Smallpappu Posted February 8, 2019 Report Posted February 8, 2019 దిల్లీ: భారత దేశంలో అమలవుతున్న ఆదాయ పన్నును రద్దు చేయాలని భాజపా నేత సుబ్రహ్మణ్య స్వామి కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత చేయాల్సిన మొట్టమొదటి పని ఇదే అని ఆయన అభిప్రాయపడ్డారు. ‘ఇప్పటికే దేశంలో వ్యవసాయదారులు పన్ను చెల్లించడంలేదు. పట్టణాల్లో నివసించే నిరుపేదలు కూడా పన్ను చెల్లించరు. ధనవంతులు చార్టెడ్ అకౌంటెంట్‌లను పెట్టుకుని తక్కువ పన్ను చెల్లిస్తుంటారు. పన్నుల వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే వారు కేవలం మధ్య తరగతి ప్రజలే. అందుకే వారు ఇబ్బంది పడకుండా ఆదాయ పన్ను విధానాన్ని రద్దు చేయాలి’ అని ఆయన అన్నారు. ప్రపంచంలో మూడో శక్తిమంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు. కొనుగోలు శక్తిలో భారత వృద్ధి రేటు ఏడు శాతానికి మించినప్పటికీ తన దృష్టిలో ఇది చాలా తక్కువ అని, ఇప్పటికే వృద్ధి రేటు పది శాతానికి మించాల్సి ఉందని తెలిపారు. పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక విధానాల వల్ల దేశ వృద్ధి రేటు ఏడు నుంచి ఎనిమిది శాతానికి చేరుకుందన్నారు. భాజపా రెండోసారి గెలిస్తే కేంద్ర ఆర్థిక మంత్రిగా పగ్గాలు చేపడతారా? అని విలేకరులు ప్రశ్నించగా... తాను ఏదీ ఆశించట్లేదని, అవకాశం వస్తే మాత్రం వదులుకోనని సమాధానమిచ్చారు. ఇలాంటి వాటికి అదృష్టం కూడా కలిసిరావాలన్నారు Quote
alpachinao Posted February 8, 2019 Report Posted February 8, 2019 Vedi chivarakari korika finance ministry isthey bodi ki udigam chesthadu 80+ yrs ayina aasha chavala Quote
Recommended Posts
Join the conversation
You can post now and register later. If you have an account, sign in now to post with your account.