Jump to content

Recommended Posts

Posted
ప్రధాని మోదీకి చంద్రబాబు సవాల్‌ 

0101amr145a.jpg

అమరావతి: ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు సవాల్‌ విసిరారు. మహాకూటమి విఫలైందని, చంద్రబాబు ఆక్రోశంతో మాట్లాడుతున్నారంటూ ఏఎన్‌ఐతో ముఖాముఖిలో ప్రధాని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ధీటుగా స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీ వల్ల దేశానికి ఏం లాభం జరిగిందో చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. కేంద్రం సాధించిన వృద్ధి రేటు ఏముంది?, నోట్ల రద్దు, జీఎస్టీతో మీరు ఆర్థికాభివృద్ధి ఏం సాధించారు? అని ప్రశ్నించారు. దేశ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మోదీ తీసుకున్న చర్యల వల్ల దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిందని వ్యాఖ్యానించారు. ప్రధాని, భాజపా జాతీయ అధ్యక్షుడు తెలంగాణలో పర్యటించినా గెలిచింది ఒక్క సీటేనన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మిమ్మల్ని ఎన్నెన్ని మాటలు అన్నారో గుర్తులేదా అని మోదీని ప్రశ్నించారు. ప్రజల్ని మోసం చేద్దామని అనుకుంటున్నారు గానీ చేయలేరన్నారు. కేంద్రం అనుసరించిన ఆర్థిక, పాలనాపరమైన విధానాలతో దేశానికి ఎంతో నష్టమన్నారు.

దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఎక్కడుందని చంద్రబాబు ప్రశ్నించారు. మోదీ, జైట్లీ కలిసి ప్రమోట్‌ చేస్తున్నదే ఈ ఫెడరల్‌ ఫ్రంట్‌ అని దుయ్యబట్టారు. వారికి రాజకీయంగా లాభం వస్తుందనే దాన్ని ప్రమోట్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఉంటున్నట్టు చెప్పలేదని, టీఎంసీ చెప్పకపోయినా.. కేంద్రం తప్పుదారి పట్టిస్తోందని మండిపడ్డారు. మహాకూటమి విఫలం కాలేదని, కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం, మోదీ, అరుణ్‌ జైట్లీ విఫలమయ్యారన్నారు. దేశంలో రెండే కూటమిలు ఉన్నాయన్నారు. ఒకటి ఎన్డీయే, దానికి మద్దతు పలుకుతున్న పార్టీలు కాగా, రెండోది కాంగ్రెస్‌, దానికి మద్దతు పలికే పార్టీల కూటమిలేనని వివరించారు.

పవన్‌తో కలిసి పోటీచేస్తే జగన్‌కు బాధేమిటి? 

చంద్రబాబు - పవన్‌ కలిసిపోయారన్న జగన్‌ విమర్శలపై సీఎం స్పందించారు. ఒకవేళ పవన్‌తో కలిసి పోటీచేస్తే జగన్‌కు బాధేమిటని ప్రశ్నించారు. భాజపాతో కలుస్తున్నారో, లేదో జగన్‌ చెప్పాలని నిలదీశారు. పవన్‌ తెదేపాతో కలిసి రాకూడదని జగన్‌ దూషిస్తున్నారని, ఈ మధ్యకాలంలో పవన్‌ను జగన్‌ దూషించడాన్ని తాను విన్నానన్నారు. పవన్‌ తెదేపాతో కలిసి పోటీ చేస్తారా లేదా అనే అంశంపై తాను మాట్లాడబోనన్నారు. ఊహాజనిత అంశాలపై తాను స్పందించనని విలేకర్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు. 

Posted
Quote

 

పవన్‌తో కలిసి పోటీచేస్తే జగన్‌కు బాధేమిటి? 

చంద్రబాబు - పవన్‌ కలిసిపోయారన్న జగన్‌ విమర్శలపై సీఎం స్పందించారు. ఒకవేళ పవన్‌తో కలిసి పోటీచేస్తే జగన్‌కు బాధేమిటని ప్రశ్నించారు.

 

idem twist malli.

PK CBN kalusthaara enti house theesi. 

Posted
9 minutes ago, snoww said:

idem twist malli.

PK CBN kalusthaara enti house theesi. 

 

Posted
7 minutes ago, snoww said:

idem twist malli.

PK CBN kalusthaara enti house theesi. 

Evado okadi support Lekunda cbn intha varaku eppudu kuda elections ki vellaledhu.

1995 - vennupotu episode 

1999 - BJP (Kargil war wave)

2004 - fail 

2009 - Maha Kootami fail

2014 - Modi wave + Pavan craze

2019 - he knows tie up with congress alone will not save him, so he will try for a tie up with pavan till the last minute.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...