Jump to content

Recommended Posts

Posted
దీదీ తేనీటి విందు.. అంతా తానై పర్యవేక్షించిన చంద్రబాబు 
19-01-2019 22:33:28
 
636835343017351794.jpg
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (దీదీ) ఆధ్వర్యంలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేసేందుకు ఉద్దేశించి శనివారం రోజున ‘యునైటెడ్ ఇండియా ర్యాలీ’ని నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ర్యాలీకి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల అధినేతలు, ముఖ్యనేతలు హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. మరీముఖ్యంగా ముందుగా అనుకున్నదానికంటే భారీ ఎత్తున ప్రజలు, కార్యకర్తలు ఈ కార్యక్రమానికి తరలిరావడం గమనార్హం. ర్యాలీ అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రముఖులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీని టార్గెట్ చేస్తూ దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.
 
 
 అంతా తానై..
కోల్‌కతాలో సభ ముగిసిన అనంతరం.. ప్రభుత్వ అతిథి గృహంలో వివిధ పార్టీల నేతలకు సీఎం మమతా బెనర్జీ తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు అంతా తానై స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబే పర్యవేక్షించడం విశేషం. భారీ ర్యాలీలో, బహిరంగ సభలో.. చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే వక్తలు తమ ప్రసంగాల్లో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడం ఆయన దక్కిన గౌరవమనే చెప్పుకోవచ్చు. భిన్న పార్టీలను ఏకం కావడంతో చంద్రబాబు భూమికను నేతలు అభినందించారు.
 
 
సభలో బాబు స్పీచ్ హైలైట్స్..!
రాష్ట్రాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. కర్ణాటకలోనూ ఎన్నికైన ప్రభుత్వాన్ని కుప్పగూల్చే ప్రయత్నాలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే కేంద్రం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బాబు ఈ సందర్భంగా హెచ్చరించారు. కర్ణాటకలో ఎమ్మెల్యేలను జంతువుల్లా కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెడుతున్నారని, విభజన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. సీబీఐ, ఆర్బీఐ, న్యాయవ్యవస్థ నుంచి ప్రతి వ్యవస్థను కేంద్రం నీరుగారుస్తోందన్నారు. 2019లో కొత్త ప్రభుత్వాన్ని చూడబోతున్నామని జోస్యం చెప్పారు. మోదీ, అమిత్‌షాలను కోరుకుంటున్నారా? మార్పు కోరుకుంటున్నారా? అని ప్రజలను బాబు ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మమతా బెనర్జీ విక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడం ప్రశంసనీయమని అన్నారు.
 
 
అమరావతి చేరుకున్న బాబు..
కోల్‌కతాలో టీఎంసీ మెగా ర్యాలీని ముగించుకున్న చంద్రబాబు అమరావతి చేరుకున్నారు. కాగా.. త్వరలో అమరావతిలో టీడీపీ నిర్వహించనున్న ధర్మపోరాట సభకు ‘యునైటెడ్ ఇండియా ర్యాలీ’ కి హాజరైన నేతలందర్నీ చంద్రబాబు ఆహ్వానించినట్టు తెలుస్తోంది.
  • Replies 31
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    7

  • reality

    5

  • Idassamed

    3

  • RaaoSaab

    3

Top Posters In This Topic

Posted
Quote

భారీ ర్యాలీలో, బహిరంగ సభలో.. చంద్రబాబు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇదిలా ఉంటే వక్తలు తమ ప్రసంగాల్లో చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించడం ఆయన దక్కిన గౌరవమనే చెప్పుకోవచ్చు. భిన్న పార్టీలను ఏకం కావడంతో చంద్రబాబు భూమికను నేతలు అభినందించారు.

idi raa elevation antey. ABN reporters ki movies ki manchi scope vundi script writers gaa

bl@st

Posted
Quote

కర్ణాటకలో ఎమ్మెల్యేలను జంతువుల్లా కొనుగోలు చేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. 

LOL @3$%

Posted
1 hour ago, snoww said:

తేనీటి విందు.. అంతా తానై

Tea cupulu kadigada 

Posted
Just now, reality said:

Lol Dramjoji giving relentless BJ to Nakka

idi ABN article. 

dramoji ki thatha ABN RK elevations ivvatam lo CBN ki 

Posted
1 minute ago, MuPaGuNa said:

sendraal saar pappu gaadu bathroom ki poyi water kottakunta(thatha gaari nundi vachindanuko) vachaka poyademo....

@3$%

Posted
1 minute ago, snoww said:

idi ABN article. 

dramoji ki thatha ABN RK elevations ivvatam lo CBN ki 

Dondhu dondhe... RK gadu konchem nasty BJist...

Posted

Nice..offshore recruits doing their job and  showing some good results bl@st

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...