Jump to content

Recommended Posts

Posted
అమరావతిలో ‘వెల్‌కం గ్యాలరీ’ 

 

అంకుర ప్రాంతంలో ఏడీపీ ప్రాజెక్టు 
రూ.44 కోట్లతో 50 ఎకరాల్లో నిర్మాణం 
నేడు శంకుస్థాపన చేయనున్న  సీఎం చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌

9ap-main5a_1.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని అంకుర ప్రాంతం (స్టార్టప్‌ ఏరియా)లో ‘వెల్‌కం గ్యాలరీ’ రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టును ఐదు ఎకరాల విస్తీర్ణంలో అమరావతి డెవలప్‌మెంట్‌ పార్ట్‌నర్స్‌ సంస్థ (ఏడీపీ) చేపడుతోంది. దీనికి గురువారం ఉదయం శంకుస్థాపన చేయనున్నారు. రాజధానిలోని లింగాయపాలెం గ్రామం సమీపంలో ఉదయం 9.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. సుమారు రూ.44 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆరు నెలల్లో దీని నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ఏంటీ ప్రాజెక్టు? 
అమరావతిలో 1,691 ఎకరాల్ని స్టార్టప్‌ ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కన్సార్టియంను రాష్ట్ర ప్రభుత్వం స్విస్‌ఛాలెంజ్‌ విధానంలో ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక చేసింది. సింగపూర్‌ సంస్థల కన్సార్టియం, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) కలసి స్టార్టప్‌ ఏరియాని అభివృద్ధి చేయనున్నాయి. ఈ రెండూ కలసి ఏర్పాటు చేసిన సంయుక్త భాగస్వామ్య సంస్థే ఏడీపీ. 1,691 ఎకరాల్ని మూడు దశల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రతిపాదన. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం... ఉత్ప్రేరకాభివృద్ధిగా 50 ఎకరాల్ని మొదట ఏడీపీ అభివృద్ధి చేయాలి. దానిలో భాగంగానే ‘వెల్‌కం గ్యాలరీ’ ప్రాజెక్టుని ఏడీపీ చేపట్టింది. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి కోసం మొదట ఒప్పందం చేసుకున్నప్పుడు వెల్‌కం గ్యాలరీ ప్రాజెక్టు ప్రతిపాదన లేదు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో... మొదట ఐదు ఎకరాల్లో ‘ఫేజ్‌ జీరో’ పేరుతో ఒక ప్రాజెక్టు చేపడతామని సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించింది. దీన్ని ‘వెల్‌కం గ్యాలరీ’గా మార్చారు. భవిష్యత్‌ అవసరాల కోసం 75 వేల చ.అడుగుల నిర్మిత ప్రాంతం గల భవనాన్ని ఇక్కడ నిర్మిస్తారు.

ఏమేం ఉంటాయి? 
‘వెల్‌కం గ్యాలరీ’ అమరావతి గత వైభవానికి, వర్తమానానికి, భవిష్యత్తుకు అద్దం పట్టేలా ఉంటుందని ఏడీపీ చెబుతోంది. దీనిలో ఓ సిటీ గ్యాలరీ, వాణిజ్య ప్రదర్శన కేంద్రం, కన్వెన్షన్‌ హాల్‌, కో-వర్కింగ్‌ ప్లేస్‌ ఉంటాయి.

నేడు జేఐఎస్‌సీ సమావేశం 
ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ సమాచార, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి ఎస్‌.ఈశ్వరన్‌ సారథ్యంలోని జాయింట్‌ ఇంప్లిమెంటేషన్‌ స్టీరింగ్‌ కమిటీ (జేఐఎస్‌సీ) నాలుగో సమావేశం గురువారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఆంధ్రప్రదేశ్‌, సింగపూర్‌ ప్రభుత్వ ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొంటారు.

Posted
Quote

మొదట ఐదు ఎకరాల్లో ‘ఫేజ్‌ జీరో’ పేరుతో ఒక ప్రాజెక్టు చేపడతామని సింగపూర్‌ కన్సార్టియం ప్రతిపాదించింది. 

2020 lo phase -1 antaaru emo @3$%

Posted

Snowww bhaiya.. nuvu edavadaniki vesinaa nuvu vesinanni posts Amaravati gurinchi evaru veyatledu.. thanks for the constant updates!! Keep them coming!!

Posted
4 minutes ago, importantmember said:

Snowww bhaiya.. nuvu edavadaniki vesinaa nuvu vesinanni posts Amaravati gurinchi evaru veyatledu.. thanks for the constant updates!! Keep them coming!!

You are welcome bro.

Naa crying choosi ina Dora ki koncham buddi vachi backward Hyderabad ni koncham Ina develop chesthadu Ani chinna asha bro. 

Posted
5 minutes ago, importantmember said:

Snowww bhaiya.. nuvu edavadaniki vesinaa nuvu vesinanni posts Amaravati gurinchi evaru veyatledu.. thanks for the constant updates!! Keep them coming!!

thanks for your complements..15469058502908362.gif

Posted
  •  
  • నేడే వెల్‌కమ్‌ గ్యాలరీకి శంకుస్థాపన
  • 10-01-2019 03:30:54
 
636826878553871116.jpg
  • అమరావతి స్టార్టప్‌ ఏరియాలో కీలక నిర్మాణం
  •  పాల్గొననున్న సీఎం, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌
  •  5 ఎకరాల్లో 75వేల చ.అ. విస్తీర్ణంతో గ్యాలరీ
అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతి సత్వరాభివృద్ధికి ఉద్దేశించిన స్టార్టప్‌ ఏరియాలో ‘వెల్‌కమ్‌ గ్యాలరీ’కి సీఎం చంద్రబాబు గురువారం శంకుస్థాపన చేయనున్నారు. లింగాయపాలెం వద్ద ఉదయం 9.30 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి కూడా పాల్గొననున్నారు. కృష్ణానదీ తీరాన 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ఏరియాను సింగపూర్‌ కన్సార్షియం, అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) భాగస్వాములుగా ఏర్పాటైన ఏడీపీ (అమరావతి డెవల్‌పమెంట్‌ పార్ట్‌నర్స్‌) 3 దశల్లో అభివృద్ధి చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో అమరావతి సెంట్రల్‌ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌ ద్వారా.. రాజధాని ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన వాతావరణాన్ని సిద్ధం చేయనున్నారు. ఇందులో కనీసం 8 లక్షల చదరపుటడుగుల మేర వాణిజ్య స్థలాన్ని అభివృద్ధి చేయాలని భావించారు. 20 నెలల క్రితమే ఒప్పందం కుదిరింది. ప్రస్తుతం వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణానికి ఏడీపీ సంకల్పించడంతో స్టార్టప్‌ ఏరియా అభివృద్ధి ప్రక్రియ కొద్దినెలల్లో పట్టాలెక్కే అవకాశాలున్నాయి.
 
ఘన చరిత్ర చాటేలా!
కొన్ని శతాబ్దాల క్రితమే ప్రపంచంలో ప్రముఖ ఆధ్యాత్మిక, విద్యా, వ్యాపార, సాంస్కృతిక, రాజకీయ అంశాల్లో ఒకటిగా అమరావతి పేరొందింది. ఆ తర్వాత ప్రాభవం కోల్పోయినప్పటికీ నవ్యాంధ్రప్రదేశ్‌కు రాజధానిగా ప్రకటించిన తర్వాత దశ మారింది. ప్రపంచస్థాయిలో అమరావతిని మళ్లీ అగ్రగామి నగరాల్లో ఒకటిగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో అమరావతి ఘన చరిత్రను, వర్తమానాన్ని, భావి స్వరూపాన్ని ఇక్కడికి విచ్చేసే దేశ విదేశాలకు చెందిన సందర్శకుల కళ్లకు కట్టేలా చూపేందుకు ‘వెల్‌కమ్‌ గ్యాలరీ’ని నిర్మించబోతున్నారు. స్టార్టప్‌ ఏరియాలో క్యాటలిటిక్‌ డెవల్‌పమెంట్‌ జోన్‌ (సత్వరాభివృద్ధికి చోదకశక్తిగా ఉపకరించే ప్రదేశం) ఉన్న 50 ఎకరాల్లోని 5 ఎకరాల్లో ఈ వెల్‌కమ్‌ గ్యాలరీ వస్తుంది. దీని విస్తీర్ణం 75,000 చదరపుటడుగులు.
 
కూచిపూడి, వాస్తుకళ మేళవింపు!
ఈ ప్రాంతంలో జన్మించి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కూచిపూడి నృత్యాన్ని తలపించేలా, వాస్తుకళారీతులకు అద్దం పట్టేలా వెల్‌కమ్‌ గ్యాలరీ నమూనాకు రూపకల్పన చేశారు. సందర్శకులకు ఇది ఒక స్వాగతస్థలిలా ఉండబోతుంది. రాజధాని అభివృద్ధికి దోహదపడే వ్యాపార, సాంస్కృతిక, సామాజిక భాగస్వామ్యాలు కుదిరేందుకు నెలవు కానుంది. ఇందులోని సిటీ గ్యాలరీ, బిజినెస్‌ జోన్‌లో బిజినెస్‌ ఎగ్జిబిషన్‌ ఏరియా, కన్వెన్షన్‌ హాల్‌, కో-వర్కింగ్‌ స్పేస్‌, కమ్యూనిటీ జోన్‌లో మెయిన్‌ కమ్యూనిటీ ప్లాజా, కమ్యూనిటీ యాక్టివేషన్‌ ఏరియా, కమ్యూనిటీ యాక్టివిటీస్‌ హబ్‌ ఉంటాయి. వీటి నిర్మాణంలో పలు ప్రసిద్ధ సంస్థలు పాలుపంచుకోనున్నాయి.
 
 
Posted

arachethilo vaikuntam ani inni rojulu vinnam kani ee nakka gadi valla adi nijame anipistundi. gudal sinchukondi pulkas

Posted
7 hours ago, MiryalgudaMaruthiRao said:

2024 elections time ki ani @bulbul_fruit cheppadu 

annee 5th year lone start chesthunaru mana baabugoru

Posted
14 minutes ago, bulbul_fruit said:

annee 5th year lone start chesthunaru mana baabugoru

Ade modi chesthe malli crying elections kosam doing Ani 

Posted
Just now, snoww said:

Ade modi chesthe malli crying elections kosam doing Ani 

emi chesina LOKA kalyaanam kosame

sandra-mecha1547094070.jpg

Posted

pedha pulka & pappu pulka gallu pichi pichi graphics vadhulthunte, papam slave pulkas antharitho thit lu tintunnaru

 

MagnificentTornAustraliankestrel-size_re

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...