Jump to content

Recommended Posts

Posted
కూల్‌.. కూల్‌.. కేపిటల్‌ 
31-01-2019 04:08:57
 
636845045385273840.jpg
  • ఇంటింటికీ పైపు ద్వారా ఏసీ
  • రాజధానికి వినూత్న చల్లదనం
  • దుబాయ్‌ కంపెనీ ముందుకు
  • రూ.260కోట్లు,20వేల టన్నుల
  • సామర్థ్యంతో ఒక్కో ఏసీ ప్లాంటు
  • భూమి,డక్ట్‌ సర్కార్‌ ఇస్తే చాలు
  • ఖర్చంతా భరించనున్న కంపెనీ
  • 2.5 ఎకరాల్లో ఏర్పడే ప్లాంటుతో
  • 500 ఎకరాల్లోని భవంతికి ఏసీ
అమరావతి: ఇంటింటికీ పైపుల ద్వారా మంచినీళ్లు, గ్యాస్‌ సరఫరా చేస్తున్నట్లే, ఏపీ కూడా సరఫరా చేసే రోజులు వచ్చేశాయి. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో ఇంటింటికీ పైపుల ద్వారా ఏసీని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్‌డీఏ కమిషనర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ బుధవారం మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ ఈ విష యం తెలిపారు. దుబాయ్‌కి చెందిన తబ్రీద్‌ అనే సంస్థ నూతన రాజధానిలో ఈ సౌకర్యం కల్పించడానికి ముందుకు వచ్చింది. ఈ సంస్థతో సీఆర్‌డీఏ ఇప్పటికే దీనిపై ఒక ఒప్పందం కూడా కుదుర్చుకొంది. దుబాయ్‌లో ఇప్పటికే ఈ తరహా విధానం అమలు అవుతోంది. రాష్ట్ర ప్రభు త్వ అధికారులు అక్కడకు వెళ్లి చూసి సంతృప్తి చెందిన తర్వాత దానిని అమరావతిలో అమలు చేయడానికి పచ్చ జెండా ఊపారు. రాష్ట్ర ప్రభుత్వానికి పైసా ఖర్చు లేకుండా ఈ విధానం అమల్లోకి వస్తుండటం విశేషం. డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం అనే విధానం ద్వారా దీనిని అమలు చేస్తారు.
 
రెండున్నర ఎకరాల్లో ఏర్పాటయ్యే ఒక ప్లాంట్‌ సుమారుగా 500 ఎకరాల్లో నిర్మితమయ్యే భవనాలకు అవసరమయ్యే ఏసీని సరఫరా చేస్తుంది. భారీ కంప్రెసర్లతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తారు. దీని నుంచి పైపుల ద్వారా చల్లదనం ఈ భవనాలకు సరఫరా అవుతుంది. అక్కడ అంతర్గతంగా నిర్మించే పైపుల ద్వారా ప్రతి గది కి చల్లదనం చేరుతుంది. ఈ విధానంలో ఈ తరహా సౌకర్యం పొందేవారు విడిగా ఏసీ యంత్రాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఏసీ సరఫరా, నియంత్రణకు అవసరమయ్యే పరికరాలను మాత్రం గదుల్లో ఏర్పాటు చేసుకొంటే సరిపోతుంది. ఒక ప్లాంట్‌ ఏర్పాటుకు సుమారుగా రూ. 260 కోట్లు వ్యయం అవుతుంది. ఈ డబ్బును తబ్రీద్‌ సంస్థ తానే పెట్టుబడి పెడుతుంది. ఏసీ సరఫరా ద్వారా ఈ మొత్తాన్ని రాబట్టుకొంటుంది.
 
అహ్మదాబాద్‌ తరువాత..
 
భారతదేశంలో ఇప్పటివరకూ పైపులైన్‌ ఏసీ సదుపాయం గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని గిఫ్ట్‌ సిటీ అనే భ వనానికి ఉంది. 5 వేల టన్నుల ఏసీని ఈ భవనానికి సరఫరా చేస్తున్నారు. అమరావతిలో అంత కంటే భారీ గా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఒక్కో ప్లాంట్‌ 20 వేల టన్నుల సామర్ధ్యంతో ఏర్పాటు అవుతోంది. అవసరమై తే దానిని 40 వేల టన్నులకు విస్తరించగలిగే అవకా శం ఉంది. నగరంలో నిర్మాణాలు పెరుగుతున్న కొద్దీ ఇటువంటి ప్లాంట్లు మరిన్ని వ చ్చే అవకాశం ఉంది. దు బాయ్‌లో ఇటువంటి ప్లాంట్లు 90 ఉన్నాయి. దేశంలో ఇంత విస్తృత స్థాయిలో ఇటువంటి ప్లాంట్లు నవీన టెక్నాలజీతో అమరావతిలోనే ఏర్పాటు అవుతున్నాయి.
 
తన్నుకుపోయిన తబ్రీద్‌
 
అమరావతిలో పైపులైన్‌ ఏసీ ఏర్పాటుకు సింగపూర్‌ పవర్‌ సంస్థ కూడా పోటీ పడింది. తబ్రీద్‌ తక్కువ ధరకు అందివ్వడానికి ముందుకు రావడంతో దానిని ఎంపిక చేశారు. ప్రభుత్వం దానికి అవసరమైన భూమి, పైపుల ఏ ర్పాటుకు డక్ట్‌లో సదుపా యం మాత్రం ఇవ్వాల్సి ఉం టుంది. మంచినీరు, విద్యుత్‌ వంటి వాటి కోసం అమరావతిలో ప్రతి రోడ్డు వెం టా ఇప్పుడు సిమెంట్‌ డక్ట్‌లు నిర్మిస్తున్నారు. అందులోనే ఈ పైపులకు కూడా చోటు కల్పిస్తారు. అమరావతిలో కొత్త సచివాలయం, అసెంబ్లీ, రాజ్‌భవన్‌, హై కోర్టు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల నివాస భవనాలకు కలిపి రెండు ప్లాంట్లు అవసరం అవుతాయని అంచనా వేశారు. సింగపూర్‌ స్టార్టప్‌ సిటీ కి రెండు ఏసీ ప్లాంట్లు కావాలని అంచనా. ఆ సిటీకి కూడా ఈ సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. హ్యాపీ నెస్ట్‌ పేరుతో సీఆర్‌డీఏ నిర్మిస్తున్న నివాస సముదాయాలు 1- 2 దశల భవనాలకు కూడా ఈ సదుపాయం కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రైవేట్‌ సంస్థలు తమకు కూడా ఇటువంటి సదుపాయం కావాలంటే సంబంధిత సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.
Posted
1 hour ago, Idassamed said:

bl@st

Why blasting ?? 

Centralized heating cooling ki endukanta hadavidi ? 

 

Posted
9 hours ago, sboyr2r said:

Why blasting ?? 

Centralized heating cooling ki endukanta hadavidi ? 

 

Capital related a news aina pandage kada brother.

Posted

Jarigipoinaru

evaranna pin cheyandayya....future lo gurtu chesukovachu

Posted
31 minutes ago, Android_Halwa said:

Jarigipoinaru

evaranna pin cheyandayya....future lo gurtu chesukovachu

Appudu kotha paper cut vesthadu mana @psycopk thata Image result for telugu gifs arjun reddy

Posted
7 hours ago, Android_Halwa said:

Jarigipoinaru

evaranna pin cheyandayya....future lo gurtu chesukovachu

Dubai lo already vundi. Looks like same company will be doing in Amaravati too.  So not an impossible task. 

Government is giving them free land and infra. They only have to setup plant. And they can charge fee from government rest of their lives. 

 

 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...