Raithu_bidda2 Posted January 23, 2019 Report Posted January 23, 2019 ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత - వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి సర్వత్రా మద్దతు పెరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించి ఆయన ముఖ్యమంత్రి పీఠమెక్కాలని ఏపీ ప్రజలే కాదు.. విదేశాల్లోని తెలుగు ప్రజలూ ఆకాంక్షిస్తున్నారు. తాజాగా జగన్ 3647 కిలోమీటర్ల మేర ప్రజా సంకల్ప యాత్ర ముగించుకొని జోష్ మీద ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతు తెలుపుతూ షికాగోలో తెలుగు ఎన్నారైలు ఈ నెల 19న సమావేశం ఏర్పాటుచేశారు. షికాగోతోపాటు విస్కాన్సిన్ డెట్రాయిట్ ఇండియానా వంటి రాష్ట్రాల నుంచి 150 మందికిపైగా ఎన్నారైలు ఈ సమావేశానికి హాజరయ్యారు. జగన్ కు మద్దతు ప్రకటించారు. వైసీపీ సీనియర్ నేతలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి రాయచోటి ఎమ్మెల్యే గట్టు శ్రీకాంత్ రెడ్డి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం జిల్లా పార్టీ ఇంఛార్జి నజీమ్ అహ్మద్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజా రెడ్డి నదికొట్కూరు ఎమ్మెల్యే ఇసయ్య తదితరులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా షికాగో సమావేశంలో ప్రసంగించారు. వైసీపీ అభిమానులకు దిశానిర్దేశం చేశారు. చంద్రబాబు పాలనలో ఐదేళ్లుగా ప్రజలు పడుతున్న కష్టాలను పాదయాత్రలో భాగంగా జగన్ తెలుసుకున్నారు. రాష్ట్రం నలుమూలల్లో ప్రజలతో మమేకమయ్యారు. ఈ విషయాన్ని సమావేశంలో అందరూ ప్రస్తావించారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సేవలను గుర్తుచేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పేదరికం నిర్మూలన కోసం కులమత బేధాలన రూపుమాపడం కోసం వైఎస్ చేసిన కృషిని ప్రశంసించారు. ఆయన ప్రవేశఫెట్టిన పథకాలనే నేటి పాలకులు పేర్లు మార్చి అమలు చేస్తున్న సంగతిని గుర్తుచేశారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనలో ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు చేరడం లేదు. జన్మభూమి కమిటీలతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎల్లో మీడియా ద్వారా చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ తమ పథకాలపై అనుచిత రీతిలో ప్రచారం చేసుకుంటున్నారు. వాటిని ప్రజా సంక్షేమ కార్యక్రమాలుగా చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ప్రజా సంకల్ప యాత్రలో జగన్ దృష్టికి వచ్చిన సంగతిని షికాగో సమావేశంలో చర్చించారు. జగన్ సీఎం పీఠమెక్కి రాజన్న పాలనను తిరిగి తీసుకురావాలన్నదే తమ ఆకాంక్ష అని అందరూ తెలిపారు. ఎల్లో మీడియా చంద్రబాబు ప్రభుత్వానికి ఎంతగా డప్పు వాయించినా అసలు వాస్తవాలేమిటో ప్రజలకు తెలుసునని సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వారే టీడీపీకి ఎల్లో మీడియాకు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. ప్రజాధనాన్ని రక్షించగల అవినీతిని నిర్మూలించగల జగన్ కే వారు పట్టం కడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. సమావేశం నాడు షికాగోలో ఉష్ణోగ్రత - 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. మంచు భారీగా కురిసింది. రోడ్డుపై రెండు అడుగుల మేర మంచు పేరుకుపోయింది. ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఏమాత్రం లెక్కచేయకుండా వైసీపీ మద్దతుదారులు తాజా సమవేశంలో పాల్గొన్నారు. జగన్ సీఎం కావాలన్న వారి బలమైన ఆకాంక్షకు ఇదే నిదర్శనమని అంతా చెప్పుకుంటున్నారు. సమావేశాన్ని ఏర్పాటుచేసిన మిడ్-వెస్ట్ ఇంఛార్జి ఆర్.వి.రెడ్డి షికాగో ఎన్నారై వైసీపీ కోర్ ఆర్గనైజర్లు కె.కె.రెడ్డి రాంభూపాల్ రెడ్డి కందుల శరత్ యెట్టప్పు పరమేశ్వర్ యెరసాని రమాకాంత్ జొన్నల తదితరులకు వైసీపీ అభిమానులు ధన్యవాదాలు తెలియజేశారు. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.