Jump to content

Govt shutdown valla America poragallu porilaku pelli lu kuda kavadam ledhi.... Eenadu


Recommended Posts

Posted

ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం
వారానికి రూ.8,400 కోట్లు ఆవిరి
వేతనాల్లేక ఫెడరల్‌ ఉద్యోగుల ఇక్కట్లు
పూట గడవడానికి టీవీలు అమ్ముకుంటున్న దీనస్థితి
విమానాశ్రయాల భద్రతకు పొంచి ఉన్న ముప్పు

వాషింగ్టన్‌: సరిహద్దు గోడ గొడవ అగ్రరాజ్యం అమెరికాకు ఇప్పుడు పెద్ద తలనొప్పిగా మారింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేస్తోంది. ప్రభుత్వ పాక్షిక షట్‌డౌన్‌ ప్రభావం కేవలం ఉద్యోగులకు పరిమితం కావడం లేదు. దేశవ్యాప్తంగా ఆర్థిక, రవాణా, భద్రత, వ్యవసాయం వంటి అన్ని రంగాలను తాకుతోంది.

అమెరికాలో ప్రభుత్వం మూతపడటం ఇదే తొలిసారి కాదు. 1976 నుంచి ఇప్పటివరకు 21 సార్లు ఇలా జరిగింది. సుదీర్ఘకాలం కొనసాగిన షట్‌డౌన్‌ మాత్రం ఇదే. గతంలోనూ ప్రభుత్వం మూతపడినప్పుడు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది. మునుపటితో పోలిస్తే ఈ దఫా మాత్రం ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటోందని ఆర్థికరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గోడ సొమ్ము 5 వారాల్లో ఆవిరి!
షట్‌డౌన్‌ కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి వారానికి సుమారు రూ.8,400 కోట్ల సంపద ఆవిరవుతోందన్నది ఆర్థిక రంగ నిపుణుల అంచనా. ప్రభుత్వం మూతపడి ఇప్పటికే మూడు వారాలవుతోంది. అంటే రూ.25,200 కోట్లు నష్టపోవాల్సి వచ్చిందన్నమాట. మరో రెండు వారాలు పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ లెక్క రూ.42 వేలకోట్లకు చేరుతుంది. గోడ నిర్మాణం కోసం ట్రంప్‌ డిమాండ్‌ చేస్తున్న నిధుల కంటే ఇలా 5 వారాల్లో నష్టపోతున్న మొత్తం ఎక్కువ కావడం గమనార్హం.

అక్రమ వలసలను అడ్డుకునేందుకుగాను మెక్సికోతో సరిహద్దుల్లో గోడ నిర్మాణం అత్యావశ్యకమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నొక్కిచెప్తున్నారు. అందుకోసం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అందుకు కాంగ్రెస్‌ ససేమిరా అనడం, గోడకు నిధులు కేటాయించని బడ్జెట్‌ను తాను ఆమోదించబోనని ట్రంప్‌ భీష్మించుకొని కూర్చోవడం కారణంగా గత నెల 22 నుంచి పలు ప్రభుత్వ విభాగాలకు నిధులు నిలిచిపోయాయి. ప్రభుత్వం పాక్షికంగా మూతపడింది.

అమెరికా విమానాశ్రయాల్లో ప్రయాణికులను తనిఖీ చేసే ‘ట్రాన్స్‌పోర్టేషన్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌(టీఎస్‌ఏ)’ ప్రభుత్వ విభాగమే. వేతనాల చెల్లింపు లేకపోవడంతో టీఎస్‌ఏ ఉద్యోగులు చాలామంది విధులకు గైర్హాజరవుతున్నారు. దీంతో విమానాశ్రయాల్లో తనిఖీలు ఆలస్యమవుతున్నాయి. ప్రయాణికులు గంటలకొద్దీ వేచి ఉండాల్సి వస్తోంది. సిబ్బంది కొరతతో తనిఖీలు తూతూమంత్రంగా సాగే అవకాశముందని.. ఫలితంగా విమానాశ్రయాల భద్రతకు ముప్పు ఏర్పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

పరిశోధనలకు బ్రేక్‌

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’, జాతీయ మహాసముద్ర-వాతావరణ పరిశోధన సంస్థ(ఎన్‌వోఏఏ) వంటి కీలక సంస్థల్లో పరిశోధనలు నిలిచిపోయాయి. శాస్త్రవేత్తలెవరూ సదస్సులకు హాజరవ్వడం లేదు. పరిశోధనలకు నిధులు సమకూర్చే నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్‌ ప్రస్తుతం తమకు అందుతున్న ప్రతిపాదనలను పరిశీలించడం లేదు.

పర్యాటక రంగం కుదేలు

అమెరికాలో పర్యాటక రంగానికి ప్రముఖ స్థానముంది. దేశవ్యాప్తంగా 400 జాతీయ పార్కుల ద్వారా ఖజానాకు రోజుకు 18 మిలియన్‌ డాలర్లు అందేవి. షట్‌డౌన్‌ కారణంగా జనం పార్కులకు వెళ్లట్లేదు. వాటిలో చాలారకాల సేవలు నిలిచిపోయాయి.

ఇంట్లో సామగ్రి అమ్ముకుంటున్నారు

ఫెడరల్‌ ఉద్యోగులు అద్దె, తాకట్టు చెల్లింపులు, గృహరుణాల కింద నెలనెలా చెల్లించాల్సిన మొత్తం విలువ 438 మిలియన్‌ డాలర్ల వరకు ఉంటుందని స్థిరాస్తి సంస్థ ‘జిలో’ అంచనా వేసింది. వేతనాలు అందకపోవడంతో ఈ మొత్తాన్ని వారు చెల్లించే అవకాశాలు దాదాపు శూన్యం! ఫెడరల్‌ ఉద్యోగుల్లో 20 శాతంమంది వాషింగ్టన్‌ డి.సి ప్రాంతంలోనే ఉంటారు. ప్రస్తుతం అక్కడి రెస్టారెంట్లు కస్టమర్లు లేక బోసిపోతున్నాయి. టాక్సీలు రోడ్డెక్కడం లేదు. ఎప్పుడూ రద్దీగా ఉండే రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. చాలామంది ఉద్యోగులు పూట గడవడం కోసం ఇంట్లోని సామాన్లను అమ్ముకుంటున్నారు. టీవీలు, టైర్లు, ఖరీదైన జాకెట్ల వంటి వస్తువులను విక్రయానికి ఉంచుతుండటం వారి దీనస్థితికి అద్దం పడుతోంది.

పరిహారం అందని రైతులు

చైనాతో ట్రంప్‌ వాణిజ్య యుద్ధం కారణంగా ఇప్పటికే అమెరికాలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. షట్‌డౌన్‌తో మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లయింది వారి పరిస్థితి. సోయాబీన్‌ ధరల అనూహ్య పతనం కారణంగా నష్టపోతున్న రైతులకు పరిహారం ఇస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం పరిహారాన్ని ఆపేశారు. విత్తనాలు, పశువుల దాణా కొనుగోలుకు ప్రభుత్వ రుణాలు నిలిచిపోయాయి.

పెళ్లిళ్లూ ఆగిపోయాయ్‌

షట్‌డౌన్‌ ప్రభావం పెళ్లిళ్లపై కూడా పడింది. రిజిస్ట్రేషన్‌ సేవలు నిలిచిపోవడంతో చాలామంది వివాహాలను వాయిదా వేసుకున్నారు. మరికొంతమంది మాత్రం ముందుగా నిర్ణయించుకున్న తేదీల్లో వివాహ వేడుకలు జరుపుకొంటున్నారు. ప్రభుత్వ సేవలు పునఃప్రారంభమైన తర్వాత వివాహాలను చట్టప్రకారం నమోదు చేసుకుంటామని చెబుతున్నారు. వాషింగ్టన్‌ డి.సి మేయర్‌ మురియెల్‌ బౌసర్‌ పెళ్లిళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకుగాను వాటి నమోదుకు వీలుకల్పిస్తూ శుక్రవారం అత్యవసర ఆదేశాలు జారీ చేశారు.

 

 

Posted
Quote

టీవీలు, టైర్లు, ఖరీదైన జాకెట్ల వంటి వస్తువులను విక్రయానికి ఉంచుతుండటం వారి దీనస్థితికి అద్దం పడుతోంది.

tires ammukoni car ni em chesukuntaaru sFun_duh2

Posted
2 minutes ago, snoww said:

tires ammukoni car ni em chesukuntaaru sFun_duh2

nallollu ekkado lepsina car tires ammnukuntaru emo...😀

Posted
3 minutes ago, snoww said:

tires ammukoni car ni em chesukuntaaru sFun_duh2

eenadu you no

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...