Raithu_bidda2 Posted January 26, 2019 Report Posted January 26, 2019 ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘చంద్రోదయం’. పి. వెంకటరమణ దర్శకత్వంలో మోహన శ్రీజ సినిమాస్ అండ్ శ్వేతార్క గణపతి ఎంటర్‌ప్రైజెస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది . ఇప్పటికే రాంగోపాల్ వర్మ వెన్నుపోటు పాటకు వ్యతిరేకంగా రిలీజ్ చేసిన పాటతో సంచలనం సృష్టించిన దర్శకుడు పి. వెంకటరమణ చిత్ర విశేషాలను వెల్లడిస్తూ ‘‘చంద్రబాబు నాయుడు భారతదేశం గర్వించతగ్గ నాయకుడని, అపారమైన తన మేథా సంపత్తితో ఆంధ్రప్రదేశ్‌ని అగ్ర పథాన నిలిపాడని, 68 ఏళ్ల వయసులోనూ తెలుగు ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నాడని అందుకే అలాంటి మహానుభావుడి కష్టం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్ళకు తెలియజేయడానికే ఈ చంద్రోదయం చిత్రాన్ని రూపొందిస్తున్నాము..’’అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు బయోపిక్ ఎందుకు తీస్తున్నావని అడిగే వాళ్లకు మా చంద్రోదయం సరైన సమాధానం చెబుతుందని, ఈ చిత్ర ఆడియో వేడుకను ఈనెల 31న నిర్వహించనున్నామన్నారు. చిత్ర నిర్మాత జి.జె. రాజేంద్ర మాట్లాడుతూ..‘‘చంద్రబాబునాయుడి బయోపిక్ తీసే అదృష్టం నాకు దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. డిజిటలైజేషన్ వర్క్ కంప్లీట్ అయ్యాక త్వరలోనే సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసి సినిమాని విడుదల చేస్తాము..’’ అన్నారు. వినోద్ నువ్వుల, శివానీ చౌదరి, మౌనిక, భాస్కర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి డిఓపి: కార్తీక్ ముకుందన్, సంగీతం: రాజ్ కిరణ్, పి.ఆర్, మార్కెటింగ్: వంశీ చలమలశెట్టి, నిర్మాత: జి.జె.రాజేంద్ర, దర్శకత్వం: పి.వెంకటరమణ. Quote
JambaKrantu Posted January 26, 2019 Report Posted January 26, 2019 Vibrators ready emo pulkas inka orgasme orgasm.. Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.