Jump to content

Anushka Papa as Prostitute


Recommended Posts

Posted

i51598_anushkahot1.jpg

టాలీవుడ్ కుర్రకారు హృదయాలను తన అందంతో కొల్లగొట్టిన సెక్సీ బ్యూటీ అనుష్క వ్యభిచారిణి పాత్రలో నటించనుందని టాలీవుడ్ సినీజనం ఒకటే గుసగసలు పోతున్నారు. అల్లు అర్జున్ తదుపరి చిత్రం "వేదం"లో అనుష్క వ్యభిచారిణి పాత్రలో తొలిసారిగా కనిపించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఛాలెంజింగ్, వెరైటీ పాత్రలంటేనే తనకు చాలా ఇష్టమని అనుష్క ఎవరడిగినా చెపుతుంటుంది. అప్పట్లో అరుంధతి చిత్రంలో కూడా అనుష్క భిన్నమైన పాత్రలో కనిపించి అందరితో శెభాష్ అనిపించుకుంది. కనుక వ్యభిచారిణి పాత్రలో నటించినా ఆశ్చర్యపోనక్కరలేదంటున్నారు టాలీవుడ్ సినీజనం.

కాగా ఈ చిత్రానికి గమ్యం ఫేం దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. శోభు మరియు ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది చివరికి రెడీ అవుతుందంటున్నారు.

×
×
  • Create New...