MOD Posted December 19, 2018 Report Posted December 19, 2018 1000 కోట్ల ఎన్టీఆర్ స్మారక స్థూపం పై విమర్శలు టాక్స్ పేయర్ల మనీని ప్రభుత్వం ఇలా ఖర్చు పెట్టడం సబబా?? ఇటీవలి కాలంలో బూమరాంగ్ అవుతున్న ‘ఎన్టీఆర్’ రాజకీయం. కుల సమీకరణాల ప్రభావం అమరావతిలో మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకుడు నందమూరి తారకా రామారావు విగ్రహాన్ని, స్మారక స్థూపం లా కట్టి, దాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడం కోసం, 1000 కోట్ల రూపాయల వ్యయం తో ఒక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన ప్రస్తుతానికి ప్రాథమిక దశలోనే ఉన్నట్టు అమరావతి డెవెలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ADCL) చెబుతోంది. ముందు రూ. 406 కోట్ల వ్యయంతో ప్రతిపాదించినప్పటికీ, ఇప్పుడు ఆ వ్యయం1000 కోట్లని అంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై అటు పౌర సమాజం నుంచి ఇటు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన, వ్యతిరేక స్పందన వస్తోంది. ఈ ప్రాజెక్టుకు డబ్బు ఎక్కడిది గతంలో గుజరాత్లో పటేల్ విగ్రహాన్ని కట్టినప్పుడు గాని మిగతా ఇతర ఇలాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు కానీ సాధారణంగా ఒక ట్రస్టు ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఇతరుల నుంచి విరాళాలను కూడా స్వీకరిస్తారు. ఆ వచ్చిన మొత్తం తో దీన్ని పూర్తి చేస్తారు. అయితే మొత్తం ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో ఎక్కువ శాతం డబ్బు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి వెళుతుంది. పటేల్ విగ్రహ విషయానికి వస్తే ఆర్థికంగా సంపన్నంగా ఉన్న గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ శాతం ఖర్చును భరించింది. అయితే గుజరాత్ లోని పటేల్ విగ్రహ విషయంలో కూడా పలు రకాల ప్రశ్నలు, విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. టాక్స్ పేయర్ల మనీని ప్రభుత్వం ఇలా ఖర్చు పెట్టడం పై విమర్శలు ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేసే పన్నులను ప్రజలు, తమ మౌలిక వసతుల కోసం ప్రభుత్వం తిరిగి ఖర్చు పెట్టాలని ఆశిస్తారు. పైగా అంచనా వేసిన వెయ్యి కోట్ల వ్యయం అంటే అది సాధారణమైన మొత్తం ఏమీ కాదు. అందుకే దీని మీద పలురకాల విమర్శలు వస్తున్నాయి. “రాష్ట్రంలోని వందలాది గ్రామాలలో లక్షలాది మంది ప్రజలకు సేవలు అందించే అనేక నీటిపారుదల, త్రాగునీటి ప్రాజెక్టులు ఈ 1000 కోట్ల రూపాయలతో పూర్తి చేయవచ్చు” అని మాజీ చీఫ్ సెక్రటరీ అజయ కల్లం పేర్కొన్నారు. అలాగే “పులిచింతల ప్రాజెక్టు లో పూర్తి స్థాయి లో నీరు నిల్వ చేయలేకపోతున్నాం అందుకు కారణం, భూ సమీకరణ పనులు మధ్యలో ఆగిపోవడమే. దీనికి సుమారు రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. వెయ్యి కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని నిర్మించే బదులు, ఆ డబ్బుతో ఇటు పులిచింతల ప్రాజెక్టు పనులు అలాగే వెలిగొండ పనులు ఇలాంటివి మరెన్నో పూర్తి చేయవచ్చు ” అని అజయ్ కల్లం వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలు తీవ్రమయ్యే అవకాశం అలాగే గతంలో పవన్ కళ్యాణ్ తన ఉత్తరాంధ్ర ప్రజా పోరాట యాత్ర సందర్భంగా, పుష్కరాలకి కోట్లకు కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వద్ద డబ్బు ఉంటుంది కానీ 20 కోట్ల ఖర్చుతో పూర్తయ్యే రైల్వే ఓవర్ బ్రిడ్జి ల కోసం ప్రజలు దశాబ్దాల తరబడి ఎదురుచూడాల్సి వస్తుంది అంటూ విమర్శించారు. అలాగే భీమవరంలో తాగునీటి పైపులైన్లు వేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండదు కానీ ప్రచార ఆర్భాటాలకి డబ్బు వస్తుంది అంటూ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇప్పుడు వెయ్యి కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లయితే ఇటువంటి విమర్శలు అటు రాజకీయ నాయకుల నుంచి, మేధావుల నుంచే కాకుండా ఇటు ప్రజల నుంచి కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది. రాజకీయంగా వ్యూహాత్మక తప్పిదం – ఇకపై ఆర్థిక వనరుల కొరత సాకు పని చేయదు చంద్రబాబు నాయుడుని 2014లో ప్రజలు ఎటువంటి అంచనాలతో గెలిపించారో అటువంటి అంచనాలు అందుకోవడంలో విఫలమయ్యారు అన్నది వాస్తవం. అయితే, తగినంత ఆర్థిక వనరులు లేకపోవడంతో పాటు, దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం, కేంద్ర ప్రభుత్వం సహాయం చేయక పోవడం వల్లే మన రాష్ట్రం వెనుకబడి ఉంది అంటూ ఇప్పటివరకు చెబుతూ వస్తున్నారు. మరి ఇప్పుడు వెయ్యి కోట్లతో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే అటువంటి వాదన చేసే అవకాశాన్ని చంద్రబాబు కోల్పోతారు. పుష్కరాలకు , ఎన్టీఆర్ విగ్రహాలకు మాత్రం డబ్బులు ఉంటాయి కానీ మా మౌలిక వసతులు తీర్చడానికి డబ్బులు ఉండవా అని ప్రజలు తీవ్రంగా ప్రశ్నిస్తారు. కుల సమీకరణాల ప్రభావం తీవ్రమవుతుంది తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయం భిన్నమైంది. తెలంగాణలో ప్రాంతీయ వాదం ప్రభావం ఎక్కువగా ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ లో కుల సమీకరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కొన్ని సామాజిక వర్గాల చేతుల్లోనే రాజకీయ అధికారం ఉంటోందని, ఆ పరిస్థితి మారాలని ఇతర వర్గాల్లో చైతన్యం వస్తోంది. అలాగే చంద్రబాబు పాలనలో అభివృద్ధి అంతా ఆయన వర్గానికి , ఆయన తస్మదీయులకు మాత్రమే పరిమితం అని ఒక ప్రధాన విమర్శ ఉంది . ఎన్టీఆర్ ని ఒక సామాజిక వర్గానికి పరిమితం చేయడం సబబు కాకపోయినప్పటికీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ ని తమ వర్గం వాడు అని విపరీతంగా చెప్పుకోవడంతో, ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మిగతా వర్గాలలో కచ్చితంగా అసహనానికి దారితీస్తుంది. ఇప్పటికే మాజీ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు, కేవలం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం కాదు, తెలుగు జాతి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు, ప్రకాశం పంతులు లాంటి మహనీయుల విగ్రహాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజల కోసం త్యాగాలు చేసిన అలాంటివారిని విస్మరించి కేవలం ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడం సమంజసం కాదని ఆయన అంటున్నారు. ఇటీవలి కాలంలో బూమరాంగ్ అవుతున్న ‘ఎన్టీఆర్’ రాజకీయం రాజకీయ అధికారం కొన్ని వర్గాల చేతుల్లోనే మిగిలిపోయింది అన్న భావన ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతోంది. ఆ మధ్య జగన్ కృష్ణాజిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతాం అని వ్యాఖ్యానించి నప్పుడు, విపరీతమైన నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో జగన్ పూర్తిగా ఆ ప్రతిపాదనను పక్కన పెట్టవలసివచ్చింది. అసలు రాజధాని కి పేరు ఎన్టీఆర్ అని పెడతారని అప్ప ట్లో ప్రధాన పత్రికల్లో సైతం వార్తలు వచ్చాయి. అయితే రాజధాని ఒక వర్గం చేతిలో ఉండిపోయింది అన్న విమర్శలు రాకూడదని ఉద్దేశంతో చివరికి దాన్ని అమరావతి గా ఖరారు చేశారు. ఇలా ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేయాలనుకున్నప్పుడు ప్రతిసారి అది ఏదో ఒక రకంగా బూమరాంగ్ అవుతోంది. అదీ గాక చంద్రబాబునాయుడుపై 1999 ఎన్నికల తర్వాత, తన పార్టీ ఆఫీసు లన్నింటిలో నుంచి ఎన్టీఆర్ ఫోటో తీసి వేయించాడు అన్న నింద ఉంది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ పేరిట వెయ్యి కోట్లతో స్మారక స్థూపం కట్ట పూనుకోవడం రాజకీయ ప్రయోజనాల కోసమే అయిఉంటుంది అన్న భావన ప్రజల్లో విస్తృతంగా ఉంది. మొత్తం మీద: ఇప్పుడు వెయ్యి కోట్లు పెట్టి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని కట్టించాడని అనుకుందాం. రేపు ఎప్పుడైనా వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా మరొక రెండు వేల కోట్లు పెట్టి రాజశేఖర రెడ్డి విగ్రహం కట్టించవచ్చు. అలాగే భవిష్యత్తులో ఇతర పార్టీలు కూడా వారి రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వేల కోట్లతో విగ్రహ రాజకీయానికి తెర తీయవచ్చు. ఇప్పటికే పూర్తయిన పటేల్ విగ్రహం తో పాటు, అతిపెద్ద చత్రపతి శివాజీ విగ్రహం నిర్మాణంలో ఉంది. అలాగే ఉత్తర ప్రదేశ్ లో రాముడి విగ్రహం, ఇంకొక చోట వినాయకుడి విగ్రహం ప్రతిపాదనలో ఉన్నాయి. గ్రామాలలో సరిగ్గా మరుగుదొడ్ల సదుపాయం కల్పించలేని దేశంలో, తాగునీటి కోసం కిలోమీటర్ల కొద్దీ బాలికలు నడిచి వెళ్లాల్సిన అగత్యాన్ని ఏడు దశాబ్దాల స్వతంత్రం తరువాత కూడా తప్పించ లేక పోయిన దేశంలో, మద్దతు ధర రాలేదని తాము నెలలపాటు పండించిన కూరగాయలను రైతులు నడిరోడ్డు మీద తగలబెడుతున్న దేశంలో- వేలకోట్ల ఖర్చుతో విగ్రహాలు నిర్మించి ఏం ఉద్ధరిద్దామని, ఏం నిరూపిద్దామని తాము తాపత్రయ పడుతున్నామో, పాలకులు ఆత్మ విమర్శ చేసుకోవాలి Quote
Dhevudu2 Posted December 19, 2018 Report Posted December 19, 2018 Good one..please build ntr statue it will be sucide for Telugu dongala party Quote
daddojanam Posted December 19, 2018 Report Posted December 19, 2018 deenamma aa NTR gadu sachinaka kuda sava 10ngthunnadu janalni Quote
snoww Posted December 19, 2018 Report Posted December 19, 2018 ee statue kooda trust money thone build chestham antunnaru. Amaravati my brick ani scheme pedithe evadu ivvale dabbulu. So CBN raised money with government bonds. deeniki istharo ledo choodali. Quote
snoww Posted December 19, 2018 Report Posted December 19, 2018 And dont think project estimate is 1000 crs. It was mentioned 200-300 crs If I remembered correctly. Quote
JAPAN Posted December 19, 2018 Report Posted December 19, 2018 Just now, snoww said: ee statue kooda trust money thone build chestham antunnaru. Amaravati my brick ani scheme pedithe evadu ivvale dabbulu. So CBN raised money with government bonds. deeniki istharo ledo choodali. bricks ik nenu kooda donate cheisna..em chesado endho aa paisal asalu capital construction ki ABN vaadu kontha 10gesindu NTR ki vigraham endhi asalu...aa okka point chalu vodipovataniki Quote
snoww Posted December 19, 2018 Report Posted December 19, 2018 4 minutes ago, JAPAN said: bricks ik nenu kooda donate cheisna..em chesado endho aa paisal asalu capital construction ki ABN vaadu kontha 10gesindu NTR ki vigraham endhi asalu...aa okka point chalu vodipovataniki https://amaravati.gov.in/eBRICKS/Index.aspx 5 CRs vachayee ippati varaku. okka dharma porata deeksha budget ki kooda saripovu aa amount. Quote
JAPAN Posted December 19, 2018 Report Posted December 19, 2018 18 hours ago, snoww said: https://amaravati.gov.in/eBRICKS/Index.aspx 5 CRs vachayee ippati varaku. okka dharma porata deeksha budget ki kooda saripovu aa amount. monna secretariat ki voodipoyina tiles nenichina paisal tho vesinave anukunta..donga sachinodu manchi quality vi kooda konale Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.