Jump to content

List of sitting MLAs MPs moving to YCP from TDP this week


Recommended Posts

Posted
TDP MP Thota Narasimham Joins YSR Congress Party - Sakshi

వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిన ఎంపీ తోట నరసింహం

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీడీపీకి కోస్తా జిల్లాల్లో భారీ షాక్‌ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. లోక్‌సభలో టీడీపీ పక్షనేత, కాకినాడ సిట్టింగ్‌ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే బాపనమ్మ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఆయన సమక్షంలో పార్టీలో చేరారు.

వీరితో పాటు విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌, నటుడు రాజారవీంద్ర కూడా వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్‌ జగన్‌ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేతగా ఉన్న నరసింహం ఇప్పటికే టీడీపీకి, పార్లమెంట్‌ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నరసింహం చేరికతో ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలం పుంజుకోనుంది. 

pvp.jpg
ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్‌

 

pvp1.jpg
నటుడు రాజారవీంద్ర

  • Replies 254
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • snoww

    76

  • Smallpappu

    37

  • JambaKrantu

    22

  • DaleSteyn1

    15

Posted


MV-Ratna-Bindu.jpg
పాదయాత్ర స్ఫూర్తితో చేరా: రత్నబిందు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని విజయవాడ మాజీ మేయర్‌ రత్నబిందు అన్నారు. వైఎస్‌ రాజశేఖరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంతో తాను మేయర్‌గా పనిచేశానని, ఆయన కుటుంబంలోకి మళ్లీ రావడం హ్యాపీగా ఉందని తెలిపారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన పథకాలను జనంలోకి తీసుకెళ్లడం వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. వైఎస్‌ జగన్‌ చేసిన పాదయాత్ర స్ఫూర్తితో పార్టీలో చేరినట్టు తెలిపారు. వైఎస్సార్‌సీపీ గెలుపు కోసం శాయశక్తుల కృషి చేస్తానని అన్నారు. విలేకరుల సమావేశంలో విజయసాయిరెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Posted
On 2/16/2019 at 6:38 AM, psycopk said:

Lol VSR ichada list

Musaloda list complete aindi inka expand aindi.. inka aina aa yellow banisa mathulonunchi bayatiki raa..

Posted
5 minutes ago, snoww said:

rayapati confirmed ? 

don't know but Konathaala confirmed

Posted
టీడీపీకి బుట్టా రేణుక షాక్! 
15-03-2019 20:56:57
 
636882802448716578.jpg
కర్నూలు: టీడీపీకి ఎంపీ బుట్టా రేణుక షాకివ్వబోతున్నారని సమాచారం. టీడీపీకి ఆమె గుడ్‌ బై చెప్పబోతుందనే ప్రచారం జరుగుతోంది. శనివారం ఇడుపులపాయలో వైసీపీ అధినేత జగన్‌ను కలవనున్నారని తెలుస్తోంది. రేణుక తిరిగి సొంత గూటికి చేరాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసం కుటుంబసభ్యులతో సమావేశమయ్యారు. కుటుంబసభ్యుల సూచనలతో ఆమె టీడీపీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
 
కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి టీడీపీలో చేరడంతో బుట్టా రేణుకకు టికెట్ ఇవ్వలేమని టీడీపీ అధిష్టానం స్పష్టం చేసినట్లు వినికిడి. అయితే ఆమె టీడీపీ మరో ప్రతిపాధన పెట్టినట్లు ప్రచార జరుగుతోంది. ఆదోని నుంచి ఎమ్మెల్యేగా పోటీచేయాలని టీడీపీ సూచించింది. టీడీపీ ప్రతిపాధనను ఆమె తిరష్కరించింది. ఆదోని నుంచి పోటీ చేసేందుకు రేణుక ససేమిరా అంటోంది. రేణుకను వదులుకోవడానికి టీడీపీ సిద్ధం లేదు. అందుకోసం ఆ పార్టీ మరో ఆఫర్ టీడీపీ ఇచ్చింది.రాజ్యసభకు పంపుతామని టీడీపీ అధిష్టానం హామీ ఇచ్చింది. అయినా పార్టీలో కొనసాగేందుకు బుట్టా రేణుక ఇష్టపడలేదు.
Posted
టీడీపీకి షాక్.. గన్నవరం ఎమ్మెల్యే రాజీనామా 
15-03-2019 20:18:56
 
636882794285287715.jpg
కృష్ణా: ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. పి.గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి పార్టీకి రాజీనామా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తానని పులపర్తి ప్రకటించారు. కాగా 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పులివర్తి... వైసీపీ అభ్యర్థి కొండేటి చిట్టిబాబుపై 13,505 మెజార్టీతో గెలుపొందారు.
 
 
కాగా.. ఈ ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ నేలపూడి స్టాలిన్‌బాబుకు ఇవ్వడంతో అసంతృప్తికి లోనైన ఆయన రాజీనామా చేసి స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
Posted
నేను పార్టీ మారను.. కానీ..: జేసీ

15jcbrk1a.jpg

అమరావతి: తెదేపా స్క్రీనింగ్ కమిటీపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్‌ పరిధిలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని ఆయన పట్టుపట్టారు. కనీసం ముగ్గురు సిట్టింగులను మారిస్తే తప్ప అనంతపురం లోక్‌సభ స్థానం గెలవలేమని కమిటీకి చెప్పారు.  తాను సూచించిన అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వకుంటే తాను పోటీకి దూరంగా ఉంటానని  తెలిపారు. శింగనమల, కల్యాణదుర్గం, గుంతకల్లు ఎమ్మెల్యేలను మార్చాలని జేసీ పట్టుపట్టారు.

స్క్రీనింగ్ కమిటీ సభ్యులతో భేటీ అనంతరం ఆయన ఆగ్రహంగా బయటకు వచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడు సీట్లను మార్చాలని స్క్రీనింగ్‌ కమిటీకి సూచించానన్నారు. తన సూచనలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారో, లేదో తనకు తెలియదని చెప్పారు. సిట్టింగ్‌ సభ్యులను మార్చినా గట్టిగా పోరాడాల్సి ఉంటుందని, సిట్టింగ్‌లను మార్చకపోతే అనంతపురం ఎంపీ సీటులో ఓటమి తప్పదని వ్యాఖ్యానించారు. తాను ఓడిపోయేందుకు సిద్ధంగా లేనన్నారు. పార్టీ మారను గానీ పోటీ చేయాలో, లేదో ఆలోచిస్తానని జేసీ అన్నారు.

Join the conversation

You can post now and register later. If you have an account, sign in now to post with your account.

Guest
Reply to this topic...

×   Pasted as rich text.   Paste as plain text instead

  Only 75 emoji are allowed.

×   Your link has been automatically embedded.   Display as a link instead

×   Your previous content has been restored.   Clear editor

×   You cannot paste images directly. Upload or insert images from URL.

×
×
  • Create New...