trent Posted January 17, 2019 Report Posted January 17, 2019 మన దేశంలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు తమ ఆచారాలు, సంప్రదాయాలకు అనుగుణంగా దైవం కోసం ఉపవాసం చేస్తుంటారు. దాంతో పుణ్యం వస్తుందని విశ్వసిస్తారు. అయితే పుణ్యం మాట అటుంచితే ఉపవాసం వల్ల మనకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని సైంటిస్టులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ (యూసీఐ) పరిశోధకులు ఇటీవలే ఎలుకలపై పరిశోధనలు చేశారు. 24 గంటల పాటు కొన్ని ఎలుకలకు ఎలాంటి ఆహారం ఇవ్వకుండా ఉపవాసం ఉంచారు. అనంతరం వాటికి ఆహారం ఇచ్చారు. ఈ క్రమంలో వారి పరిశోధనలో తేలిందేమిటంటే... ఉపవాసం ఉన్న ఎలుకల్లో ఆక్సిజన్ తీసుకోవడం, శ్వాస ప్రక్రియ, శక్తి ఖర్చవడం వంటి క్రియలు క్రమబద్దీకరింపబడ్డాయని నిర్దారించారు. ఈ క్రమంలో వచ్చిన ఫలితాలను బట్టి సైంటిస్టులు చెబుతున్న విషయం ఏమిటంటే.. మనుషులు కూడా ఉపవాసం చేస్తే మెటబాలిజం సరిగ్గా ఉంటుందని, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, ముఖ్యంగా వయస్సు మీద పడడం కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు ఉపవాసం ద్వారా చెక్ పెట్టవచ్చని వారు చెబుతున్నారు..! Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.