Jump to content

Coastal Bank Chairman Chigurupati Jayaram Suspicious Death


Recommended Posts

Posted

US NRI. Media company owner in past , Pharma company owner , bank owner , investment company in US. 

Seems to be a big shot. 

Posted
636846470265237415.jpg
హైదరాబాద్ : ప్రముఖ ఎన్నారై, ఎక్స్‌ప్రెస్‌ టీవీ చైర్మన్ చిగురుపాటి జయరామ్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం దగ్గర హైవేపై కారులో జయరామ్‌ మృతదేహం లభ్యమైంది. కాగా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అసలేం జరిగింది..? ఈ ఘటనకు పాల్పడిందెవరు..? కుటుంబ సభ్యులే చౌదరిని పొట్టనపెట్టుకున్నారా..? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈయన అనుమానస్పద మృతిపై గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది.
 
 
అయితే చిగురుపాటి హత్యకు హైదరాబాద్‌‌లోనే కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులను, బ్యాంకు అధికారులను, కారు డ్రైవర్‌ను అధికారులు ప్రశ్నించారు. త్వరలోనే జయరాం మేనకోడలు శిఖా చౌదరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. మరో 24 గంటల్లో ఈ హత్య వ్యవహారం ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
Posted
8 hours ago, snoww said:

US NRI. Media company owner in past , Pharma company owner , bank owner , investment company in US. 

Seems to be a big shot. 

I wonder which passport he is holding? India or USA? 

Posted
50 minutes ago, Hitman said:

I wonder which passport he is holding? India or USA? 

Ilanti money vunna vallu india passport and us green card to vuntaru 

Posted
ఆస్తుల కోసమే చంపేశారు!
03-02-2019 03:49:06
 
636847625470769825.jpg
  • పోలీసుల అదుపులో శిఖా చౌదరి
  • ఆమె చుట్టూ తిరుగుతున్న జయరామ్‌ కేసు
  • శిఖా బాయ్‌ఫ్రెండ్‌ రాకేశ్‌పైనా అనుమానాలు
 
విజయవాడ, నందిగామ రూరల్‌, హైదరాబాద్‌/బంజారాహిల్స్‌, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పారిశ్రామికవేత్తల్లో ఒకరైన చిగురుపాటి జయరామ్‌ హత్య కేసులో పోలీసులు కీలక చిక్కుముడి వీడుతోంది. హత్యకు సూత్రధారి, పాత్రధారి ఆయన మేనకోడలు శిఖా చౌదరి అని నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. విజయవాడలోని పెనమలూరులో ఉంటున్న జయరామ్‌ సోదరి కుమార్తెనే ఈ శిఖా చౌద రి. కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శిఖాతోపాటు ఆమె సోదరి మనీషా, శిఖా బాయ్‌ఫ్రెండ్‌ రాకేశ్‌ చౌదరి స్నేహితుడు శ్రీకాంత్‌ రెడ్డిని విచారిస్తున్నారని తెలుస్తోంది.
 
ఆస్తులన్నీ ఆమె పేరిటే
రూ.2000 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధినేత అయిన జయరామ్‌ తన ఆస్తుల్లో కొన్నిటిని శిఖా చౌదరి పేరిటే ఉంచా డు. కానీ, వాటి డాక్యుమెంట్లను మాత్రం తన వద్దనే ఉంచుకున్నాడు. వీటి గురించి కుటుంబంలో తరచూ గొడవలు జరిగేవి. వ్యాపార విషయాల్లో శిఖా చౌదరి జోక్యం పెరగడంతో జయరామ్‌ భార్య పద్మజ ఆగ్రహం వ్యక్తం చేశారని వాచ్‌మన్‌ వెంకటేశ్‌ తెలిపాడు. ఇక, హత్య జరిగిన మరుసటి రోజు అంటే, 31వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో శిఖా చౌద రి జూబ్లీహిల్స్‌లోని జయరాం ఇంటికి వచ్చి జయరామ్‌ గది, బీరువా తాళాలు ఇవ్వాలని వాచ్‌మన్‌ వెంకటేశ్‌తో వాదులాట కు దిగింది. తాను ఇవ్వనని అతను చెప్పడంతో పెద్ద పెద్ద కేక లు వేసింది.
 
శిఖాతోపాటు ఆమె స్నేహితుడు రాకేశ్‌ కూడా వచ్చినట్టు వెంకటేశ్‌ తెలిపాడు. వెంకటేశ్‌ కథనం ఆధారంగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కాగా, జయరామ్‌ మృతదేహం కృష్ణా జిల్లాలోని కంచికచర్ల ఠాణా పరిధి లో లభించినా.. హత్య మాత్రం హైదరాబాద్‌లోనే జరిగి ఉం టుందని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం జరగడానికి 24 గంటల ముందే జయరామ్‌ హత్య జరిగిందని ఫోరెన్సిక్‌ వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, జనవరి 30న మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఇంటి నుం చి బయటకు వచ్చిన జయరామ్‌ మృతదేహం 31వ తేదీ రాత్రి 11 గంటలకు నందిగామ సమీపంలోని ఐతవరంలో కనిపించింది.
 
ఈ మధ్య కాలంలో ఆయన సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ జూబ్లీహిల్స్‌ దస్‌పల్లా హోటల్‌తోపాటు గచ్చిబౌలిలోని శిఖా చౌదరి ఇంటి వద్ద ఉన్నట్లు చూపించా యి. సుమారు 10 గంటలపాటు హోటల్‌ వద్దనే జయరామ్‌ కదలికలు ఉన్నాయని నిర్ధారణ అ యింది. దాంతో, అక్కడికి వెళ్లి పో లీసులు విచారణ జరిపారు. హో టల్‌లో సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. అక్కడ జయరా మ్‌ ఓ చానల్‌ యాంకర్‌తో ఉన్న ట్లు తేలింది. జనవరి 28న ఆమె పేరిటే రూమ్‌ బుక్‌ చేసుకున్నట్టు తెలిసింది.
 
హోటల్‌లోకి జయరామ్‌ కారు వెళ్లిన దృశ్యాలు ఫుటేజీలో కనిపిస్తున్నా, బయటకు వెళ్లిన దృశ్యాలు మాత్రం లేవు. పోలీసులకు ఇదొక చిక్కుముడిగా మారింది. అదే సమయంలో, జనవరి 30వ తేదీ రాత్రి 7 గంటల ప్రాంతంలో జయరామ్‌ గచ్చిబౌలిలో ఉన్న శిఖా చౌదరి ఇంటికి వెళ్లారు. ఆయన కారు వచ్చినట్లు అక్కడి రిజిస్టర్‌లో నమోదై ఉంది. తర్వాత కాసేపటికే ఆమె ఇంటి నుంచి బయటకు వెళ్లింది. తిరిగి తెల్లవారుజామున మూడు, 4 గంటలకు వచ్చింది. ఈ సమయంలో జయరామ్‌ ఎక్కడ ఉన్నారని పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, హోటల్‌లో ఉన్న మహిళ యాంకర్‌ కాదని, ఎక్స్‌ప్రెస్‌ టీవీలో లోగడ యాంకర్‌గా పనిచేసి.. ఇప్పుడు జయరామ్‌కు పీఏగా వ్యవహరిస్తోందని మరికొందరు చెబుతున్నారు. ఆమె మాట్లాడుతుండగానే ఆయన మరో వ్యక్తికి ఫోన్‌ చేసి రూ.6 లక్షలు తెప్పించుకున్నారని తెలిసింది.
 
విష ప్రయోగమేనా!?
జయరామ్‌కు బయట మద్యం తాగే అలవాటు లేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. కానీ, ఆయన తలపై బీరు బాటిల్‌తో కొట్టినట్టు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దాంతో, జయరామ్‌ తలపై హైదరాబాద్‌లోనే దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తాము చెప్పినట్లు చేయకపోవడం వల్లే దుండగులు జయరామ్‌ను బీరు బాటిల్‌తో తలపై కొట్టినట్టు అనుమానిస్తున్నారు. శిఖా ఇంట్లో గానీ, హైదరాబాద్‌లో మరో చోట గానీ బీరులో విషం కలిపి జయరామ్‌తో తాగించి, చంపేశారని అనుమానిస్తున్నారు. అందుకే, ఆయన నోరు, ముక్కు నుంచి రక్తస్రావం జరిగిందని చెబుతున్నారు. అనంతరం బీరు సీసాతో తలపై కొట్టి, ఊపిరాడకుండా చేసి చంపేశారని అనుమానిస్తున్నారు. ఈ విషయంలో నందిగామ వైద్యులు ఇచ్చే పోస్టుమార్టం నివేదిక కీలకంగా మారనుంది.
Posted
Just now, r2d2 said:

చానల్‌ యాంకర్‌తో????

కాగా, హోటల్‌లో ఉన్న మహిళ యాంకర్‌ కాదని, ఎక్స్‌ప్రెస్‌ టీవీలో లోగడ యాంకర్‌గా పనిచేసి.. ఇప్పుడు జయరామ్‌కు పీఏగా వ్యవహరిస్తోందని మరికొందరు చెబుతున్నారు

Posted

విజయవాడ సమీప నిడమానూరులో వందెకరాల లావాదేవీలకు సంబంధించిన వివాదంపైనా  విచారిస్తున్నారు.

Posted
Just now, snoww said:

విజయవాడ సమీప నిడమానూరులో వందెకరాల లావాదేవీలకు సంబంధించిన వివాదంపైనా  విచారిస్తున్నారు.

cc @tacobell fan @idibezwada @trent @JambaKrantu 

entha vuntadi acre akkada

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...