Jump to content

Telangana : View Your Land Records Online now


Recommended Posts

Posted
ఆన్‌లైన్లో భూముల వివరాలు 

 

సీసీఎల్‌ఏ వెబ్‌సైట్‌లో ప్రత్యేక లింకు 
ఆర్‌వోఆర్‌(1బీ), పహాణీ సమాచారం

4hyd-main4a_2.jpg

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూములకు సంబంధించి తాజా సమాచారం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ (ccla.telangana.gov.in) వెబ్‌సైట్లో సిటిజన్‌ స్టేటస్‌ కింద పేర్కొన్న ‘నో యువర్‌ ల్యాండ్‌ సర్వీస్‌’ను నొక్కగానే http://ccla.telangana.gov.in/landStatus.doఅనే ప్రత్యేక లింకు తెరుచుకుంటుంది. ఇందులో భూముల వివరాల్ని రెవెన్యూశాఖ పొందుపరిచింది. దీనిద్వారా రైతులు, కొనుగోలుదారులకు కనీస సమాచారం లభ్యం కానుంది. సర్వేనంబర్ల వారీగా భూములు, ఖాతా నంబర్ల వారీగా ఆర్‌వోఆర్‌ (1బీ) వివరాలు పొందుపరిచింది. 31 జిల్లాలవారీగా డివిజన్‌, మండలం, గ్రామాల వివరాలు నమోదు చేసి సమాచారం తెలుసుకోవచ్చు. రాష్ట్రంలో ప్రాథమిక సమాచారం కోసం అప్పటివరకు అందుబాటులో ఉన్న ‘మాభూమి’ సేవలు భూరికార్డుల ప్రక్షాళన మొదలైన తరువాత నిలిచిపోయాయి. దీని స్థానంలో సమీకృత ‘ధరణి’ సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. అయితే రెవెన్యూ విభాగానికి మాత్రమే ఈ సాఫ్ట్‌వేర్‌ అందుబాటులో ఉంది. దానిని ప్రజలకు చేరువ చేసేందుకు మరింత సమయం పట్టే అవకాశముంది. ఈ నేపథ్యంలో తొలివిడత ప్రక్షాళన పూర్తయ్యాక సేవా రుసుము చెల్లించి మీసేవ ద్వారా భూముల పహాణీ, 1బీ కాపీలు పొందవచ్చని రెవెన్యూ శాఖ తెలిపింది. దీంతో రైతులు, ప్రజలకు కొంత ఇబ్బంది కలిగింది. తాజాగా సీసీఎల్‌ఏ వెబ్‌సైట్లో వివరాలు లభ్యమవుతుండటంతో ఉచితంగా భూములకు సంబంధించిన వివరాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. 
సీసీఎల్‌ఏ వెబ్‌సైట్లో సమాచారం కేవలం ప్రాథమిక అవగాహనకే పెట్టామని.. మీసేవ ద్వారా అధీకృత పత్రాలు మాత్రమే చెల్లుబాటు అవుతాయని రెవెన్యూశాఖ స్పష్టం చేసింది. 
గతంలోని మాభూమి వెబ్‌సైట్లో హైదరాబాద్‌ పరిసర జిల్లాలకు సంబంధించిన సేత్వార్‌, నక్షా (మ్యాప్‌) వివరాలు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం కేవలం భూముల ప్రాథమిక సమాచారం మాత్రమే ఉంది. 
అభ్యంతరాలతో నిలిచిపోయిన భూముల ప్రక్షాళన జరిగిందా? లేదా? వివరాలు తెలుస్తాయి. సంబంధిత సర్వే నంబరు, ఖాతానంబరు లేకుంటే దరఖాస్తు ఇంకా పరిష్కారం కాలేదని సమాచారం. 
భూరికార్డుల ప్రక్షాళన జరిగినందున కొత్తగా భూములు కొనేవారికి సీసీఎల్‌ఏ సమాచారంతో నిజమైన పట్టాదారులు ఎవరు? హక్కుల విషయంలో న్యాయపరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయో తెలుసుకునే వీలుంది. వివాదాలుంటే ఆ భూముల వివరాలు అందుబాటులో ఉండవు. 
ప్రస్తుత సమాచారం చూసుకుని అందులో ఏమైనా తప్పులుంటే రైతులు, యజమానులు సరిచేసుకునేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించేందుకు వీలు కలుగుతుంది. తద్వారా భూముల రికార్డులను ఎప్పటికప్పుడు వివాదరహితంగా, తప్పులు లేకుండా చూసుకునేందుకు వీలు కలుగుతుంది.

Posted

Good post. khata number or survey number click chesthe side box lo loading ani vastune undi. Dharani website lo future lo motham details pedtara

Posted

Ippudu ee site lo naa peru meedha land ravalante em cheyali

Posted
Just now, TOM_BHAYYA said:

Ippudu ee site lo naa peru meedha land ravalante em cheyali

Land konaali bedharu 

Posted
2 minutes ago, tom bhayya said:

Land konaali bedharu 

Ee chali chaalani jeetham tho kastam bedharu

Posted

Is it still under development? Are the records yet to be updated in this site? Is there any other website where we can check the details of land. Tried dharani but akkada register avvadanike option ledu , direct login adugutunnadu

Posted
2 hours ago, Gudhachari007 said:

LTT

Eddi lanjodka

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...