Jump to content

Ajay aka KTR- enni crores tintarura family pack la


Recommended Posts

Posted
 
636843269769623911.jpg
  • అమెరికా పర్యటనకు వెళ్లిన హెచ్‌ఎండీఏ కమిషనర్‌
  • సోమవారం తిరుగు ప్రయాణంలో ఉండగానే వేటు
  • పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగులో.. కోకాపేట భూములే కారణం?
  • 4 వేల కోట్ల భూములపై ఒత్తిళ్లకు తలొగ్గనందుకేనా?
హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కమిషనర్‌ బి.జనార్దన్‌ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. సోమవారం రాత్రి 7.30 గంటలకు ఆయన హైదరాబాద్‌లో అడుగు పెట్టారు. కానీ, సోమవారం మధ్యాహ్నమే ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ జీవో 229 జారీ చేసింది. పోస్టింగ్‌ ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని జీవోలో సర్కారు ఆదేశించింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్‌కు అదనపు బాధ్యతలు అప్పగించింది. సాధారణంగా విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఉన్నతాధికారులను బదిలీ చేయరు. కానీ, నిజాయతీపరుడు, కష్టపడి పని చేస్తారనే పేరున్న జనార్దన్‌ రెడ్డిని తప్పిస్తూ విదేశీ పర్యటన నుంచి తిరిగి వస్తున్న కొద్ది గంటల ముందు ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. సమస్యలున్న సంస్థలకు ట్రబుల్‌ షూటర్‌గా పంపిన ప్రభుత్వం.. ఇప్పుడు ఆయనను పక్కన పెట్టిందా అన్న ప్రచారం జరుగుతోంది.
 
 
నిజాయతీపరుడిగా పేరున్న జనార్దన్‌ రెడ్డిని ఎందుకు అకస్మాత్తుగా తప్పించారు...? సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్‌ చేయాలని పేర్కొనడంలో ఆంతర్యమేంటి..? అన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. జనార్దన్‌ రెడ్డిపై వేటు వేశారని కొందరు చెబుతుంటే.. కీలక బాధ్యతలు అప్పగించేందుకే ఈ బదిలీ అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. నిజానికి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్న జనార్దన్‌ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఆగస్టు 24వ తేదీన హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన బాధ్యతలు స్వీకరించి సరిగ్గా ఐదు నెలల మూడు రోజులు! అంతలోనే ఆయనకు స్థానచలనం కలిగింది. కోకాపేట భూముల కేటాయింపు వివాదమే ఆయన బదిలీకి కారణమనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. ప్రస్తుతం రూ.4000 కోట్లకుపైగా విలువైన భూములను అందులో సగం ధరకే చేజిక్కించుకునేందుకు కొందరు పెద్దలు స్కెచ్‌ వేశారని, వారి ఒత్తిళ్లకు తలొగ్గకపోవడం వల్లే జనార్దన్‌ రెడ్డిని బదిలీ చేశారని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు.
 
 
ఏమిటీ కోకాపేట వివాదం!?
కోకాపేటలోని 623 ఎకరాల భూమిని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం హెచ్‌ఎండీఏకు అప్పగించింది. నిధుల సమీకరణలో భాగంగా ఆ భూములను ప్లాట్లుగా విభజించి వేలంలో విక్రయించాలని నిర్ణయించింది. 2006-08 మధ్య కాలంలో 166 ఎకరాలను హెచ్‌ఎండీఏ వేలం వేసింది. వేలంలో ఎకరం రూ.5.50 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ధర పలికింది. మొత్తం భూములను రూ.1,775 కోట్లకు కొనుగోలు చేసేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. వేలం సందర్భంగా ఈఎండీతోపాటు మొదటి, రెండో కిస్తు కింద రూ.687 కోట్లను చెల్లించాయి.
 
 
వివాదం మొదలు..
వేలం వేసిన భూముల కేటాయింపునకు ముందే ఆ భూములు తనవంటూ కేఎస్‌బీ అలీ అనే వ్యక్తి కోర్టులో కేసు వేశారు. కోకాపేట భూములు వివాదాస్పదం కావడం.. వివాదం కాస్తా కోర్టుకు చేరడం.. హైకోర్టులో కేసు పెండింగులో పడడంతో కొనుగోలుదారులు కూడా కోర్టుకెక్కారు. వేలం సందర్భంగా కట్టిన ఈఎండీ, కిస్తీలను తిరిగి తమకు ఇప్పించాలని హైకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన న్యాయస్థానం.. ఏడాదికి తొమ్మిది శాతం చొప్పున వడ్డీ లెక్కకట్టి వారు చెల్లించిన రుసుమును తిరిగి ఇవ్వాలని 2010లో ఆదేశించింది. దీనిపై హెచ్‌ఎండీఏ డివిజన్‌ బెంచ్‌లో అప్పీల్‌ చేసింది. రెండేళ్ల విచారణ తర్వాత 2012లో హెచ్‌ఎండీఏకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
 
 
మలుపులే మలుపులు
కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో కొనుగోలుదారులకు హెచ్‌ఎండీఏ నోటీసులు పంపింది. మిగిలిన మొత్తం చెల్లిస్తే భూములు కేటాయిస్తామని 2013లో స్పష్టం చేసింది. అదే సమయంలో, ఆ భూములపై యాజమాన్య హక్కులు పూర్తిగా హెచ్‌ఎండీఏవే అని హైకోర్టు స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు అలీ వేసిన పిటిషన్‌పై ఆదేశాలు ఇచ్చింది. దీనిపై అలీ ధర్మాసనంలో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేయడంతో కోర్టు స్టేటస్‌ కో ఆదేశాలు ఇచ్చింది. కోర్టు వివాదాలు ఎంతకూ తెగకపోవడం.. ప్రభుత్వానికి తాము కోట్లు చెల్లించడం.. వాటికి వడ్డీలు పెరిగిపోతుండడంతో కొనుగోలుదారులు ఈసారి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాము చెల్లించిన డబ్బులు తిరిగి ఇప్పించాలని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ వేశారు. తాము చెల్లించిన డబ్బులు వడ్డీతో సహా ఇవ్వాలని కొందరు కోరగా.. తాము చెల్లించిన మొత్తానికి అప్పటి ధర ప్రకారం సమానమైన భూమిని ఇవ్వాలని మరికొందరు పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంకొందరు.. అప్పటి ధర ప్రకారమే తాము వేలంలో దక్కించుకున్న భూమి మొత్తం కేటాయించాలని కోరారు. దీనిపై హెచ్‌ఎండీఏ సుప్రీం కోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇప్పటికే కొనుగోలుదారులు చెల్లించిన డబ్బులకు ప్రో-రేటా ప్రకారం పాత ధరకే భూమి కేటాయిస్తామని, మిగతా భూమి కావాలంటే ప్రస్తుత ధరను పరిగణనలోకి తీసుకుని కేటాయిస్తామని అందులో పేర్కొన్నట్టు సమాచారం. దీనిపై తీర్పును సుప్రీం వాయిదా వేసింది.
 
 
ఒత్తిళ్లకు తలొగ్గనందుకా...?
కోకాపేట భూములపై పెద్దల కన్ను పడింది. పాత ధర ప్రకారమే మొత్తం భూమిని కాజేసేందుకు కీలక వ్యక్తులు రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. అప్పటి కొనుగోలుదారులను ముందు పెట్టి భూమిని దక్కించుకునేందుకు వారు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ఈ క్రమంలో పాత ధర ప్రకారమే 166 ఎకరాలను కేటాయించాలని ఉన్నత స్థాయిలో ఒత్తిడి చేసినట్టు చెబుతున్నారు. గతంలో డబ్బులు చెల్లించాలని కోరిన కొనుగోలుదారులు కూడా ఇప్పుడు భూమినే కేటాయించాలని పట్టుబట్టినట్లు తెలిసింది. ఇందుకు కారణం భూమి విలువ భారీగా పెరగడమే. అప్పట్లో రూ.5.50 కోట్ల నుంచి రూ.13 కోట్లు పలికిన ఎకరం ధర ఇప్పుడు రూ.20-25 కోట్లకు పెరిగింది.
 
 
ప్రస్తుత ధర ప్రకారం వేలం వేసిన 166 ఎకరాల విలువ సుమారు రూ.4 వేల కోట్ల వరకు ఉంటుంది. అదే పాత ధరను పరిగణనలోకి తీసుకుంటే ఆ మొత్తం రూ.1,775 కోట్లు మాత్రమే. ఇందులో గతంలోనే రూ.687 కోట్లు చెల్లించిన నేపథ్యంలో కొనుగోలుదారులు మరో రూ.1,088 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. దాదాపు రూ.2500 కోట్ల మేర లబ్ధి జరగనున్న దృష్ట్యా భూమి కేటాయింపునకు కీలక వ్యక్తుల నుంచి ఒత్తిళ్లు తీవ్రమైనట్టు తెలుస్తోంది. సుప్రీం ఆదేశాల ప్రకారం విచక్షణతో నిర్ణయం తీసుకునే అధికారం కమిషనర్‌కు ఉందని, కనక, పాత ధర ప్రకారమే భూములను కేటాయించాలని జనార్దన్‌ రెడ్డిపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. అందుకు ఆయన అంగీకరించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే బదిలీ వేటు పడి ఉండవచ్చని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
  • Replies 56
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • tom bhayya

    15

  • Android_Halwa

    10

  • reality

    10

  • trent

    6

Posted

Janardhan Reddy is such a honest and hard working officer...

GHmC la chala kastha padindu...common man complaint kuda chala serious ga teesukune officer...he is a workaholic...Hyderabad la varsham padithe edo oka road mida kanipistadu pani chepichukuntu

Posted
1 minute ago, AlaElaAlaEla said:

4000 crores worth of lands aa? enti man ee dabbulu

Mari a kokapet n gadipet sorrounding lo lacs of crores of reality vundi. That’s why mukkodu GO 111 ni teseyyali ani sathavidala trying

Posted
3 minutes ago, Android_Halwa said:

Janardhan Reddy is such a honest and hard working officer...

GHmC la chala kastha padindu...common man complaint kuda chala serious ga teesukune officer...he is a workaholic...Hyderabad la varsham padithe edo oka road mida kanipistadu pani chepichukuntu

+1 

He has very good name. 

Posted

KTR ganiki ma ollo oka 20cr cost chese land kabja chesrani oka 10 times pina tweet chesina...no reply...vaniki brand image penchey celebrity tweets ni retweet cheyadaniki matram time untadi

Posted
Just now, snoww said:

+1 

He has very good name. 

Ae Department ki poina kuda we was well known and had a very honest image....

GHMC lo matram change ki chala kastapadindu...modernaisation and computerization of services introduce chesindi Janardhan reddy ae...parking vasool and all ...nice guy..!

Posted
8 minutes ago, AlaElaAlaEla said:

4000 crores worth of lands aa? enti man ee dabbulu

neeku already chala lands unnai ga baa

Posted

Evado ee news paper kaani... anta.com kante ghoranga rasukunnadu... proofs unte rayali, since that person is “honest”, let him come out tell the truth, instead of anta.com.

పాత ధర ప్రకారమే భూములను కేటాయించాలని జనార్దన్‌ రెడ్డిపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. అందుకు ఆయన అంగీకరించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే బదిలీ వేటు పడి ఉండవచ్చని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

I think this stink is non other than ABN Andrajothi, @snoww ?

Posted
9 minutes ago, Android_Halwa said:

Ummadi AP vunapudu ayina daridralu ivanni...

Em nijam ayyi undochu? ITeM kakkurthi paddada? Or its so complicated like you said those are appati daridralu?

Posted
1 minute ago, reality said:

Em nijam ayyi undochu? ITeM kakkurthi paddada? Or its so complicated like you said those are appati daridralu?

Appati daridrulu vunte me ktr daridrudu em peeking man ippudu 😜, ofcourse ktr kcr cheppakundane janardhan Reddy ni tesi engarantava 🤣

Posted
11 minutes ago, RaaoSaab said:

KTR ganiki ma ollo oka 20cr cost chese land kabja chesrani oka 10 times pina tweet chesina...no reply...vaniki brand image penchey celebrity tweets ni retweet cheyadaniki matram time untadi

Don’t worry he saw that post and contacted respected authorities to get his share from 20crs . 

Posted
Just now, trent said:

Appati daridrulu vunte me ktr daridrudu em peeking man ippudu 😜, ofcourse ktr kcr cheppakundane janardhan Reddy ni tesi engarantava 🤣

Naku adhe doubt undi qochen adigaa halwa ki emanna telso ani... ITeM ani antha clear ga mention chesa gaa...

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...