Jump to content

Recommended Posts

Posted
గ్రామాభివృద్ధి చేయడమే నా తప్పా?
08-01-2019 02:53:59
 
636825128398188754.jpg
  •  ప్రధానికి లోకేశ్‌ ప్రశ్న.. రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు
  •  దొంగబ్బాయితో కలసి కుట్ర.. లోకేశ్‌ మండిపాటు
ముష్టికుంట్ల(తిరువూరు), జనవరి 7: ‘‘ఘనమైన రాజకీయ వారసత్వం గల కుటుంబం నుంచి వచ్చిన నాపై ప్రధాని చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. తాత ఎన్టీఆర్‌ ఆశయ సాధనలో భాగంగా తండ్రి చంద్రబాబు అడుగు జాడల్లో ప్రజా సేవే లక్ష్యంగా రాజకీయాల్లో ప్రవేశించాను. గ్రామాలను అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా? ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ రంగంలో ప్రపంచ మొత్తం ఏపీ వైపు చూసేలా ప్రగతి మార్గంలో పయనింపచేయడమే నేను చేసిన నేరమా?’’ అంటూ మంత్రి లోకేశ్‌ ఆగ్రహంతో ప్రశ్నించారు. కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం ముష్టికుంట్లలో జరిగిన జన్మభూమి గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ‘‘విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రకి ప్రత్యేకహోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ప్రధాని మోదీ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు.
 
అవినీతిపరుల్ని చంకనెక్కించుకొని అభివృద్ధికారకులను లక్ష్యంగా చేసుకొని ఐటీ దాడులు చేయిస్తున్న్డారు. అవినీతిపరుల్ని అరెస్టు చేయాలనుకుంటే ఆయన పక్కనే ఉన్న దొంగబ్బాయిని అరెస్టు చేయాలి. కుల, మత, ప్రాంతాల పేరుతో రాష్ట్రంలో చిచ్చు రగిల్చేందుకు దొంగబ్బాయి ఢిల్లీ పెద్దలతో కలిసి కుట్ర పన్నుతున్నాడు. బీజేపీ నేత సోము వీర్రాజు సీఎం చంద్రబాబుని తెలుగులో తిడితే దాన్ని హిందీలోకి అనువదించుకొని మరీ రాక్షసానందం పొందిన మోదీ కుట్రలు తెలుగువారి ముందు సాగవు’’ అన్నారు.
Posted
Quote

గ్రామాలను అభివృద్ధి చేయడమే నేను చేసిన తప్పా? ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ రంగంలో ప్రపంచ మొత్తం ఏపీ వైపు చూసేలా ప్రగతి మార్గంలో పయనింపచేయడమే నేను చేసిన నేరమా?’’ 

paadu lokam. lokulu kaakulu chinna babu. 

nuvvu pattinchukoku vallani

Posted

Pandlanicche chettuke ralla dhebba ani peddhalu endhuku antaro eeroju ardham avthundhi 

#pathetic old Telugu mother gif plz#

Posted

Vizag Ni Block Chain capital of the world cheyyatam ee nenu chesina thappa ?

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...