snoww Posted January 2, 2019 Report Posted January 2, 2019 నేటి నుంచి ‘జన్మభూమి-మా ఊరు’ ఆరో విడతలో 10రోజుల కార్యక్రమాలు తొలి రోజు కుప్పంలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు ఈనాడు, అమరావతి: గత నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై గ్రామస్థాయిలో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ ఆరో విడత ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రధానంగా రాష్ట్రాభివృద్ధిపై విడుదల చేస్తున్న శ్వేతపత్రాలపై గ్రామసభల్లో చర్చించడంతో పాటు, ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, గ్రామ స్థాయిలో వివిధ పోటీలు నిర్వహించి విజేతలకు పురస్కారాల అందజేత, ఆహారోత్సవాలు, 5కె రన్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు. సమగ్ర గ్రామాభివృద్ధికి సంబంధించిన వ్యూహ ప్రణాళికలను చివరి రోజు విడుదల చేస్తారు. పది రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల్లో భాగంగా సీఎం చంద్రబాబునాయుడు 13 జిల్లాల్లో పర్యటిస్తారు. గ్రామసభల్లో పాల్గొంటారు. మొదటి రోజు చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు. జన్మభూమి ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూములను ఏర్పాటు చేశారు. 13 జిల్లాల్లోని 51 రెవెన్యూ డివిజన్లలో 31 మంది ఐఏఎస్, మరికొందరు కేంద్ర సర్వీసులకు చెందిన అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు. వివిధ శాఖలతో ప్రణాళిక శాఖ సమన్వయం చేసుకుని పర్యవేక్షించనుంది. తేదీల వారీగా చర్చించే అంశాలిలా... * జనవరి 2: వయాడక్ట్ కరపత్రాల ఆవిష్కరణ, రాష్ట్ర పునర్విభజన అంశాలు * జనవరి 3: రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వృద్ధిరేటు * జనవరి 4: 100శాతం రేషన్, ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, చంద్రన్న బీమా, ఉపకారవేతనాలు, గృహ నిర్మాణం, ఆదరణ, అన్న క్యాంటీన్లు, మధ్యాహ్న భోజన పథకం, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు 100యూనిట్ల ఉచిత విద్యుత్తు. * జనవరి 5: రైతు సంక్షేమం, పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి. * జనవరి 6: భూగర్భ జలాలు, జలవనరుల నిర్వహణ, విద్యుత్, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులు, పర్యావరణహిత కార్యక్రమాలు, విద్య, వైద్యం, సూక్ష్మ పోషకాల పంపిణీ. * జనవరి 7: మానవ వనరుల అభివృద్ధి, నైపుణ్యాల వినియోగం, పోషకాహారం, తల్లీబిడ్డ, చిన్నారుల సంరక్షణ. * జనవరి 8: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, గ్రామాల వారీగా స్టార్ రేటింగ్, వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, ఎల్ఈడీ దీపాలు, ఫైబర్‌గ్రిడ్, రహదారుల అనుసంధానం, తాగునీరు, గ్యాస్ కనెక్షన్లు, ఓడీఎఫ్. * జనవరి 9: అమరావతి నిర్మాణం, విద్యుత్, వనరుల అభివృద్ధి, ఓడరేవులు, జలరవాణా, విమానాశ్రయాలు, రహదారుల అభివృద్ధి. * జనవరి 10: పరిశ్రమలు, ఉపాధి, ఐటీ, ఐఈటీఎస్, ఫిన్‌టెక్, పర్యాటకం, తయారీరంగం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి, ముఖ్యమంత్రి యువనేస్తం. * జనవరి 11: సుపరిపాలన, ఆర్టీజీఎస్, ఇ-ప్రగతి, ఇ-గవర్నెర్స్, శాంతిభద్రతలు. జన్మభూమి-మా ఊరుకు రూ.9.75 కోట్లు ఈ నెల 2 నుంచి జరిగే ఆరో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లాకు రూ. 75 లక్షల చొప్పున అదనంగా మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాకు రూ.1 కోటి చొప్పున రూ. 13 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా మరో రూ. 9.75 కోట్లు ఇస్తూ ప్రణాళిక శాఖ కార్యదర్శి సంజయ్‌గుప్తా ఉత్తర్వులిచ్చారు. Quote
snoww Posted January 2, 2019 Author Report Posted January 2, 2019 Quote జన్మభూమి-మా ఊరుకు రూ.9.75 కోట్లు ఈ నెల 2 నుంచి జరిగే ఆరో విడత జన్మభూమి-మా ఊరు కార్యక్రమానికి ప్రభుత్వం జిల్లాకు రూ. 75 లక్షల చొప్పున అదనంగా మంజూరు చేసింది. ఇప్పటికే జిల్లాకు రూ.1 కోటి చొప్పున రూ. 13 కోట్లు విడుదలయ్యాయి. తాజాగా మరో రూ. 9.75 కోట్లు ఇస్తూ ప్రణాళిక శాఖ కార్యదర్శి సంజయ్‌గుప్తా ఉత్తర్వులిచ్చారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.