snoww Posted February 3, 2019 Report Posted February 3, 2019 రైతుకు భిక్షమేస్తున్నారా? నెలకు రూ.500తో ఒరిగేదేంటి? మేం సామాజిక పింఛన్లను రూ.2000 ఇస్తున్నాం కేంద్ర బడ్జెట్ వట్టి డొల్ల.. ఏపీ ప్రస్తావనే లేదు: సీఎం చంద్రబాబు ఈనాడు, అమరావతి: సంక్షోభంలో ఉన్న వ్యవసాయరంగాన్ని ఆదుకోవడానికి, నిరుద్యోగసమస్యను అధిగమించడానికి కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. నెలకు రూ.500 చొప్పున రైతుకు భిక్షమేస్తున్నారా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పింఛన్లను నెలకు రూ.2000 చొప్పున ఇస్తోందని గుర్తు చేశారు. చివరి బడ్జెట్‌లోను ఆంధ్రప్రదేశ్‌కు భాజపా ద్రోహం చేసిందని, రాష్ట్ర ప్రస్తావనే లేదని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్ ఒట్టి డొల్లగా అభివర్ణించారు. శనివారం ఆయన పార్టీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘‘ఐదు ఎకరాలలోపు ఉన్న రైతులకు ఏటా రూ.6వేలు, అసంఘటిత రంగంలోని కార్మికులు రూ.100 కడితే 60ఏళ్లు నిండాక పింఛను, ఆదాయపన్ను పరిమితి పెంపు వంటివి ప్రకటించినా... వాటివల్ల ప్రజలకు పెద్దగా ఉపయోగమేమీ ఉండదు. రోజుకి రూ.16చొప్పున ఇస్తే రైతుకి ఒరిగేదేంటి?...’’ అని ప్రశ్నించారు. కేంద్ర బడ్జెట్‌పై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా? అన్న అంశంపై టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్న వారి నుంచి అభిప్రాయసేకరణ జరపగా... 90 శాతం మంది అసంతృప్తిగా ఉన్నట్టు తెలిపారు. ‘‘భాజపా వైఫల్యం వల్లే దేశంలో నిరుద్యోగం పెరిగింది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే మన రాష్ట్రం వెయ్యి రెట్లు ఉత్తమం. 14లక్షల మందికి ఉపాధి కల్పించాం. ఒక్క ‘కియా’లోనే వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తున్నాయి. ఆటోమొబైల్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ సంస్థలను తెచ్చాం. ఎంఎస్‌ఎంఈ పార్కుల్లోను పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాం...’’ అని వివరించారు. ‘‘శుక్రవారం శాసనసభ చరిత్రలో నిలిచిపోయే రోజు. అంతమంది ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలతో రావడం ఎప్పుడూ జరగలేదు. దిల్లీలోను తెదేపా ఎంపీలు నల్ల చొక్కాలతో ధర్నా చేశారు. ప్రత్యేకహోదా సాధన సమితి బంద్ విజయవంతమైంది. అన్యాయాన్ని నిలదీసేందుకే ఈ నిరసనలు. పాల్గొన్నవారందరికీ ధన్యవాదాలు...’’ అని పేర్కొన్నారు. కేంద్రం ఈబీసీ రిజర్వేషన్లకు ఆదాయపరిమితిని రూ.8 లక్షలుగా పేర్కొంటూ... ఆదాయపన్నుకి మాత్రం రూ.5లక్షలుగా నిర్ణయించిందని... ఇలాంటి వైరుధ్యాలు చాలా ఉన్నాయన్నారు. పింఛన్లు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సాయం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య సుమారు 1.5 కోట్ల మంది ఉంటారని, వారితో వచ్చే కుటుంబసభ్యులు, బంధువుల్ని కలిపితే మొత్తం 2-3 కోట్ల మంది అవుతారని చంద్రబాబు పేర్కొన్నారు. అంతమందిని నేరుగా కలుసుకునే అవకాశాన్ని పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ‘‘పసుపు-కుంకుమ అనగానే తెదేపా గుర్తురావాలి. నాయకత్వలోపాల్ని అధిగమించాలి. సరిగ్గా దృష్టి పెడితే ప్రతి గ్రామం తెదేపాకి కంచుకోటే....’’ అని తెలిపారు. నేను రాష్ట్రానికి మొదటి డ్రైవర్‌ని ‘‘మీరు ఆటోల్లో ప్రయాణికుల్ని సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తారు. నేను రాష్ట్ర పాలనను సురక్షితంగా నడుపుతూ ప్రజలు సంతోషంగా జీవించేలా చూస్తున్నాను. మీరు ఒక డ్రైవింగ్ సీటులో కూర్చుంటే... నేను మరో డ్రైవింగ్ సీటులో కూర్చుని నడుపుతున్నాను. నేను రాష్ట్రానికి మొదటి డ్రైవర్‌ని. మీరంతా నా వెంట నడవాలి...’’ అని ఆటోడ్రైవర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆటోలకు జీవితకాల పన్ను మినహాయించినందుకు ఆటోడ్రైవర్లు శనివారం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్దకు వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వీరిలో కొందరు మహిళా డ్రైవర్లూ ఉన్నారు. రహదారిపన్ను రద్దుతో 3.70లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఖాకీ చొక్కా ధరించి... డైవర్లను ఎక్కించుకొని కొంత దూరం ఆటోను నడిపారు. ‘‘ముఖ్యమంత్రి జిందాబాద్. మళ్లీ మీరే సీఎంగా రావాలి. మీకు అండగా ఉంటాం...’’ అని వారు నినాదాలు చేశారు. రూ.5వేలు పన్ను రద్దు చేసి మేలు చేశారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఆటోలకు జీవితకాల పన్ను, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను మినహాయించడం ద్వారా 9.79లక్షల వాహనాల యజమానులకు రూ.66.60 కోట్ల ప్రయోజనం చేకూరినట్టు వెల్లడించారు. ‘‘3.70 లక్షల మంది ఆటోడ్రైవర్లు తెదేపా జెండాలు ఎగరవేయాలి. మీ ఆటోల వెనుక రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రదర్శించి ప్రజల్ని చైతన్యపరచాలి. మీరంతా నా కోసం కాదు... రాష్ట్రం కోసం పనిచేయాలి. పేద ఆటోడ్రైవర్లను ఎలా ఆదుకోవాలి, వారి ఆదాయం ఎలా పెంచాలని ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రవేశపెడతాం. ఇంధన ఖర్చులు తగ్గిస్తాం...’’ అని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆటోడ్రైవర్లు ఒక సంఘంగా ఏర్పడి, వారి సమస్యల్ని తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తానని చంద్రబాబు తెలిపారు. ప్రతి ఏటా బీమా చెల్లింపు భారమవుతోందని ఆటోడ్రైవర్లు ఆయన దృష్టికి తేగా... వారందరికీ ఏవిధంగా బీమా చేయాలో ఆయా సంస్థలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. Quote
SinnaBabuSillyFellow Posted February 3, 2019 Report Posted February 3, 2019 Picha naaa... Babu gaadu Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.