snoww Posted January 11, 2019 Report Posted January 11, 2019 ఐకానిక్ బ్రిడ్జి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు అమరావతి: రాజధాని అమరావతికి తలమానికంగా నిలిచే ఐకానిక్ వంతెన నిర్మాణానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా శనివారం ఈ వంతెనకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. విజయవాడ శివారులోని పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిని అనుసంధానిస్తూ నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెన నిర్మాణాన్ని అమరావతి అభివృద్ధి కార్పోరేషన్ చేపట్టనుంది. 3.2 కిలోమీటర్ల పొడవున కేబుల్ బ్రిడ్జిగా నిర్మాణం చేపట్టనున్న ఐకానిక్ వంతెన కోసం 1387 కోట్ల రూపాయలు వ్యయం కానున్నాయి. ఆరు లేన్లుగా కృష్ణా నదిపై నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెనపై దేశంలోనే అత్యంత ఎత్తైన పైలాన్ కూడా నిర్మించనున్నారు. దీని ఎత్తును 170 మీటర్లుగా నిర్థరించారు. 125 మీటర్ల వెడల్పున నిర్మాణం చేయనున్న ఈ ఐకానిక్ వంతెనలో ఇరువైపులా 2.5 మీటర్ల ఫుట్ పాత్ను కూడా నిర్మిస్తున్నారు. పవిత్ర సంగమ ప్రాంతం నుంచి అమరావతిలోని తాళ్లాయపాలెం, రాయపూడి వద్ద ఈ వంతెన నిర్మాణం కోసం నదిలో 40 నుంచి 50 మీటర్ల లోతున పైల్స్ ను నిర్మించనున్నారు. అదే సమయంలో 4వ నెంబరు జాతీయ జలమార్గంలో కార్గో రవాణా కోసం వీలుగా ఈ వంతెన నిర్మితం కానుంది. ఈ వంతెన నిర్మాణంతో హైదరాబాద్, జగదల్ పూర్లకు వెళ్లే మార్గం 40 మీటర్ల దూరం తగ్గనుంది. ప్రయాణికులు, రవాణాకు రెండు గంటల సమయం ఆదా కానుంది. అటు విజయవాడ ట్రాఫిక్ భారం కూడా ఈ వంతెన కారణంగా తగ్గిపోనుందని అంచనా వేస్తున్నారు. మొత్తం రెండేళ్లలో నిర్మించనున్న ఈ ఐకానిక్ వంతెన నిర్మాణ బాధ్యతను ఎల్ అండ్ టీ సంస్థకు అప్పగించారు. వంతెన నిర్మాణం కోసం నదిలో దాదాపు 36 పిల్లర్లను వేయనున్నారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని రింగ్ రోడ్డు వద్ద జాతీయ రహదారికి ఈ వంతెనను అనుసంధానం చేసేలా నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈ వంతెన నిర్మాణాన్ని అమరావతి డెవలప్మెంట్ కార్పోరేషన్ పర్యవేక్షించనుంది. Quote
snoww Posted January 11, 2019 Author Report Posted January 11, 2019 world's tallest ani kooda antey poyedi kada. evadu ina check chesthada paada. Quote
Piracy Raja Posted January 11, 2019 Report Posted January 11, 2019 ఈ వంతెన నిర్మాణంతో హైదరాబాద్, జగదల్ పూర్లకు వెళ్లే మార్గం 40 మీటర్ల దూరం తగ్గనుంది. ప్రయాణికులు, రవాణాకు రెండు గంటల సమయం ఆదా కానుంది. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.