Jump to content

Recommended Posts

Posted

సినీహీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సోమవా రం సీజ్‌ చేశారు. ఇటీవల రాయదుర్గం పాయే గా సర్వే నంబర్‌ 46లోని స్థలం ప్రభుత్వ స్థలం గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే నంబర్‌లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలి సింది. ఇందులో 2,200 గజాల్లో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను నిర్మించారు. దీన్ని జీవోనంబర్‌ 59 కింద రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ దర ఖాస్తు చేసుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ స్థలమంతా ప్రభుత్వ స్థలంగా గుర్తించడంతో ఈ స్థలంలో నిర్మాణం చేసిన గెస్ట్‌హౌస్‌ను సీజ్‌ చేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.

Posted

Tokka le One Phone Call to KTR .... Guest House Keys techi chetilo pedataru ... Brahmi-2_1.gif?1337103173

Posted
Just now, Veeraveera said:

KTR ki line kalavakapothe rakul fafa ki chesina khaam kataham ayipothadhi

DB rakul fans feel avutaru.... Brahmi-2_1.gif?1337103173

Posted

lite, ivala ilanti news estaru, next day as usual keys teeskelli ichesi vastaru 

Posted

ఇదే గనక ఆంధ్రప్రదేశ్ లో జరిగుంటే చంద్రబాబు నాయుడనేవాడు స్వయంగా వెళ్లి కీస్ ఇచ్చి వచ్చేవాడు, సీజ్ చేసిన అధికారిని సస్పెండ్ చేసేవాడు. ఇమ్మిడియట్ గ ప్రభాస్ ని భ్రమరావతి గ్రాఫిక్స్ సిటీకి  బ్రాండ్ అంబాసడర్ చేసుకునేవాడు రాజమౌళిని వాడుకున్నట్టుగా 

Posted
ప్రభాస్‌ పిటిషన్‌ ధర్మాసనానికి బదిలీ

19brk105-prabhas.jpg

హైదరాబాద్‌: తన అతిథి గృహాన్ని సీజ్‌ చేయడాన్ని సవాల్‌ చేస్తూ ప్రముఖ సినీ నటుడు ప్రభాస్‌ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ధర్మాసనానికి హైకోర్టు బదిలీ చేసింది.  హైదరాబాద్ రాయదుర్గంలోని తన అతిథి గృహాన్ని అధికారులు నిన్న సీజ్‌ చేయడంపై ప్రభాస్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. రాయదుర్గంలోని ‘పైగా’ భూములపై కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. ఆ భూములు ప్రభుత్వానివేనని ఇటీవల సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో అక్కడి కట్టడాలను ఇటీవల రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. అక్కడే ఉన్న ప్రభాస్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో.. అధికారులు దాన్ని సీజ్ చేశారు. అయితే అధికారుల చర్యలను సవాల్ చేస్తూ ప్రభాస్ హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ విచారణ చేపట్టారు. నిబంధనలను పాటించకుండా.. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా సీజ్ చేయడం చట్ట విరుద్ధమని ప్రభాస్ తరఫు న్యాయవాది వాదించారు. అధికారుల తదుపరి చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించారు.  అయితే ఈ వివాదం చాలా మందికి సంబంధించింది గనక ఈ వ్యాజ్యాన్ని ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...