Jump to content

Recommended Posts

Posted
23/42 కోట్లు: ఆధార్‌-పాన్‌ అనుసంధానం

 

7brk-pandkd1.jpg

దిల్లీ: కేవలం 23 కోట్ల మందే పాన్‌ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేశారని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర వెల్లడించారు. దేశంలో 42 కోట్ల మందికి పాన్‌ కార్డులు జారీ చేయగా అందులో సగమే అనుసంధానం కావడం గమనార్హం. ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి సుప్రీం కోర్టు 2019, మార్చి 31ని తుది గడువుగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

‘పాన్‌తో ఆధార్‌ అనుసంధానం వల్ల నకిలీ కార్డుల గురించి తెలుస్తుంది. అనుసంధానం చేయని కార్డులను మేం తొలగించొచ్చు. పాన్‌తో ఆధార్‌ అనుసంధానిస్తే పాన్‌.. బ్యాంక్‌ ఖాతాతో అనుసంధానం అవుతుంది. అప్పుడు పన్నుల శాఖ వ్యక్తుల కొనుగోలు పద్ధతులను సులభంగా గమనించగలదు. అలాగే అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుస్తుంది’ అని చంద్ర అన్నారు.

ఆదాయపు పన్ను చట్టంలోని 139 ఏఏ(2) సెక్షన్‌ ప్రకారం 2017, జులై 1లోపు పాన్‌ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఆధార్‌తో అనుసంధానం చేయాలి. ఈ ఏడాది 6.31 కోట్ల రిటర్నులు దాఖలు కాగా అందులో 5.44 లక్షల మంది పాతవారేనని సుశీల్‌ చంద్ర తెలిపారు. ఇప్పటి వరకు 95 లక్షల కొత్త పన్ను చెల్లింపు దారులను శాఖ పరిధిలోకి తీసుకొచ్చామని వెల్లడించారు. పన్ను రేట్లు తగ్గిస్తే పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరుగుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. వేర్వేరు విధానాల ద్వారా పన్నులు చెల్లించని చాలామందిని గుర్తించామన్నారు. అలా గుర్తించిన వారికి 21 రోజుల్లోపు జవాబు ఇవ్వాలని సమాచారం ఇస్తున్నామని చంద్ర తెలిపారు. 

విదేశాల నుంచి నగదు పొందిన వారు, లక్షలు పెట్టి ఆస్తులు కొన్నవారికి ఆ సమాచారం చూపించి దానికి సమాధానం ఏంటని ప్రశ్నిస్తున్నామని చంద్ర తెలిపారు. 125 కోట్లకు పైగా జనాభా, 7.5 శాతం వృద్ధిరేటు ఉన్న దేశంలో కోటికి పైగా సంపాదిస్తున్నట్టు దాఖలైన రిటర్నులు కేవలం 1.5 లక్షలేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తులు కొనుగోలు చేస్తూ పన్ను కట్టని వారికి శిక్షలు తప్పవన్నారు.

Posted
Quote

విదేశాల నుంచి నగదు పొందిన వారు, లక్షలు పెట్టి ఆస్తులు కొన్నవారికి ఆ సమాచారం చూపించి దానికి సమాధానం ఏంటని ప్రశ్నిస్తున్నామని చంద్ర తెలిపారు. 

 ఆస్తులు కొనుగోలు చేస్తూ పన్ను కట్టని వారికి శిక్షలు తప్పవన్నారు.

 

Posted
Just now, snoww said:

 

bokka edaina konetappudu kaduthunnam ga, registration n gst . inka em kattali anta vachi ongomanu

Posted
2 minutes ago, trent said:

bokka edaina konetappudu kaduthunnam ga, registration n gst . inka em kattali anta vachi ongomanu

properties kontunna money ekkadiki nundi vachindo adugutharu emo. 

Posted
Just now, snoww said:

PAN card vundi aadhar card leni NRI's em cheyyalo 

use mom dad bro sis names. india poyinapudu adhar apply kavali ante. 

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...