Jump to content

Siggundaali YCheepP gallaki


Recommended Posts

Posted

* పత్రికా ప్రకటన *

ఈరోజు అనగా 04-02-2019 వ తేదీన గౌరవ ఆంధ్రప్రదేశ్ శాసన సభ ప్రతిపక్ష నాయకులు YSRCP అధ్యక్షులు శ్రీ Y.S జగన్ మోహనరెడ్డి గారు ఈ రోజు అనగా ది04-02-19 వ తేదీన ఢిల్లీ లో భారత చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికిఆంధ్రప్రదేశ్ పోలీసు చీఫ్ డి జి పి, ఆర్.పి ఠాకూర్ గారి పైన, ఇంటిలిజెన్స్ చీఫ్ ఏ.బి.వెంకటేశ్వర రావు గారి పైన, DIG L&O జి. శ్రీనివాస్ గారి పైన, నిరాధారమైన ఆరోపణలు చేస్తూ, అబాండాలు వేసి సదరు విషయాలు ప్రెస్ మీట్లో మీడియా వారికి వెల్లడించడం, ఆంద్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. నిజాయితీగా సమర్ధవంతము గా పని చేస్తున్న పోలీసు అధికారుల మనో దైర్యం దెబ్బ తీసే విధంగా మరియు కులం పేరుతో నిందలు వేయడం మమ్ములను అనగా రాష్ట్ర పోలీసులను తీవ్రంగా బాధించింది. ఏ పార్టీ అధికారం లో ఉన్నా కూడా ఎప్పుడు పని చేస్తున్న సిబ్బంది, అధికారులే పని చేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి అని తెలియ పర్చుకొంటున్నాము.

ఈ సందర్బముగా DSP ల ప్రమోషన్ల లో 37 మందికి గాను 35 మందికి ఒకే సామజిక వర్గం వారికీ, అడ్డదారులలో ప్రమోషన్లు కల్పించారు అనే విషయం పూర్తిగా సత్యదూరమైనది. DSP ప్రమోషన్ల విషయంగా హై కోర్ట్ వారిచే ఫైనలైజ్ చేసిన సీనియారిటీ లిస్ట్ మేరకు కమిటీ సమావేశమై అర్హులైన వారిని కులమతాలకు అతీతంగా, శాఖ పరమైన నిబంధనలు మేరకు, రాజ్యాంగం కల్పించిన హక్కుల మేరకు SC ,ST మొదలైన విషయంగా రోస్టర్ నిబంధనలు పాటించి ప్రమోషన్లు ఇవ్వబడినవి. అంతే గాని దానికి భిన్నంగా కుల ప్రాతిపదికిన జరగలేదు అన్న విషయం తెలుసు కోవాలని కోరుతున్నాము.

మొత్తం 91 సబ్ డివిజన్లు ఉండగా అందులో OC -32, BC -30, SC -06, ST -04, ముస్లిమ్స్ -05, IPS అధికారులు- 05, ఖాళీలు -09, వున్న విషయం గమనించాలని కోరుచున్నాము.

ఇటీవల మా ఆంధ్రప్రదేశ్ గౌరవ డి జి పి శ్రీ ఆర్.పి.ఠాకూర్ ఐ పి ఎస్ గారు మరియు ఇతర ఉన్నతాధికారుల చొరవతో గౌరవ సి ఎం గారు మరియు హోమ్ మినిస్టర్ గార్లు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2019 మంది పోలీస్ కానిస్టేబుళ్ల నుండి హెడ్ కొనిస్టేబుళ్లుగా మరియు 566 మందికి హెడ్ కానిస్టేబుళ్ల నుండి ఏఎస్ఐ లు గామొత్తం 3151 మందికి ప్రమోషన్ లకు ఉత్తరువులు వెలువడినాయి. అదే విధంగా సాయుధ దళములలో పని చేయుచున్న పోలీసులకు, మహిళలకు కూడా అతి త్వరలో ప్రమోషన్లు కల్పించుటకు చర్యలు తీసుకోబడుచున్నవి. ఈ క్రమము లో అనేక మందికి ప్రమోషన్ లు కల్పించడం జరిగినది.మిగిలిన వారు కూడా ట్రైనింగ్ పూర్తి చేసుకొని వచ్చినందున వారికి కూడా అతి త్వరలో ప్రమోషన్ లు లభించనున్నాయి.ఈ విధంగా ప్రమోషన్ లు ఎన్నడూ లేని విధంగా లభించడం లో తమరు ఎందుకు బాధ పడుతున్నారో అర్ధం కావడం లేదు.

తమరు రాష్ట్ర వ్యాప్తముగా పాద యాయాత్ర చేసిన క్రమములో పోలీసు సిబ్బంది, అధికారులు ఎంతో చాక చక్యంగా సమస్యలు లేకుండా మీ యొక్క యాత్ర పూర్తి కావడానికి తోడ్పడినారు.అట్టి పోలీసు శాఖ ఉన్నతాధికారుల పై అబాండాలు వేయడం ధర్మం కాదని, గుడ్డ కాల్చి ఎదుటి వారి మొఖం పైన వేసే చందంగా ఉందని తెలియజేస్తున్నాము.

రాబోవు రోజులలో సార్వత్రిక ఎన్నికలు జరగన్నునందున వివిధ పార్టీలకు, నాయకులకు ఎవరి జండాలు, అజెండాలు వారికి ఉంటాయని వాటి మేరకు వారు పోలీసుల పై నిందలు మోపే అవకాశం ఉంటుందని కనుక పోలీసు అధికారులు రాజ్యాంగం మేరకు చట్ట పరిధిలో నిబంధనల మేరకు నిక్కచ్చిగా వ్యవహరించి శాంతి భద్రతలు కాపాడాలని ఈ క్రమం లో ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర ప్రదేశ్ పోలీసు అధికారులు సంఘం ప్రధాన కార్యదర్శి దళవాయిసుబ్రమణ్యం పోలీసు అధికారులు సంఘం తరపున తెలియపరచారు.

Posted

రాయల సీమ లో రెడ్డి సామజిక వర్గ జనాభా ఎంత ? రెడ్లకి ఇచ్చిన YCP సీట్లు ఎన్ని ? రాయలసీమలో 52 అసెంబ్లీ నియోజక వర్గాలలో 9 SC రిజర్వుడ్ నియోజకవర్గాలు తీసివేయగా మిగిలిన 43 నియోజకవర్గాలలో 35 నియోజకవర్గాలలో 'తన' కులం వారికే జగన్ మోహన్ రెడ్డి సీట్లు ధారాదత్తం చేసి మిగిలిన అన్ని కులాల వారికి కేవలం 8 సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో కేవలం 12% మాత్రమే ఉన్న 'రెడ్డి' వర్గం వారికి 82% సీట్లు కేటాయించి, 68% ఉన్న మిగిలిన OC మరియు BC కులాల వారికి కేవలం18% సీట్లు మాత్రమే ఇచ్చాడు. రాయలసీమలో బలమైన 'బలిజ' వర్గానికి కేవలం ఒక సీటు మాత్రమే కేటాయించి, 'కమ్మ' వర్గానికి, యాదవ, గౌడ, వైశ్య వర్గాల వారికి కనీసం ఒక్క స్థానాన్ని కూడా కేటాయించ లేదు. 

ఇకబోతే 
YSRCP పార్లమెంట్ అభ్యర్ధుల వివరాలు 
* నంద్యాల - ఎస్పీ వై #రెడ్డి
* అనంతపురం - అనంత వెంకట్రామి#రెడ్డి
* హిందూపురం - శ్రీధర్‌ #రెడ్డి
* కడప - వైఎస్‌ అవినాష్‌ #రెడ్డి
* నెల్లూరు - మేకపాటి రాజమోహన్‌ #రెడ్డి
* రాజంపేట - మిథున్‌ #రెడ్డి
రాయలసీమ జిల్లాల్లో ఒక్క కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం తప్ప మిగిలిన జనరల్ కేటగిరి నియోజకవర్గాల్లో మొత్తం '#రెడ్డి' కులం అభ్యర్ధులనే నిలబెట్టి జగన్ మోహన్ రెడ్డి నిస్సిగ్గు గా తన కుల తత్వాన్ని చాటుకున్నాడు. 

ఏమి అప్పుడు ఏమి అయినాయి మీ నోర్లు ? ఎందుకీ తెరిచి మాటాడలేదు మీరు ? పోనీ ఇవాళ అనంతపూర్ లో చూసుకొన్న 14 నియోజక వర్గాల్లో ఇంచార్జి లు ఎవరు ? అందులో 12 మంది రెడ్లు కాదా ?

Posted
2 minutes ago, MiryalgudaMaruthiRao said:

Calling langas and teddys 

jagan teddy fans are in musugu mode riht now under langa batch 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...