snoww Posted December 26, 2018 Report Posted December 26, 2018 రుణమాఫీకి కేంద్రం కసరత్తు! పంట రుణాల రద్దుపై కేంద్రం ఆరా నిధులు ఏ మేరకు కావాలనే అంచనాల తయారీలో తలమునకలు తెలంగాణ వ్యవసాయశాఖ నుంచి వివరాల సేకరణ ఇప్పుడు అమలు చేస్తారా? వచ్చే ఎన్నికల్లో హామీ ఇస్తారా? అన్న అంశమై చర్చ కేంద్రం అమలు చేస్తే తెలంగాణకు రూ.22 వేల కోట్ల ఆదా ఈనాడు, హైదరాబాద్: పంట రుణాల మాఫీ పథకం అమలుచేస్తే ఎలా ఉంటుందనే అంశమై కేంద్రం కసరత్తు చేస్తోందా? స్వల్ప కాలిక పంట రుణాల మాఫీకి ఎంత వ్యయం అవుతుందనే గణాంకాల తయారీలో నిమగ్నమైందా? ఆర్థిక భారంపై లెక్కలు తేలితే ఈ పథకంపై కేంద్రం అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు కన్పిస్తున్నాయా? ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయని సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. మార్చి మొదటి వారంలోపు లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో ఈ లోపే రుణమాఫీని ప్రకటిస్తారా? లేక వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టేందుకే ఈ కసరత్తు జరుగుతోందా? అన్నది తేలాల్సి ఉంది.తాము అధికారంలోకి వస్తే దేశమంతా రుణ మాఫీ అమలు చేస్తామంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఘంటాపథంగా చెబుతుండటం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతోంది. దరిమిలా రుణమాఫీ దిశగా సమాలోచనలు సాగిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే కేంద్ర వ్యవసాయశాఖ తెలంగాణ వ్యవసాయశాఖ నుంచి రుణమాఫీ అమలు పత్రాలన్నీ ఇటీవల తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితిపై ఆరా తెలంగాణ ప్రభుత్వం 2014-17 మధ్య కాలంలో నాలుగు దఫాలుగా రూ.16,300 కోట్లు బ్యాంకులకు విడుదల చేయడం ద్వారా రుణమాఫీ హామీని నెరవేర్చింది. తెలంగాణ ఒక్కటే బ్యాంకులకు పూర్తిగా నిధులు విడుదల చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రకటించారు కూడా. ఈ క్రమంలో తెలంగాణలో మాఫీకి అర్హులైన రైతులను ఎలా గుర్తించారు? వారి ఖాతాల్లో సొమ్ము ఎప్పుడెప్పుడు? ఎంత జమచేశారు? తిరిగి కొత్త రుణాలను ఏ విధంగా ఇచ్చారు? అనే వివరాలను కేంద్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తాజాగా రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథిని అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం వివిధ సమయాల్లో రుణమాఫీకిచ్చిన ఉత్తర్వులు, బ్యాంకుల నివేదికలను సైతం వారు సేకరించారు. రుణమాఫీ అమలుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజంటేషన్‌నూ కేంద్రం తమ నుంచి తీసుకుందని పార్థసారథి ‘ఈనాడు’కు చెప్పారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే రుణమాఫీ దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు భావించవచ్చని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాల ఎదురుచూపులు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాలు వెంటనే రుణమాఫీ అమలుకు ఉత్తర్వులు జారీచేశాయి. ఇందుకు గానూ ఈ మూడు రాష్ట్రాలు రూ.62 వేల కోట్ల మేర తక్షణం బ్యాంకులకు చెల్లించాల్సి ఉంది. తెలంగాణలో సైతం రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామని తెరాస ఈ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ఈ హామీ అమలుకు రూ.22 వేల కోట్లకుపైగా కావాలని ప్రాథమిక అంచనా. కేంద్రం ఒకవేళ దేశవ్యాప్త రుణమాఫీకి ప్రకటన చేస్తే ఈ భారమంతా కేంద్రం భరిస్తుందని, తద్వారా తమకు ఆర్థిక ఉపశమనం లభిస్తుందని తెలంగాణ సహా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎదురుచూస్తుండగా..ఎవరో ఒకరు ఆ హామీ అమలుచేసి తమను గట్టెక్కించాలని అన్నదాతలు కోరుతున్నారు. నేడు రాష్ట్రానికి ఝార్ఖండ్ అధికారులు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా రుణమాఫీ అమలుకు చర్యలు ప్రారంభించాయి. ఝార్ఖండ్ రాష్ట్ర అధికారులు గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. రుణమాఫీపై తెలంగాణలో వీరు అధ్యయనం చేయనున్నారు. Quote
snoww Posted December 26, 2018 Author Report Posted December 26, 2018 Quote తెలంగాణ ఒక్కటే బ్యాంకులకు పూర్తిగా నిధులు విడుదల చేసిందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ప్రకటించారు కూడా. CBN cheyyaleda complete gaa ? TG lo 1 lac waive chesthe AP lo 1.5 lac waive chesam annadu kada CBN Quote
snoww Posted December 26, 2018 Author Report Posted December 26, 2018 Wont be surprised if Center introduces Rythu Bhandhu too. Quote
tom bhayya Posted December 26, 2018 Report Posted December 26, 2018 5 minutes ago, snoww said: Wont be surprised if Center introduces Rythu Bhandhu too. thank you chandra dhora Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.