెట్టిన క్యారెట్ తింటూ రిలాక్స్ అవడం మొదలెట్టింది. 🥕🥕🥕🥕🥕

కోతి ఆ కొత్తప్రాంతంలో అయిపూ అజా లేక తప్పిపోయింది..!🐒🐒🐒🐒🐒🐒🐒🐒

*******************************************

#నీతి: దురాశ దుఃఖమునకు చేటు. 
*****

Posted

kundelu PK gadu ..... vadi anna PRP petti carrots dasipeduthy poyi happy gaa thintuntee ..CBN and Co jumping aaa .... idhenaa ee story lo ardam??

Posted
1 minute ago, sri_india said:

kundelu PK gadu ..... vadi anna PRP petti carrots dasipeduthy poyi happy gaa thintuntee ..CBN and Co jumping aaa .... idhenaa ee story lo ardam??

yadhbhaavam tadhbhavati bro

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...