snoww Posted December 25, 2018 Report Posted December 25, 2018 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మెళియపుట్టిలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం. ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శ్వేతపత్రాల పేరిట కల్లబొల్లి కబుర్లు చెబుతున్నావు మెళియపుట్టి సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపాటు 20 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులతో నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేశావు.. అప్పుడు ఏమీ చేయలేదెందుకు? ఇప్పుడు 25 మంది ఎంపీలను ఇస్తే చేసేస్తానని జనం చెవిలో పువ్వులు పెడుతున్నావు అప్పుడు కాంగ్రెస్ విలన్.. ఇప్పుడు బీజేపీ విలన్ పోలవరం ప్రాజెక్టుకు ఒకే ఒక్క గేటు పెట్టి కొత్త సినిమా చూపిస్తున్నావు డిజైన్లకు అనుమతి లేదు.. డీపీఆర్ కూడా ఓకే కాలేదు రాజధాని పేరిట 2 ఎకరాల్లో బొమ్మల భవనాలతో మరో సినిమా గత ఎన్నికల నుంచి ఇప్పటి దాకా అవే గ్రాఫిక్స్ రాజకీయాల్లో ఉండడానికి అనర్హుడవు.. వైదొలుగు.. అభివృద్ధి అనేది ఇంట్లో, ఊర్లో, చదువుల్లో, ఆరోగ్యంలో, పొలాల్లో కనిపించాలి.ఉద్యోగాల్లో, సంక్షేమంలో కనిపిస్తే.. దానిని అభివృద్ధి అంటాం. అంతే తప్ప తెల్ల కాగితాల్లో కనిపించేది అభివృద్ధి ఎలా అవుతుంది చంద్రబాబూ? 20 మంది ఎంపీలతో రాష్ట్రానికి మేలు చేయడం చేతకానప్పుడు నీవు రాజకీయాలలో ఉండడానికి అర్హుడవేనా? ఇంటికి గోడలు కట్టకుండా, శ్లాబ్ వేయకుండా ఇంటి ప్రారంభోత్సవానికి పిలిచి భోజనం పెడితే ఆ మనిషిని ఏమంటారు? పిచ్చోడంటారు. లేదా మనల్ని పిచ్చిపట్టించడానికి చేస్తున్నాడంటాం. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టులో అదే చేస్తున్నాడు. 48 గేట్లకు గాను ఒక గేటు పెట్టి ప్రారంభోత్సవం అంటూ మనకు సినిమా చూపిస్తున్నాడు. రాజధాని గురించి మీకు చెప్పనక్కరలేదు. ఇది మరో సినిమా. మీరంతా బాహుబలి సినిమా చూశారా? అందులో రా«జధాని సెట్టింగులు చూశారా? అదే మన రాజధాని కోట. చంద్రబాబు గ్రాఫిక్స్. రాజధాని అంటే బాహుబలి సినిమా చూడండంటాడు. రాజధానిలో శాశ్వత నిర్మాణానికి ఒక్కటంటే ఒక్క ఇటుక వేయలేదు. పర్మినెంటు బిల్డింగ్ ఒక్కటంటే ఒక్కటి కనిపించదు. అంతా టెంపరరీ. తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటేరియట్, తాత్కాలిక అది.. తాత్కాలిక ఇది.. తాత్కాలిక భవనాల సంగతి ఎలా ఉందో తెలుసా? బయట మూడించుల వర్షం పడితే లోపల ఆరించుల వర్షం పడుతుంది చంద్రబాబు పుణ్యాన. రాహుల్ గాంధీ 2015 జులై 23న అనంతపురం వచ్చినప్పుడు ఇదే చంద్రబాబునాయుడు ఏమన్నాడో తెలుసా? ‘ఏముఖం పెట్టుకుని వస్తున్నావు? ఏం చేశారని? ఇంకా బతికున్నామా.. లేమా.. అని చూడటానికా? లేకపోతే పుండు మీద కారం చల్లి పోవాలనా? కష్టాలలో ఉండేది మీవల్లే కదా? కాంగ్రెస్ పార్టీకి సహకరించే వాళ్లనేమనాలి? ఇది న్యాయమేనా? రాష్ట్ర ద్రోహులు కాదా వీరందరూ? రాష్ట్రానికి ఇంత ద్రోహం చేసి మళ్లీ తగుదునమ్మా అంటూ ఇక్కడికి వెక్కిరించడానికి వస్తున్నారా? కాంగ్రెస్‌ను శాశ్వతంగా బాయ్‌కాట్ చేయాలి. అప్పటికి కూడా మన కసి తీరదు. వారిని ఇగ్నోర్ చేయాలి. ఛీ కొట్టాలి. రాష్ట్రంలోకి రాకుండా భూస్థాపితం చేయాలి’ అన్నారు. ఇలాంటి కాంగ్రెస్‌తో ఈ పెద్దమనిషి చంద్రబాబు ఇప్పుడు నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకున్నారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.